నీతి ఆయోగ్
నీతి ఆయోగ్, ఆర్‌ఎంఐ, మరియు ఆర్‌ఎంఐ ఇండియా ‘శూన్య’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి
30 కి పైగా ఇ-కామర్స్ సంస్థలు, ఓఈఎంలు, ఫ్లీట్ అగ్రిగేటర్లు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఫైనల్-మైలు డెలివరీలను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించడంలో చేతులు కలుపుతాయి.
Posted On:
15 SEP 2021 5:12PM by PIB Hyderabad
నీతి ఆయోగ్, ఆర్‌ఎంఐ మరియు ఆర్‌ఎంఐ ఇండియా మద్దతుతో వినియోగదారులు మరియు పరిశ్రమలతో కలిసి పనిచేయడం ద్వారా జీరో-పొల్యూషన్ డెలివరీ వాహనాలను ప్రోత్సహించే ఒక చొరవ అయిన శూన్యను నేడు ప్రారంభించింది. పట్టణ డెలివరీల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవిలు) వినియోగాన్ని వేగవంతం చేయడం మరియు జీరో-పొల్యూషన్ డెలివరీ ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఇ-కామర్స్ కంపెనీలు, ఫ్లీట్ అగ్రిగేటర్లు, ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఓఈఎంలు) మరియు లాజిస్టిక్స్ కంపెనీలు వంటి పరిశ్రమ వాటాదారులు లాస్ట్ మైల్ డెలివరీ విద్యుదీకరణ దిశగా తమ ప్రయత్నాలను పెంచుతున్నారు. నీతి ఆయోగ్ కార్యక్రమానికి తమ మద్దతును తెలియజేయడానికి మహీంద్రా ఎలక్ట్రిక్, టాటా మోటార్స్, జొమాటో, అశోక్ లేలాండ్, సన్ మొబిలిటీ, లైట్నింగ్ లాజిస్టిక్స్, బిగ్ బాస్కెట్, బ్లూడార్ట్, హీరో ఎలక్ట్రిక్ మరియు స్విగ్గీతో సహా దాదాపు 30 కంపెనీలు సిఈఓ అమితాబ్ కాంత్ అధ్యక్షతన జరిగిన కిక్ ఆఫ్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావడానికి ఇతర సంస్థలను ఆహ్వానిస్తారు.
కార్యక్రమంలో భాగంగా తుదిమైలు డెలివరీల కోసం ఈవీ పరిశ్రమ ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించడానికి కార్పొరేట్ బ్రాండింగ్ మరియు ధృవీకరణ కార్యక్రమం ప్రారంభించబడింది. ఆన్‌లైన్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ కార్యక్రమ ప్రభావాన్ని వాహన కిలోమీటర్లు విద్యుదీకరించడం, కార్బన్ సేవింగ్స్, కాలుష్య కారకాలు మరియు క్లీన్ డెలివరీ వాహనాల నుండి ఇతర ప్రయోజనాలు వంటి డేటా ద్వారా పంచుకుంటుంది.
కార్యక్రమ ప్రాథమిక లక్ష్యాన్ని హైలైట్ చేస్తూ నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు. "విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా ఆరోగ్యం, పర్యావరణం మరియు ఆర్ధిక ప్రయోజనాల గురించి అవగాహనను మేము శూన్య కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తాము. సరుకు రవాణా రంగం నుండి కాలుష్యాన్ని తొలగించే అవకాశాన్ని గుర్తించాలని ఇ-కామర్స్ కంపెనీలు, ఆటో తయారీదారులు మరియు లాజిస్టిక్స్ ఫ్లీట్ ఆపరేటర్లను నేను కోరుతున్నాను. మా డైనమిక్ ప్రైవేట్ రంగం శూన్యను గొప్ప విజయాన్ని సాధించే సవాలుగా ఎదుగుతుందని నాకు నమ్మకం ఉంది" అని తెలిపారు.
క్లిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన తక్షణ అవసరం గురించి ఆర్‌ఎంఐ మేనేజింగ్ డైరెక్టర్ క్లే స్ట్రేంజర్ మాట్లాడుతూ "స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన భవిష్యత్తు వైపు భారతదేశం ముందుకు సాగుతున్నందున పరిశుభ్రమైన రవాణాకు పరివర్తన చాలా కీలకం. పోటీతత్వకలిగిన ఆర్థికరంగం అందుబాటులో ఉన్న సాంకేతికత వేగవంతమైన టైమ్‌లైన్‌లో భారతదేశ అర్బన్ డెలివరీ ఫ్లీట్‌ల పూర్తి విద్యుదీకరణకు మద్దతు ఇస్తుంది. ఇది ఇతర మార్కెట్ విభాగాలు అనుసరించడానికి అవసరమైన మద్దతును సృష్టిస్తుంది." అని చెప్పారు.
భారతదేశంలో సరుకు రవాణా సంబంధిత సిఓ2 ఉద్గారాలలో పట్టణ సరుకు రవాణా వాహనాలు 10 శాతం ఉన్నాయి. 2030 నాటికి ఈ ఉద్గారాలు 114 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఈవిలు ఏ టెయిల్‌పైప్ ఉద్గారాలను విడుదల చేయవు. ఇది మెరుగైన వాయు నాణ్యతకు ఎంతో దోహదం చేస్తుంది. వాటి తయారీకి లెక్కలు వేసినప్పుడు కూడా అవి తమ అంతర్గత దహన ఇంజిన్ ప్రత్యర్ధులతో పోలిస్తే 15-40 శాతం తక్కువ సిఓ2 ను విడుదల చేస్తాయి మరియు తక్కువ మెయింటెన్స్ వ్యయాన్ని కలిగి ఉంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిల కోసం ప్రోత్సాహకాలను అందించడానికి పాలసీలను ప్రవేశపెట్టాయి, ఇది మూలధన వ్యయాన్ని భారీగా తగ్గిస్తుంది." అని తెలిపారు.
***
(Release ID: 1755256)
Visitor Counter : 260