వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పీఎల్ఐ పథకం కింద దరఖాస్తులు దాఖలు చేసిన 52 వైట్ గూడ్స్ (ఏసీలు,ఎల్ఐడి బల్బులు ) సంస్థలు

వైట్ గూడ్స్ రంగంలో పీఎల్ఐ పథకం కింద 5,866 కోట్ల పెట్టుబడులు పెట్టిన జాతీయ అంతర్జాతీయ సంస్థలు

రాబోయే 5 సంవత్సరాలలో ఈ రంగంలో 2,71,000 కోట్ల విలువైన పరికరాలు ఉత్పత్తి అవుతాయని అంచనా

Posted On: 16 SEP 2021 5:01PM by PIB Hyderabad

దేశంలో  వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఐడి బల్బులు ) రంగంలో ఉత్పత్తులను ఎక్కువ చేయడానికి పీఎల్ఐ పథకం కింద 5,866 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి 52 సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పీఎల్ఐ పథకం కింద దరఖాస్తులను అందించడానికి విధించిన గడువు 2021 సెప్టెంబర్ 15వ తేదీతో ముగిసింది. 16.04.2021 న ప్రభుత్వం 

పీఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. 

డైకిన్, పానాసోనిక్, హిటచి, మేట్యూబ్, నీదే్క్, వాల్టాస్, బ్లూస్టార్, హెవెల్స్, అంబర్, డిక్సన్, ఈపాక్, సైస్కా, రాధికా  ఒప్టో లాంటి సంస్థలు ఎయిర్ కండిషనర్లు, 

ఎల్ఐడి బల్బుల ప్రధాన భాగాలను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులను దాఖలు చేశాయి. 

ప్రస్తుతం దేశంలో అవసరాల మేరకు ఉత్పత్తి కాని భాగాలను ఉత్పత్తి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ సంస్థల నుంచి దరఖాస్తులు అందాయి. ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే కంప్రెసర్లు,కాపర్ ట్యూబింగ్ రేకుల కోసం అల్యూమినియం భాగాలు, ఐడియు ఒడియూల కంట్రోల్ పరికరాలు,డిస్ప్లే యూనిట్లు లాంటి వాటిని  ఉత్పత్తి చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అదేవిధంగా ఎల్ఐడి బల్బుల తయారీలో వుపయోగించే చిప్పులు, డ్రైవర్లు, ఇంజన్లు, వైర్ ఇండెక్టర్లు లాంటి భాగాలు ఇకపై దేశంలో ఉత్పత్తి అవుతాయి. 

2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్ధిక సంవత్సరం వరకు అయిదేళ్ల పాటు వైట్ గూడ్స్ (ఏసీ  లు ఎల్ఐడి  బల్బులు ) రంగంలో   పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తారు. 6238 కోట్ల రూపాయల విలువ చేసే పథకానికి 2021 ఏప్రిల్ 7 వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన  సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 16.04.2021 న ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు 2021 జూన్ 4 న విడుదల అయ్యాయి. ఆన్ లైన్ లో దరఖాస్తులను 2021 జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వీకరించారు. దరఖాస్తులను సమర్పించడానికి విధించిన గడువు ( 16.04.2021)ముగిసిన 60 రోజులలోగా అర్హత కలిగిన సంస్థలను గుర్తించి ఎంపిక చేయడం జరుగుతుంది. 

ఎయిర్ కండిషనర్లు, ఎల్ఐడి  బల్బుల రంగంలో ఉపయోగించే పరికరాలు, విడి భాగాలు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం  పీఎల్ఐ పథకాన్నిరూపొందించింది.  వైట్ గూడ్స్ ఉత్పత్తి రంగంలో అంతర్జాతీయ గుర్తింపు సాధించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం తొలి ఏడాది అమ్మకాల ప్రాతిపదికగా అయిదేళ్ల పాటు నాలుగు నుంచి ఆరు శాతం వరకు జరిపే అమ్మకాలపై ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఉత్పత్తి ప్రారంభించడానికి ఏడాది గడువు ఇస్తారు. ఈ పథకం కింద ఎసిలు మరియు ఎల్‌ఈడి లైట్ల విడి భాగాల తయారీకి మాత్రమే ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. 

ఎసిలు మరియు ఎల్‌ఈడి లైట్ల విడి భాగాల తయారీని ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఎసిల ఉత్పత్తిలో 90%,ఎల్‌ఈడి లైట్ల తయారీ ఖర్చులో 87% వ్యయం ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పరికరాల  విలువ ఆధారిత 20 నుంచి 85 శాతం వరకు పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఎసిలు మరియు ఎల్‌ఈడి లైట్ల ఉత్పత్తి రంగం అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. 

ఇంతవరకు దేశంలో ఉత్పత్తి కాని భాగాలు, ఉప భాగాల తయారీకి ముందుకు వచ్చే సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సాహకాలకు ఎంపిక చేస్తారు.  పూర్తయిన వస్తువులను తెచ్చి బిగించే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరగదు. 

ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల రానున్న  5 సంవత్సరాల కాలంలో దేశంలో  దాదాపు 2,71,000 కోట్ల రూపాయల విలువ చేసే ఏసీలు మరియు  ఎల్‌ఈడి లైట్ల   భాగాల ఉత్పత్తి అవుతాయని భావిస్తున్నారు.   ఈ పథకం ఎసిలు మరియు ఎల్‌ఈడి లైట్ల రంగంలో 5,886 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడిని తెస్తుంది.  31 కంపెనీలు ఏసీ విడి భాగాల తయారీ రంగంలో సుమారు 4995 కోట్ల రూపాయలను, రంగంలో 871 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి 21 కంపెనీలు  ముందుకు వచ్చాయి. ఈ రంగం  వచ్చే 5 సంవత్సరాలలో 2 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. 

 

 దేశీయ విలువ జోడింపు ప్రస్తుత 15-20% నుంచి  75-80% కి పెరుగుతుందని భావిస్తున్నారు.(Release ID: 1755580) Visitor Counter : 48


Read this release in: Hindi , Urdu , English , Tamil