శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

తక్కువ ధరతో పేలుడు పదార్థాలను ముందుగానే గుర్తించే ఎలక్ట్రానిక్ పాలిమర్ ఆధారిత సెన్సార్ పరికరం అభివృద్ధి

Posted On: 24 SEP 2021 12:57PM by PIB Hyderabad

భారీ  పేలుళ్లు  సృష్టించడానికి ఉపయోగించే నైట్రో- ఆరోమాటిక్ రసాయనాలను ముందుగానే గుర్తించే పరికరాన్ని భారత శాస్త్రవేత్తలు  తొలిసారిగా అభివృద్ధి చేశారు. పాలిమర్ ఆధారిత ఈ సెన్సార్ ను శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేశారు. పేలుడు పదార్ధాలను ముందుగానే గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం రక్షణ, నేర పరిశోధనమైన్‌ఫీల్డ్ నివారణసైనిక రంగం మందుగుండు నివారణ,భద్రతా రంగాలలో కీలక అంశంగా ఉంటుంది. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన  సెన్సార్లు ఈ రంగాలలో కీలక పాత్ర పోషిస్తాయి. 

పాలీ-నైట్రోఆరోమాటిక్ మిశ్రమాలను అత్యంత  అధునాతన పరికరాలతో గుర్తించడానికి వీలవుతుంది. అయితే, క్రిమినాలజీ ప్రయోగశాలలు లేదా తిరిగి వినియోగంలోకి తీసుకుని వచ్చే సైనిక స్థావరాలు లేదా తీవ్రవాదుల వద్ద ఉండే పేలుడు పదార్ధాలను త్వరగా గుర్తించి తక్షణ నిర్ణయాలను తీసుకోవడానికి తక్కువ ఖర్చుతో రసాయనాలను గుర్తించే పరికరాలు అందుబాటులో ఉండవలసిన ఆవశ్యకత వుంది. నైట్రో ఆరోమాటిక్ రసాయానాలను పసిగట్టడం క్లిష్టంగా ఉంటుంది. గతంలో పేలుడు రసాయనాలను ముందుగానే గుర్తించే పరికరాలను అభివృద్ధి చేయడానికి ఫోటో-లుమినేసెంట్ గుణాల ఆధారంగా జరిగాయి. పేలుడు పదార్ధాల గుణాల ఆధారంగా ఇంతవరకు పరిశోధనలు జరగలేదు. పేలుడు రసాయనాల గుణాలను లెడ్ సహాయంతో పనిచేసి ఎక్కడికైనా సులువుగా తీసుకుని వెళ్ళడానికి వీలుగా ఉండే పరికరాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. 

పేలుడు పదార్దాలను ముందుగానే గుర్తించే అంశంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక పరికరాన్ని అభివృద్ధి చేసే అంశంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్  సైన్స్ అండ్  టెక్నాలజీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. గువాహటి కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ నీలోత్పాల్ సేన్ శర్మ నేతృత్వంలో పరిశోధనలు సాగించి విజయం సాధించారు. వీరు రెండు పొరలతో పనిచేసే పాలిమర్ డిటెక్టర్ కు రూపకల్పన చేశారు. రెండు సేంద్రీయ పాలిమర్లతో దీనిని రూపొందించారు. దీనిలో ఏర్పాటు చేసిన పాలీ -2-వినైల్ పిరిడిన్ యాక్రిలోనైట్రైల్ (P2VP-Co-AN) మరియు కోపాలిసల్ఫోన్‌లోని కొలెస్ట్రాల్ మెథాక్రిలేట్ లు అవరోధాలను గుర్తించిన కొన్ని సెకన్లలో స్పందిస్తాయి. పరికరాన్ని రూపొందించడానికి శాస్త్రవేత్తలు పిక్రిక్ యాసిడ్ విధానాన్ని వినియోగించారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ పరికరం పిక్రిక్ యాసిడ్ యూ కంటితో గుర్తించడానికి అనువుగా ఉంటుంది.కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో తాము అభివృద్ధి చేసిన పరికరం పేటెంట్ కోసం శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. 

 పాలిమర్ గ్యాస్ సెన్సార్ చుట్టూ నిర్మించిన ఎలక్ట్రానిక్ సెన్సింగ్ పరికరం పేలుడు పదార్థాన్ని అది ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుందని డాక్టర్ నీలోత్పాల్ సేన్ శర్మ వివరించారు.

 

 సెన్సార్ పరికరంలో  మూడు పొరలు ఉంటాయి. 1-హెక్సీన్ (PCHMASH) తో పాటు కొలెస్టరిల్ మెథాక్రిలేట్కి చెందిన  పాలిమర్స్ కోపాలిసల్ఫోన్ పొరలతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించిన  రెండు P2VP-Co-AN బాహ్య పొరల మధ్య దీనిని ఏర్పాటు చేశారు. పిక్రిక్ యాసిడ్ నుంచి వెలువడే ఆవిరి సమయం ఆధారంగా పేలుడు పదార్ధాల తీవ్రతను గుర్తించడానికి వీలవుతుంది. 

 

  నైట్రోఆరోమాటిక్ రసాయనాలను గుర్తించడంలో ఈ పరికరం సమర్ధవంతంగా పనిచేస్తున్నదని గుర్తించారు. సులువుగా ఉపయోగించడానికి వీలుగా ఉండే ఈ పరికరం ఇతర సాధారణ రసాయనాలు మరియు తేమ సమక్షంలో వివిధ ఆపరేటింగ్ ఉష్ణోగ్రత ల వద్ద ఇది పనిచేస్తుంది. 

 పరికరాన్ని సాధారణ  ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించవచ్చుఇతర రసాయనాల వల్ల ప్రభావితం చెందకుండా ఉండే ఈ పరికరాన్ని సులువుగా తక్కువ సమయంలో రూపొందించవచ్చు. దీనిలో ఉపయోగించే  పాలిమర్‌లు భూమిలో కలిసిపోతాయి.  

 పేటెంట్ వివరాలు: 

 ఇండియన్ పేటెంట్ నం. 3436085, అప్లికేషన్ నం. 3613/DEL/2014 dt.09/12/2014.  27- 04-2020 న పేటెంట్  మంజూరు చేయబడింది.

 

 మరిన్ని వివరాల కోసం  డాక్టర్ నీలోత్పాల్ సేన్ శర్మప్రొఫెసర్ I, ఫిజికల్ సైన్సెస్ డివిజన్, IASST, గౌహతి, (neelot@iasst.gov.inలో సంప్రదించవచ్చు.

***



(Release ID: 1757675) Visitor Counter : 164