ఆర్థిక మంత్రిత్వ శాఖ

భార‌త్ అధ్య‌క్ష‌త‌న పన్ను వ్య‌వ‌హారాల‌పై బ్రిక్స్ ప‌న్ను పాల‌నాధికారుల అధిప‌తుల‌, నిపుణుల వ‌ర్చువ‌ల్ స‌మావేశం

Posted On: 15 SEP 2021 5:36PM by PIB Hyderabad

ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రాజిల్‌, ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్‌, రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా, ది పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనా, రిప‌బ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా స‌హా బ్రిక్స్ దేశాల ప‌న్నుల అధిప‌తులు  బుధ‌వారంనాడు భార‌త అధ్య‌క్ష‌త‌న వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్నినిర్వ‌హించారు. భార‌త ప్ర‌భుత్వ రెవ‌న్యూ కార్య‌ద‌ర్శి, భార‌త ప‌న్నుల అధికారుల అధిప‌తి హోదాలో స‌మావేశానికి  అధ్య‌క్ష‌త‌ను వ‌హించారు. 
డిజిట‌ల్ యుగం కావ‌డం, కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి న‌డుమ బ్రిక్స్‌ ప‌న్ను పాల‌నాధికారులు ఎదుర్కొన్న స‌వాళ్ళ‌పై బ్రిక్స్ టాక్స్ అథారిటీ చ‌ర్చించింది. ఈ సంద‌ర్భంగా త‌మ అనుభ‌వాల‌ను పంచుకొని, ఈ స‌వాళ్ళ‌ను అధిగ‌మించేందుకు వ్యూహాల‌ను రూపొందించారు. డిజిట‌ల్ యుగంలో, కోవిడ్‌-19 విసిరిన న‌వాళ్ళ మ‌ధ్య ప‌న్ను పాల‌న‌లోని వాణిజ్య ప్ర‌క్రియ‌ల‌ను పున‌ర్‌నిర్వ‌చించ‌డం అన్న విస్త్ర‌త ఇతివృత్తంపై స‌మావేశం జ‌రిగింది. స‌మావేశాల సంద‌ర్భంగా, సెప్టెంబ‌ర్ 9,  2021న జ‌రిగిన బ్రిక్స్ స‌ద‌స్సులో ప్ర‌క‌టించిన న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌లో పేర్కొన్న  ప‌ర‌స్ప‌ర గౌర‌వం, సంఘ‌టితం కావ‌డం, కొన‌సాగింపు అన్న సూత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌న్న ఉద్దేశ్యాల‌ను, అభిప్రాయాల‌ను ప‌న్ను అధికారులు ఇచ్చి పుచ్చుకున్నారు. 
ఈ స‌మావేశానికి ముందు 13, 14 సెప్టెంబ‌ర్, 2021న బ్రిక్స్ దేశాల ప‌న్నుల నిపుణుల స‌మావేశాలు జ‌రిగాయి. స‌హ‌కారానికి సంభావ్య అవ‌కాశాల‌నే కాక‌,త‌మ అనుభ‌వాల‌ను, అభిప్రాయాల‌ను ప‌న్ను నిపుణులు ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. చ‌ర్చ‌లు ప‌న్నుల పాల‌నా వ్య‌వ‌స్థ‌ల డిజిటీక‌ర‌ణ‌, ప‌న్ను ఎగ‌వేత‌ను క‌నుగొనేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించ‌డం, ప‌న్ను పాల‌నా వ్య‌వ‌స్థ పాత్రను అమ‌లు నుంచి సేవ దిశ‌గా మార్చ‌డం, కోవిడ్ -19 స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించేందుకు సంసిద్ధ‌త‌, వ్యూహాలు, స్వ‌చ్చందంగా పన్నుచెల్లింపుదారుల సంఖ్య‌ను పెంచే దిశ‌గా ప‌న్నుల వ్య‌వ‌స్థ ప‌రిణామం అన్న స‌హేతుక అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. 
పన్నుల అధిప‌తుల స‌మావేశ ముగింపులో అధికార ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశారు. 

 

***
 



(Release ID: 1755258) Visitor Counter : 137