పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో చమురు మరియు గ్యాస్ అవకాశాలపై ఈ రోజు సమావేశం
శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతానికి లక్ష కోట్ల విలువైన చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి అవి 2025 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నామని చెప్పారు.
చమురు మరియు గ్యాస్ రంగంలో ఉన్న అవకాశాలలో చురుకుగా పాల్గొనాలని పెట్టుబడిదారులకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు
Posted On:
24 SEP 2021 4:58PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతంలో (ఎన్‌ఈఆర్) అప్‌స్ట్రీమ్ ఆయిల్ & గ్యాస్ అవకాశాలను వివరించేందుకు భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ రోజు గౌహతిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమ సర్వసభ్య సమావేశానికి కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షత వహించారు. అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ, పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి మరియు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాం మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఓపిఎన్‌జి సెక్రటరీ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, డిజిహెచ్ మరియు వివిధ వాటాదారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పూరి మాట్లాడుతూ "ఎన్‌ఈఆర్‌లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు వృద్ధికి భారీ అవకాశాలు మన దేశ అభివృద్ధి ఎజెండాలో ప్రధానమని అన్నారు. భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలు అందుబాటులో ఉన్న భౌగోళిక శాస్త్రీయ సమాచారం ఆధారంగా అత్యంత ఆశాజనకంగా భావించబడుతున్నాయి మరియు అందువల్ల ఈ ప్రాంతంలో వేగవంతమైన అన్వేషణ ద్వారా సంభావ్య చమురు మరియు వాయువుల కోసం తగినంత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఎన్‌ఈఆర్‌కు భారతదేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందని శ్రీ పూరి అన్నారు. ఈ ప్రాంతాన్ని వేగంగా మార్చే ఉద్దేశ్యానికి అనుగుణంగా, భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరియు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనేక కీలక కార్యక్రమాలను చేపట్టింది. ఎన్‌ఈఆర్‌లో కింది ముఖ్యమైన చమురు మరియు గ్యాస్ కార్యక్రమాల గురించి ఆయన పేర్కొన్నారు:
1.లక్షకోట్ల విలువైన చమురు మరియు గ్యాస్ ప్రాజెక్ట్‌లు ఆమోదించబడ్డాయి మరియు 2025 నాటికి పూర్తవుతాయి. [మేజర్ ప్రాజెక్ట్‌లు:అప్‌స్ట్రీ (27వేల కోట్లు) ఎన్‌ఆర్‌ఎల్ (30 వేల కోట్లు) ఐజిజిఎల్ (10 వేల కోట్లు) సిజిడి మరియు ఇతర ప్రాజెక్ట్‌లు (33 వేల కోట్లు) ]
2. ఓఎఎల్‌పి కింద ఎన్‌ఈఆర్‌లో ప్రత్యేక బిడ్డింగ్ రౌండ్, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసిన ఎకరాలు మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి అదనపు ప్రోత్సాహకాలు అందించబడతాయి.
3. ఎన్‌ఈఆర్‌లో ప్రస్తుతం ఉన్న 30,000 ఎస్‌క్యూ కిలోమీటర్ల నుండి అన్వేషణ విస్తీర్ణాన్ని 2025 నాటికి 60,000 చదరపు కిలోమీటర్లకు రెట్టింపు చేయడం (ఎన్‌ఈఆర్‌లో సుమారు 20,000 చదరపు కిలోమీటర్లు ఓఎఎల్‌పి కింద గత 3 సంవత్సరాలలో ఇప్పటికే అందించబడ్డాయి)
4. 2025 నాటికి చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిని ప్రస్తుత 9 ఎంఎంటిఓఈ నుండి 18 ఎంఎంటిఓఈకి రెట్టింపు చేయడానికి ప్రణాళికలు
5. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చమురు మరియు గ్యాస్ పరిశ్రమ అవసరానికి మద్దతుగా ఎన్‌ఈఆర్‌లో ప్రత్యేక సర్వీస్ ప్రొవైడర్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు
6. ఈశాన్య ప్రాంతంలో తుది వినియోగదారులకు సహజ వాయువును అందించడానికి నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ (ఎన్‌ఈజిజి) అమలు
7. అస్సాం మరియు త్రిపుర రాష్ట్రాల్లో 18 జిల్లాలతో కూడిన ఆరు భౌగోళిక ప్రాంతం (జిఏలు) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) నెట్‌వర్క్ అభివృద్ధి కోసం సిజిడి బిడ్ రౌండ్ 11వ రౌండ్ కింద ఆఫర్ చేయబడుతోంది.
అస్సాంలోని డిగ్‌బోయ్ రిఫైనరీని విస్తరిస్తామని శ్రీ పూరి ప్రకటించారు. రిఫైనరీ స్థాయిలో పెట్రోల్‌తో ఇథనాల్‌ని కలిపే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
నార్త్ ఈస్ట్ రీజియన్‌లో ఈ&పి వ్యాపార దృక్పథం ఆశాజనకంగా ఉందని శ్రీ పూరి అన్నారు. భారీ హైడ్రోకార్బన్ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు; ఈశాన్యంలో అంచనా వేసిన 7600 ఎంఎండిఓఈలో ఇప్పటివరకు 2000 ఎంఎంటీఓఈ మాత్రమే కనుగొనబడింది. పరిశ్రమలు మరియు ప్రభుత్వాల సంయుక్త ప్రయత్నాలతో, చమురు ఉత్పత్తి 2020-21లో 4.11 ఎంఎంటి నుండి రాబోయే 4 సంవత్సరాలలో 6.85 ఎంఎంటికి అంటే 67% పెరుగుతుంది. 2020-21లో 5.05 బిసిఎం నుండి వచ్చే 4 సంవత్సరాలలో 10.87 బిసిఎం వరకు గ్యాస్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది.
రాబోయే రౌండ్లలో చురుకుగా పాల్గొనాలని మరియు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్న జాతీయ ఈ&పి ఎంటర్‌ప్రైజ్‌లో భాగం కావాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో ఈశాన్య ప్రాంతానికి చాలా ప్రోత్సాహాన్ని అందించామని అది సత్ఫలితాలను అందిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఊహించిన వృద్ధికి ఉత్ప్రేరకంగా ఉంటుందని తెలిపారు.
శ్రీ పూరి అస్సాం ప్రభుత్వం పోర్టల్‌తో పాటు ఈ & పి ఆపరేటర్లకు చట్టబద్ధమైన అనుమతులు మరియు ఆమోదాలను సులభతరం చేయడాన్ని ప్రశంసించారు మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించాలని ఆశించారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించడానికి ఈశాన్య రాష్ట్రాలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ అన్వేషణ కార్యకలాపాలలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందించిందన్నారు. చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. చమురు మరియు గ్యాస్ రంగంలో అస్సాం సహకారం బాగా తెలిసినదని, అన్వేషణ కార్యకలాపాలు వేగంగా పెరగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
రాబోయే కాలంలో భారతదేశం అగ్రశ్రేణి ఇంధన వినియోగదారుగా అవతరిస్తుందని శ్రీ రామేశ్వర్ తెలి అన్నారు. ఇంధన భద్రతను నిర్ధారించడానికి చమురు మరియు గ్యాస్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని తద్వారా దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. ఎన్‌ఈఆర్‌కు భారీ సామర్థ్యం ఉందని, అన్వేషణ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చురుకుగా పాల్గొనాలని ఆయన అన్నారు.
భారత బేసిన్‌ల అధిక పరిమాణ చమురు మరియు గ్యాస్ ఆస్తుల పోర్ట్‌ఫోలియోను హైలైట్ చేయడం మరియు హైడ్రోకార్బన్ అన్వేషణ మరియు లైసెన్సింగ్ విధానం మరియు కనుగొనబడిన చిన్న క్షేత్ర విధానాల బిడ్డింగ్ రౌండ్లను ప్రోత్సహించడం ఈ సమావేశం లక్ష్యం. ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ, జాతీయ చమురు కంపెనీల నాయకులు, ప్రైవేట్ ఈ&పి కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు మరియు విద్యాసంస్థలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
ఈశాన్య భారతదేశం కోసం ఈవెంట్ థీమ్ హైడ్రోకార్బన్ విజన్ 2030 కి నిర్దేశం చేయబడింది. ఇది ఈశాన్య ప్రాంతంలో వృద్ధిని ఉత్ప్రేరకపరిచేందుకు మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మరియు యువతకు అవకాశాలను సృష్టించడానికి హైడ్రోకార్బన్‌ల ఉత్పత్తి మరియు వినియోగంలో ఒక నమూనా మార్పు. స్థిరమైన ఇంధన సురక్షిత భవిష్యత్తును సృష్టించడ దీని లక్ష్యం.
ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన అతిపెద్ద ఈ&పి సెక్టార్ ఈవెంట్‌లో ఇది ఒకటి. ఈ కార్యక్రమం ఈ &పి సెక్టార్‌కు సంబంధించిన అంశాల స్వరూపాన్ని స్పృశిస్తూ సమగ్రమైన ప్రెజెంటేషన్‌లు మరియు ప్యానెల్ చర్చలతో సమగ్రంగా ప్రణాళిక చేయబడింది.
ఈవెంట్‌లో ప్రదర్శించబడిన ఈ&పి అవకాశాలు:
- ఓఎఎల్‌పి బిడ్ రౌండ్ VI- 21 బ్లాక్ 11 బేసిన్లలో ~ 35,346 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉన్నాయి . 21 బ్లాక్‌లలో, 15 బ్లాక్‌లు ఆన్‌ల్యాండ్ రకం, 4 బ్లాక్‌లు నిస్సార నీటి రకం మరియు 2 బ్లాక్స్ అల్ట్రా డీప్-వాటర్ రకం.
- డిఎస్‌ఎఫ్ బిడ్ రౌండ్- III- 32 కాంట్రాక్ట్ ఏరియాలు (75 డిస్కవరీలు) ఆఫర్‌లో ~ 13685 చదరపు కిలోమీటర్లలో 232 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు సమానమైన స్థల వనరుతో అంచనా వేయబడింది.
****
(Release ID: 1757863)
Visitor Counter : 266