భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఫుల్లెర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్‌లో సుమిటోమో మిట్సుయ్ ఫైనాన్షియల్ గ్రూప్, ఇంక్ వాటాల కొనుగోలుకు సిసిఐ ఆమోదం తెలిపింది.
Posted On:
23 SEP 2021 7:01PM by PIB Hyderabad
ఫుల్లిర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌ఐసిసి/ టార్గెట్) లో సుమిటోమో మిత్సుయ్ ఫైనాన్షియల్ గ్రూప్, ఇంక్(ఎస్‌ఎంఎఫ్‌జి/అక్వైజర్) వాటాల కొనుగోలుకు కాంపిటేషన్ యాక్ట్, 2002 సెక్షన్ 31(1 ) కింద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కలయిక అనేది కొనుగోలుదారు ద్వారా టార్గెట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొనుగోలుకు సంబంధించినది. ఇది సముపార్జన స్వభావం మరియు కాంపిటీషన్ యాక్ట్, 2002 సెక్షన్ 5 (ఎ) కిందకు వస్తుంది.
కొనుగోలుదారు
ఎస్‌ఎంఎఫ్‌జి అనేది సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబిసి) మరియు దాని ఇతర గ్రూప్ కంపెనీల హోల్డింగ్ కంపెనీ. దీని ప్రాథమిక వ్యాపారం బ్యాంకింగ్ అనుబంధ సంస్థలు మరియు ఇతర కంపెనీలను నిర్వహించడం. వాణిజ్య బ్యాంకింగ్‌తో పాటు, ఎస్‌ఎంబిసి గ్రూప్ లీజింగ్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్, సెక్యూరిటీలు మరియు డెరివేటివ్‌లు, మారిటైమ్ ఫైనాన్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, క్రెడిట్ కార్డ్, ట్రేడ్ ఫైనాన్స్, క్యాష్ మేనేజ్‌మెంట్ మొదలైన వివిధ రకాల ఆర్థిక సేవలలో కూడా నిమగ్నమై ఉంది.
లక్ష్యం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్‌ఐసీసీ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా నమోదు చేయబడింది. ఇది ప్రధానంగా వాణిజ్య వాహనాలు మరియు ద్విచక్ర వాహనాల రుణాలు, ఆస్తి రుణాలు, సెక్యూరిటీ రుణాలు, వ్యక్తిగత రుణాలు, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లకు అందించే రుణాలు, వ్యాపారాలకు అందించే రుణాలు మరియు గ్రామీణ సంఘీభావ సమూహాలకు రుణాలు అందించడంలో నిమగ్నమై ఉంది. ఫుల్లెర్టన్ ఇండియా హోమ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌ఐహెచ్‌ఎఫ్‌సి), ఎఫ్‌ఐసీసీకు చెందిన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సి) లో ఇది నమోదు చేయబడింది.
సిసిఐ వివరణాత్మక ఆర్డర్ అనుసరించబడుతుంది.
****
(Release ID: 1757448)
Visitor Counter : 202