కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భాగస్వాముల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కన్సల్టేషన్ పేపర్‌పై వచ్చిన వ్యాఖ్యలపై తీర్మానం చేసిన ఎన్ఎఫ్ఆర్ఎ
प्रविष्टि तिथि:
13 SEP 2021 5:41PM by PIB Hyderabad
పబ్లిక్ ఇంటరెస్ట్ ఎంటిటీస్ (ప్రజా ప్రయోజన సంస్థలు -పిఐఇ)ల కు భారతీయ ఆర్థిక నివేదిక వ్యవస్థ ( ఇండియన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టం)లో వ్యవస్థాపరమైన మార్పులు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2018లో జాతీయ ఆర్థిక నివేదిన అథారిటీ (నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ -ఎన్ఎఫ్ఆర్ఎ)ను ఏర్పాటు చేసింది.
తన ప్రజా ప్రయోజన నియమాన్ని అందించడమనే వ్యూహంలో అన్ని వర్గాలకు చెందిన భాగస్వాములతో పరస్పర చర్య అన్నది కేంద్రంగా ఎన్ఎఫ్ఆర్ఎ గుర్తించింది. అందుకు అనుగుణాంగానే, ఇందులో ఉన్న సమస్యలను, తీసుకోవలసిన చర్యలను పరిశీలించి, సూచించవలసిందిగా సాంకేతిక సలహా మండలి (టిఎసి)ని ఎన్ఎఫ్ఆర్ఎ కోరింది. టిఎసి తన నివేదికను మార్చి 2021న సమర్పించింది. టిఎసి నివేదిక, సూచనల ను పరిశీలన ఆధారంగా ఎన్ఎఫ్ఆర్ఎ తీసుకోవాలని యోచిస్తున్న ప్రతిపాదిత చర్యలపై ప్రజాభివప్రాయాలు/ సూచనలను కోరుతూ కన్సల్టేషన్ పేపర్‌ను జూన్ 2021న విడుదల చేసింది. ప్రజలు తమ అభిప్రాయాలను నివేదించేందుకు ఆఖరు తేదీ జులై 30, 2021.
పరిశ్రమ సంస్థలు, పెద్ద అకౌంటింగ్ సంస్థలు, రీసెర్చ్ అకాడమియా సహా ముఖ్యమైన భాగస్వాముల నుంచి ఎన్ఎఫ్ఆర్ఎ 17 వ్యాఖ్యలతో కూడిన లేఖలను అందుకుంది. మొత్తం మీద, భాగస్వాములను సానుకూలంగా కలుపుకుపోవడాన్ని ప్రోత్సహించేందుకు ఎన్ఎఫ్ఆర్ఎ చేసిన ప్రతిపాదనలకు భాగస్వాములు తమ మద్దతును వ్యక్తం చేశాయి. ప్రజల నుంచి వచ్చిన సూచనలను, వ్యాఖ్యలను విశ్లేషించిన అనంతరం కన్సల్టేషన్ పేపర్‌లో సమస్యలకు సంబంధించి వేసిన ప్రశ్నలకు సంబంధించి ముందుకు పొవడం ఎలాగన్న ఒక తీర్మానానికి వచ్చింది. తాము అందుకున్న వ్యాఖ్యలు, వాటిపై ఎన్ఎఫ్ఆర్ ఐ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని దిగువన ఇచ్చిన లింకులో చూడవచ్చు.
https://nfra.gov.in/consultation_papers.
తన కీలక భాగస్వాములందరు చేసిన విలువైన సూచనలు, అభిప్రాయాలను ఎన్ఎఫ్ఆర్ఎ గుర్తిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1754645)
आगंतुक पटल : 243