వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

విద్యా సంస్థలకు పేటెంట్ ఫీజు 80% మేరకు తగ్గింపు


పేటెంట్స్ (సవరణ) నియమాలు, 2021 విడుదల

విజ్ఞాన రంగంలో ఆవిష్కరణలు,సృజనాత్మకతకు కేంద్రం ప్రోత్సాహం

Posted On: 23 SEP 2021 12:27PM by PIB Hyderabad

ఆత్మ నిర్బర్ భారత్ సాధన దిశలో భాగంగా పేటెంట్ దాఖలు, కొనసాగింపుకు ఇస్తున్న  80% తగ్గించిన ఫీజు రాయితీ సౌకర్యాన్ని విద్యా సంస్థలకు కూడా వర్తింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి పేటెంట్ నిబంధనలకు సవరణలను కేంద్రం విడుదల చేసింది. 

విజ్ఞాన రంగంలో ఆవిష్కరణలు,సృజనాత్మకతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలో విజ్ఞాన రంగంలో ఆవిష్కరణలు,సృజనాత్మకత పెరుగుతున్నాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కృషి చేస్తోంది.  విద్యాసంస్థలలో పరిశోధనల వాణిజ్యీకరణను చేయడం ద్వారా రెండు రంగాల మధ్య సమన్వయం సాధించడానికి అవకాశం కలుగుతుంది. 

విద్యాసంస్థలలో సాగుతున్న పరిశోధనా కార్యక్రమాల్లో భాగంగా ప్రొఫెసర్లు/ ఉపాధ్యాయులు, విద్యార్థులు అనేక నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తున్నారు. వీటిని వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడానికి ఆవిష్కరణలకు పేటెంట్ పొందాల్సి ఉంటుంది. అయితే, పేటెంట్ పొందడానికి ఎక్కువ మొత్తంలో రుసుమును చెల్లించవలసి ఉండడంతో తమ ఆవిష్కరణలకు పేటెంట్లను తీసుకోవడానికి వెనుకడుగు వేయవలసి వస్తోంది. నూతన సాంకేతికతల అభివృద్ధిలో అధిక రుసుములు ప్రధాన ప్రతిబంధకంగా ఉంటున్నాయి.

తమ ఆవిష్కరణలకు పేటెంట్ పొందడానికి సంస్థ తరఫున వీటిని ఆవిష్కరించిన వారు  దరఖాస్తు చేయవలసి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఎక్కువ మొత్తంలో ఫీజును చెల్లించవలసి ఉంటుంది. దీనితో ఈ సంస్థలు పేటెంట్ల విషయంలో వెనుకడుగు వేయవలసి వస్తోంది. దేశ ఆవిష్కరణల రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి పేటెంట్లను పొందడానికి చెలించవలసి ఉన్న ఫీజులను తగ్గిస్తూ పేటెంట్ నిబంధనలు 2003లో సవరణలు చేస్తూ ప్రభుత్వం పేటెంట్స్( సవరణ) నిబంధనలు 2021 ని విడుదల చేసింది. నూతన నిబంధనలు 2021 సెప్టెంబర్ 21 వ తేదీ నుంచి అమలు లోకి వచ్చాయి. 

దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో విధానపరమైన అసమానతలు మరియు అనవసరమైన దశలను తొలగించాలన్న లక్ష్యంతో  2016, 2017, 2019 మరియు 2020 లో పేటెంట్ నియమాలలో సవరణలను చేయడం జరిగింది. వీటివల్ల  ధరఖాస్తులను వేగంగా పరిశీలించి అనుమతులను మంజూరు చేయడానికి అవకాశం కలుగుతుంది.  నిబంధనలను సవరించడం  వల్ల   ప్రక్రియలు సమగ్రంగా, నిర్ణీత వ్యవధిలో పూర్తి అయ్యేలా ఇ-లావాదేవీలకు అనుకూలంగా ఉంటాయి.  దీనికి సంబంధించి ఈ క్రింది కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది. 

i. కొత్త ఎగ్జామినర్లను నియమించడం ద్వారా మానవ వనరులను పెంచడం.

 

 ii.  పేటెంట్ దరఖాస్తుల స్వీకరణ ,మంజూరుకు  పూర్తి ఆన్‌లైన్‌ విధానం అమలు 

 

 iii. వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా పేటెంట్ల కేసులను వేగంగా మానవ సంబంధం లేకుండా విచారించడం .

 

 iv. సంబంధిత వర్గాలకు తాజా  ఐపి సమాచారాన్ని అందించడానికి  వెబ్‌సైట్ ను అభివృద్ధి చేసి అవాంతరం లేకుండా పనిచేయడానికి చర్యలు 

 v. పేటెంట్లను పొందడానికి వర్తింపజేయడానికి మరియు మంజూరు చేయడానికి డిజిటల్ ప్రక్రియను ప్రోత్సహించడం.

 

 vi.  స్టార్టప్‌ల( అంకుర సంస్థలు)  దరఖాస్తుల దాఖలు, ప్రాసెసింగ్ కోసం సహాయ సహకారాలను  అందించడానికి  మేధోపరమైన ఆస్తి రక్షణ పథకం ప్రారంభించబడింది.  సహాయ సహకారాలను అందించిన వారికి చెల్లించే  ప్రొఫెషనల్ ఛార్జీలు  నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించబడతాయి.

 

 vii.  ఐపీ  కార్యాలయాల పనితీరుకి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఫీడ్‌బ్యాక్/సూచనలు/ఫిర్యాదులను స్వీకరించడానికి ఐపీవో  వెబ్‌సైట్‌లో వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.  ఒక బృందం  సూచనలు/ఫిర్యాదులపై తక్షణమే స్పందించి  ఇ-మెయిల్ ద్వారా తగిన ప్రతిస్పందనను తెలియజేస్తుంది.

 viii. సంబంధిత వర్గాలకు ఐపీర్  ప్రమోషన్ మరియు మేనేజ్‌మెంట్  సెల్ ద్వారా అందించడానికి  సీజీపీడీటిఎం  కార్యాలయం సహకారంతో డీపీఐఐటీ అందిస్తోంది. పరిశ్రమల సంఘాలు, నిబంధనలను అమలు చేసే సంస్థల సహకారంతో నిర్వహించే  అవగాహన కార్యకలాపాలలో పాఠశాలలువిశ్వవిద్యాలయాలుపరిశ్రమలు పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతోంది.  

ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన విధానాల వల్ల పేటంట్ల అందిన దఖాస్తుల పరిశీలనా సమయం గణనీయంగా తగ్గింది.  సాంకేతిక రంగాలపై ఆధారపడి ఈ ప్రక్రియ పూర్తి కావడానికి  2015 లో సగటు 72 నెలల సమయం పట్టేది.  ప్రస్తుతం ఇది  12-30 నెలలలో పూర్తవుతుంది  పేటెంట్ దరఖాస్తులపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇది వరకు కొన్ని సంవత్సరాలు పట్టేది. ప్రస్తుతం ఇది  సగటున 48 నెలలకు తగ్గింది.  2021 చివరి నాటికి దాఖలు చేసినప్పటి నుండి సగటు 24-30 నెలలకు  ఈ సమయం   తగ్గించబడుతుంది. దీనితో  వేగవంతమైన పరీక్ష విధానం కూడా అమలులోకి వచ్చింది. సాధారణ విధానంతో పోల్చి చూస్తే ఈ విధానంలో ఒక సంవత్సరంలోపే పేటెంట్ మంజూరు కోసం అందిన  దరఖాస్తు ఫై తుది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 

అభ్యర్థనను దాఖలు చేసిన 41 రోజులలో అత్యంత వేగంగా పేటెంట్ మంజూరు చేయబడింది.  స్టార్టప్‌లు దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తుల కోసం తొలుత ఈ వేగవంతమైన పరీక్షా వ్యవస్థ సౌకర్యం ప్రారంభించబడింది.  17-09-2019 నుంచి అమల్లోకి వచ్చిన  పేటెంట్ నియమాల సవరణలు ద్వారా ఇది మరో 8 వర్గాలకు విస్తరించబడింది  ఎస్ఎంఈ , మహిళా దరఖాస్తుదారులుప్రభుత్వ విభాగాలుకేంద్రప్రొవిన్షియల్ లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడి  ప్రభుత్వ రంగ నిర్వహణ  లేదా నియంత్రణలో ఉన్న  సంస్థలు,   ప్రభుత్వం లేదా పేటెంట్స్ ప్రాసిక్యూషన్ హైవే కింద అందే దరఖాస్తులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.   .  స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి స్టార్టప్‌లు దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తులకు 80% ఫీజు రాయితీ అందించబడింది.  

 పేటెంట్ (సవరణ) నియమాలు, 2021 చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

 

***



(Release ID: 1757271) Visitor Counter : 207