పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
స్వమిత్వ పథకంపై జాతీయ స్థాయి సమ్మేళనాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
స్వమిత్వ పథకానికి సంబంధించిన వివిధ ప్రక్రియలకు సంబంధించి తెలుసుకునేందుకు రాష్ట్రాలకు ఈ సమావేశం ఒక అధ్యయన వేదికగా ఉపయోగపడుతుంది.
Posted On:
13 SEP 2021 6:01PM by PIB Hyderabad
కేంద్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ స్వమిత్వ పథకంపై జాతీయ సమ్మేళనాన్ని 2021 సెప్టెంబర్ 14న ప్రారంభిస్తారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేందుకు, కీలక మెట్టుగా ఉండనుంది. ఈ సమావేశంలో శ్రీ గిరిరాజ్‌సింగ్ కీలకోపన్యాసం చేస్తారు. కేంద్ర పంచాయతి రాజ్‌శాఖ సహాయమంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రులు శ్రీ ఫగన్ సింగ్ కులస్తే, సుశ్రీ సాధ్వి నిరంజన్‌జ్యోతి లు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహాయమంత్రులు ఈ ప్రారంభ సమావేశంలో తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర పంచాయితిరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ తొలిపలుకులతో సమావేశం ప్రారంభమౌతుంది.
వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందిన వారు, స్వమిత్వ పథకం అమలులో క్రియాశీలంగా ఉన్న జియో స్పేషియల్ డాటా సెంటర్ (జిడిసి), సర్వే ఆఫ్ ఇండయా అధికారులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన పంచచాయతిరాజ్, రెవిన్యూ, సర్వే, సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్స్, ఇతర సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు, ఇండియన్ బ్యాంక్‌ల అసోసియేషన్ ప్రతినిధులు , ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు.
స్వమిత్వ పైలట్ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం, 2021 ఏప్రిల్ 24న పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి స్వమిత్వ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించిన నేపథ్యంలో ప్రస్తుత జాతీయ సమ్మేళనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ జాతీయ సమ్మేళనం,వివిధ భాగస్వామ్య పక్షాలు ఒకరతో ఒకరు సంప్రదించుకోవడానికి తమ అనుభవాలను, పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి , ఈ పథకానికి సంబంధించి పైలట్ పథకం అమలు సందర్భంగా అనభవంలోకివచ్చిన విషయాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. స్వమిత్వ పథకానికి సంబంధించిన వివిధ ప్రక్రియలను తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. అలాగే అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి అవగాహనకు, సకాలంలో పథకం అమలుకుసంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల విసయంలో , అలాగే ఆస్తి కార్డులను బ్యాంకులో పెట్టిడబ్బు పొందడానికి సంబంధించిన అంశాలు, ఆరోషెడ్యూల్ ఏరియా కు సంబంధించినవి ఇందులో ఉన్నాయి.
నేపథ్యం:
స్వమిత్వ ( సర్వే ఆఫ్ విలేజస్ అండ్ మాపింగ్ విత్ ఇంప్రొవైజ్‌డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా) పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఏప్రిల్ 24 జాతీయ పంంచాయతి రాజ్ దినోత్సవం నాడు
ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటి యజమానికి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇవ్వడం ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధిక ప్రగతికి దోహదపడేందుకు సంకల్పించారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆబాది భూమిని , అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా తాజాగా సర్వేజరపడానికి ఉద్దేశించిన ఈ పథకం, కేంద్ర పంచాయతిరాజ్ శాఖ, రాష్ట్ర రెవిన్యూ విభాగాలు, రాష్ట్ర పంచాయతిరాజ్ విభాగాలు, సర్వే ఆఫ్ ఇండియా సమష్ఠి కృషితో రూపుదిద్దుకున్నది. ఈ పకథం ఎన్నో కోణాలను స్పృశిస్తుంది. ఇది ఆస్తికి విలువను కల్పిస్తంది, ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలను తగ్గిస్తుంది. గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళికకు వీలు కల్పిస్తుంది. ఇది గ్రామస్వరాజ్‌ను సాధించడానికి కీలక మైలురాయిగా కానుంది. ఆ రకంగా గ్రామీణ భారతదేశం స్వావలంబన సాధించి ఆత్మనిర్భర్ కానుంది.
తొలిదశ- తొలిదశ పైలట్ పథకం కింద (ఏప్రిల్ 2020- మార్చి 2021) హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లలో చేపట్టారు. అలాగే నిరంతర ఆపరేటింగ్ రెఫరెన్స్ వ్యవస్తలు (సిఒఆర్ ఎస్)లను హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో చేపట్టారు.
రెండో దశ కింద ( ఏప్రిల్ 2021- మార్చి 2025)- మిగిలన గ్రామాలన్నింటిలో పూర్తి సర్వే, దేశవ్యాప్తంగా 2022 నాటికి సిఒఆర్ఎస్ నెట్‌వర్క్ కవరేజ్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 అక్టోబర్ 11న హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకుచెందిన 763 గ్రామాలలోని 1.25 లక్షల మంది నివాసితులకు ఆస్తి కార్డులను పంపిణీచేశారు. 2021 ఏప్రిల్ 24 వ తేదీ జాతీయ పంచాయతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జాతీయ స్థాయిలో స్వమిత్వ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 5 వేలకు పైగా గ్రామాలలోని 4 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఆస్తి కార్డులు, యాజమాన్య కార్డులు పొందగలిగారు
*****
(Release ID: 1754675)
Visitor Counter : 176