పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విశాఖపట్నం - ముంబై మార్గంలో నేరుగా విమాన సర్వీసుకు జెండా ఊపి ప్రారంభించిన పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా
Posted On:
15 SEP 2021 3:36PM by PIB Hyderabad
విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) నుంచి ముంబై (మహారాష్ట్ర)కు తొలి స్పైస్ జెట్ విమానాన్ని పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింథియా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వికె సింగ్ (రిటైర్డ్), పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ ఖరోలా తో కలిసి వర్చువల్ మాధ్యమం ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వసుపల్లి గణేశ్ కుమార్ (తెలుగుదేశం) దృశ్యమాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) చైర్మన్ సంజీవ్ కుమార్, శాఖ, ఎఎఐ సీనియర్ అధికారులతో కలిసి పౌరవిమానయాన మంత్రిత్వ శాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలోని మెట్రో నగరాలను అనుసంధానం చేయడమే కాక దాగి ఉన్న విశాఖపట్నం వంటి రత్నాలను అనుసంధానం చేయడం ద్వారా ఆర్ధిక వృద్ధికి మద్దతును ఇవ్వాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికత అని, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింథియా చెప్పారు. నేడు దేశ ఆర్థిక రాజధాని ముంబైకి విశాఖపట్నం నుంచి నేరుగా విమాన అనుసంధానాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పడం నాకు ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఇది ఉపాధి, టూరిజం, విద్యార్ధులకు మెరుగైన అనుసంధానతకు అవకాశాలను కల్పించే సంభావ్యతను సాధ్యం చేయడమే కాక, విశాఖపట్నానికి ఆర్థికంగా తోడ్పడేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (యుడిఎఎన్) విధానం ద్వారా దేశంలోని లోతట్టు ప్రాంతాలకు మెరుగైన వైమానిక అనుసంధానతను ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు. ప్రయాణ విప్లవ అంచుల్లో నేడు భారత్ ఉందన్నారు. తక్కువ ఖర్చుతో హెచ్చుస్థాయి ప్రయాణం అన్న భావనకు తమ మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో మరొక 38 విమానాలను నేడు ప్రారంభిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం విశాఖ పట్నం 302 విమానాల రాకపోకలతో 10 నగరాలతో అనుసంధానమై ఉందని, వివిధ చొరవల ద్వారా ఈ సంఖ్యలను పెంచేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి నూతన మార్గాలను, కొత్త వేదికలను తెరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేవలం 7 సంవత్సరాల స్వల్పకాలంలో, 2016లో 60 విమానాశ్రయాల నుంచి 2021 నాటికి 136 విమానాశ్రయాలకు పురోగమించామన్నారు.
ప్రస్తుతానికి, ఎయిర్ ఇండియా గ్రూప్ మాత్రమే విశాఖ పట్నం- ముంబై మార్గంలో విమానాలను తిప్పుతోంది, స్థానికులు దీర్ఘకాలంగా అదనంగా మరొక విమానాన్ని డిమాండ్ చేస్తున్నారన్నారు. భారత ప్రభుత్వ సబ్ ఉడే- సబ్ జుడే చొరవ దేశంలోని టైర్-2 & టైర్ 3 నగరాలను వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేయడమన్న లక్ష్యాన్ని ఎం/ఎ స్ స్పైస్‌జెట్ సమలేఖనం చేస్తుందన్నారు. ఎం/ఎ స్ స్పైస్‌జెట్ విశాఖపట్నం - ముంబై మార్గంలో బోయింగ్ 737 విమానాన్ని మోహరిస్తుంది. అంతేకాకుండా, భారత ప్రభుత్వ గతిశక్తి ప్రణాళిక కింద, స్థానిక ఉత్పత్తిదారుల అంతర్జాతీయ ప్రొఫైల్‌ను పెంచేందుకు అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి తోడ్పడడమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ తోటివారితో పోటీ పడేందుకు సాయం చేస్తుంది. భవిష్య ఆర్థిక జోన్ల ఎదుగుదలకు సాధ్యం చేస్తుంది.
వైజాగ్‌గా ప్రాచుర్యం పొందిన విశాఖపట్నం, దేశంలోని అతిపురాతన ఓడరేవు నగరాలలో ఒకటి. సుందరమైన బీచ్‌లు, ప్రశాంతమైన ప్రకృతి దాని సొంతం. దేశంలోని అతి పురాతన ఓడరేవుగా విశాఖపట్నంలోని పోర్ట్ ప్రాచుర్యం పొందింది. కృత్రిమమైన అద్భుతాలు, ప్రకృతి సహజమైన అందాలు ఇక్కడ కనిపిస్తాయి. సబ్ మెరైన్ మ్యూజియం, డాల్ఫిన్స్ నోస్ పాయింట్, కైలాసగిరి హిల్ పార్క్, బొర్రా గుహలు, అరకు లోయ, యారాడ బీచ్, కటికి జలపాతం, ఇక్కత్ చీరెలు, చెక్క బొమ్మలు, కళంకారీ చిత్రాలకు ఈ ప్రాంతం ప్రఖ్యాతి చెందింది. దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలలో దాని సుసంపన్నమైన సంస్కృతి, పర్యాటక విస్తృతి విశాఖపట్నం చూడదగ్గ ప్రాంతం.
విమానం షెడ్యూల్ దిగువన పేర్కొనడం జరిగిందిః
ఫ్లైట్ నెం -ఎస్‌జి 436
విశాఖపట్నం - ముంబై
డిపార్చర్ - 9ః50
అరైవల్ - 11.45
విమాన ఫ్రీక్వెన్సీ - సోమవారం, బుధవారం, గురువారం, శనివారం
ఫ్లైట్ నెం -ఎస్‌జి 435
ముంబై - విశాఖపట్నం
డిపార్చర్ - 7ః15
అరైవల్ - 9ః00
విమాన ఫ్రీక్వెన్సీ - సోమవారం, బుధవారం, గురువారం, శనివారం
(Release ID: 1755298)
Visitor Counter : 168