పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కింద విస్తృత కార్యక్రమాలు చేపట్టిన ఒ.ఎన్.జి.సి
Posted On:
22 SEP 2021 1:40PM by PIB Hyderabad
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా పెట్రోలియం సహజవాయు మంత్రిత్వశాఖ కింద గల ఇంధన మహారత్న కంపెనీ అయిన చమురు సహజవాయు కార్పొరేషన్ లిమిటెడ్ (ఒ.ఎన్.జి.సి) పలు కార్యక్రమాలు చేపట్టింది. ఒ.ఎన్.జి.సి సంస్థ ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయాలు, ఇంజనీరిం గ్ కాలేజీల విద్యార్ధులకు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల చమురు క్షేత్రాల సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చమురు , సహజవాయు సంస్థ (ఒ.ఎన్.జి.సి) ఏర్పాటు చేసిన ఈ క్షేత్ర సందర్శన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా గల యువతలో చమురు, గ్యాస్ వ్యాపారానికి సంబంధించి మంచి ఆసక్తిని రేకెత్తించాయి. భారతదేశపు ఇంధన స్వాతంత్య్రానికి ఇది ఎంతో కీలకమైన అంశం. అన్ని క్షేత్ర సందర్శనలు కోవిడ్ -19 ప్రోటోకాల్స్ ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కింద ఒ.ఎన్.జి.సి 25 బృందాలతో అధ్యయన సందర్శనలను ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 2021 నుంచి జనవరి 2022 వరకు ఒక్కొక్క బృందంలో 100 మంది వరకు ఉన్నారు. ఒఎన్‌జిసి ఇప్పటికే ఐదు బృందాల క్షేత్ర సందర్శనలను పూర్తి చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అధ్యయన సందర్శనలు ఐది విభిన్న ప్రదేశాలైన ఆహ్మదాబాద్, మెహసానా, అంక్లేశ్వర్, కాంబే, కావేరీలలో ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలు విద్యార్ధులను ఇంధన వ్యాపారానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు తెలుసుకునేలా చేసింది. అలాగే వీటి వెనక వున్న సాంకేతికతలను తెలుసుకోవడానికి ఉపకరించాయి.
ఉత్తర గుజరాత్‌లో ఒ.ఎన్.జి.సికి గల మెహసానా క్షేత్రంఓ పఠాన్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 96 మంది విద్యార్థులను సొభాసన్ సెంట్రల్ ట్యాంక్ ఫార్మ్ (సిటిఎఫ్)కు నాలుగు బృందాలుగా తీసుకు వెళ్లి ఆయిల్ ఫీల్డ్‌లోని కార్యకలాపాలను వారికి వివరించడం జరిగింది.
ఒ.ఎన్.జి.సి కి చెందిన మెహ్‌సానా క్షేత్రంలో గల సీనియర్ టెక్నికల్ ఎగ్జిక్యుటివ్‌లు క్షేత్ర సందర్శనకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడి వారికి ఇందుకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. 2021 సెప్టెంబర్ 13-14 తేదీలలో ఈ క్షేత్ర సందర్శనలు ఏర్పాటు చేశారు.
ఒ.ఎన్.జి.సికి చెందిన కాంబే అసెట్ లూనెజ్ మ్యూజియంకు క, అఖోల్ జునికి క్షేత్ర సందర్శన ఏర్పాట్లు చేసింది. మూడు బృందాలుగా ఎనిమిది, తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు క్షేత్ర సందర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో బృందంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఈ క్షేత్ర సందర్శనలు ఏర్పాటు చేశారు. అంకలేశ్వర్ అసెట్ అంకలేశ్వర్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు స్టడీ విజిట్‌ను ఏర్పాటు చేసింది. ఒ.ఎన్.జి.సి కార్యకలాపాల కు సంబంధించి వెల్ సైట్ లు, సిటిఎఫ్, వర్క్ ఓవర్ రిగ్‌లు లను విద్యార్థులు చూసి వాటి గురించి తెలుసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
మరో వంద మంది విద్యార్ధులకు స్టడీ టూర్‌ను కావేరీ అసెట్‌లో సెప్టెంబర్ 1 నుంచి 15 మధ్య ఏర్పాటు చేశారు. ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మొత్తం 100 మంది విద్యార్థులను చిన్న చిన్న బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో 10 మంది విద్యార్థులు ఉండేట్టు చూశారు. పుదుచ్చేరి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ ట్రిప్‌లో పాల్గొన్నారు. ప్రతి బ్యాచ్ విద్యార్ధులతో పాటు ఆ కళాశాలకు చెందిన ఫాకల్టీకూడా వారి వెంట ఉన్నారు. విద్యార్థులను ఒ.ఎన్.జి.సి కి చెందిన కుథలం, నారిమానం ఉపరితల విభాగాలకు తీసుకువెళ్లి వారికి వాటి గురించి వివరించడం జరిగింది.
***
(Release ID: 1757088)
Visitor Counter : 255