ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

80 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 85 లక్షలకుపైగా డోసులు పంపిణీ

97.68 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 30,773 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,32,158) 0.99 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.04 శాతం) గత 86 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 19 SEP 2021 9:41AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 80 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన  85,42,732 డోసులతో కలిపి, మొత్తంగా 80 కోట్ల డోసులను (80,43,72,331) టీకా కార్యక్రమం అధిగమించింది. 79,15,457 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,68,565

రెండో డోసు

87,23,015

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,44,648

రెండో డోసు

1,44,80,304

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

32,53,21,724

రెండో డోసు

5,91,05,510

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

15,03,91,317

రెండో డోసు

6,87,57,707

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

9,66,20,196

రెండో డోసు

5,22,59,345

మొత్తం

80,43,72,331

 

 

గత 24 గంటల్లో 38,945 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,26,71,167కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.68 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 84వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 30,773 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,32,158. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.99 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,59,895 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 55.23 కోట్లకుపైగా (55,23,40,168) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.04 శాతంగా ఉంది. గత 86 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.97 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 20 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 103 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

 

****



(Release ID: 1756305) Visitor Counter : 180