ప్రధాన మంత్రి కార్యాలయం

శిక్షక్ పర్వ్ ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 07 SEP 2021 1:07PM by PIB Hyderabad

నమస్కారం.

 

శిక్షక్ పర్వ్ అనే ఈ కీలక కార్యక్రమం లో మనతో జత పడుతున్నటువంటి మంత్రిమండలి లో నా సహచరుడు అయిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, శ్రీమతి అన్నపూర్ణ దేవి గారు, డాక్టర్ సుభాస్ సర్ కార్ గారు, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింహ్ గారు, దేశం లో వివిధ రాష్ట్రాల గౌరవనీయ విద్య శాఖ మంత్రులు, జాతీయ విద్య విధానం ముసాయిదా ను రూపొందించిన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి రంగన్ గారు, ఆయన బృందం లోని గౌరవనీయులైన సభ్యులు, దేశవ్యాప్తం గా ఉన్నటువంటి పండితులైన ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులారా.

 

నేను అన్నింటి కంటే ముందు, జాతీయ పురస్కారాలను అందుకొన్న మన ఉపాధ్యాయులకు అనేకానేక అభినందనల ను తెలియజేస్తున్నాను. మీరందరూ కఠిన కాలాల్లో దేశం లో విద్య కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిష్ఠ గా చేసిన ప్రయత్నం, తోడ్పాటు లు సాటి లేనటువంటివి, ప్రశంసనీయమైనవీనూ. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న మన విద్యార్థుల ను నేను తెర మీద చూస్తున్నాను. ఒకటిన్నరేళ్లు లేదా రెండు సంవత్సరాల లో మొదటి సారి మీ వదనాల లో ఒక భిన్నమైనటువంటి ప్రకాశం కనిపిస్తున్నది. ఈ ప్రకాశం బహుశా పాఠశాల లు తెరవడం వల్ల వచ్చింది అని తోస్తున్నది. దీర్ఘ కాలం అనంతరం పాఠశాల కు వెళ్లడం, స్నేహితుల ను కలుసుకోవడం, తరగతి గది లో చదువుకోవడం, వీటి తాలూకు ఆనందమే వేరుగా ఉంటుంది. కానీ ఉత్సాహం తో పాటు మనం అందరమూ కరోనా నియమాల ను కూడా పాటించవలసి ఉంది. మీరు కూడాను పూర్తి స్థాయి లో నియమాల ను శిరసావహించవలసి ఉంది.

 

సహచరులారా,

 

ఈ రోజు న శిక్షక్ పర్వ్ సందర్భం లో అనేక కొత్త పథకాల ను ప్రారంభించడమైంది. మరి ఇప్పుడే మనం ఒక చిన్న చిత్రం ద్వారా ఈ పథకాల ను గురించి తెలుసుకొన్నాం. దేశం ఇప్పుడు స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్న కారణం గా కూడాను ఈ కార్యక్రమం ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది అని చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి భారతదేశం ఎలా ఉంటుందో, దీని కోసం ఇవాళ భారతదేశం కొత్త సంకల్పాలు చెప్పుకొంటోంది. ఈ రోజు న ప్రారంభం అయిన పథకాలు భవిష్యత్తు లో భారతదేశాన్ని దిద్దితీర్చడం లో కీలకమైన పాత్ర ను పోషించగలవు. నేడు, విద్యాంజలి-2.0, నిష్థా-3.0, మాట్లాడే పుస్తకాలు, ఇంకా యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లర్నింగ్ (యుడిఎల్) ఆధారితమైన ఐఎస్ఎల్-డిక్షనరీ ల వంటి కొత్త కొత్త కార్యక్రమాలను, కొత్త కొత్త వ్యవస్థల ను ప్రారంభించడం జరిగింది. స్కూల్ క్వాలిటీ అసెస్ మెంట్ ఎండ్ అశ్యురన్స్ ఫ్రేంవర్క్ (ఎస్.క్యు.ఎ.ఎ.ఎఫ్) ల వంటి ఆధునిక ప్రారంభం కూడా జరిగింది; అవి మన విద్య వ్యవస్థ ను ప్రపంచ స్థాయి లో పోటీపడేది గా మలచడం ఒక్కటే కాకుండా, మన యువత ను సైతం భవిష్యత్తు కై సంసిద్ధం చేయడం లో కూడాను చాలా సాయపడుతాయి అని నాకు పూర్తి భరోసా ఉంది.

 

సహచరులారా,

 

ఈ కరోనా కాలం లో, మన విద్య వ్యవస్థ సామర్థ్యం ఎంత అధికం గా ఉన్నదీ మీరంతా నిరూపించారు. సవాళ్లు అనేకం గా ఉన్నప్పటికీ, మీరందరూ ఆ సవాళ్ల ను వేగం గా పరిష్కరించారు. ఆన్ లైన్ తరగతులు, గ్రూపు వీడియో కాల్స్, ఆన్ లైన్ ప్రాజెక్టు లు, ఆన్ లైన్ ఎగ్జామినేశన్స్, ఇదివరకయితే అలాంటి మాటల ను చాలా మంది విననైనా లేదు. కానీ మన ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, మన యువత ఎంతో సులభం గా వీటిని రోజువారీ జీవితం లో ఓ భాగం గా చేసివేశారు!

 

సహచరులారా,

 

మనం మన యొక్క ఈ సామర్థ్యాల ను ముందు కు తీసుకు పోవలసిన సమయం వచ్చేసింది. ఈ క్లిష్ట సమయం లో మనం నేర్చుకున్న దానికి ఓ కొత్త దిశ ను ఇద్దాం. అదృష్టవశాత్తు, ఈ రోజు న, ఒకవైపు దేశం లో మార్పున కు సంబంధించినటువంటి వాతావరణం అంటూ ఒకటి ఉంది, అలాగే కొత్త జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) వంటి ఆధునికమైనటువంటి, భవిష్యత్ విధానం అంటూ కూడా ఒకటి ఉంది. అందుకే, కొంత కాలం గా దేశం నిరంతరం విద్య రంగం లో ఒకదాని తరువాత మరొకటి గా కొత్త నిర్ణయాల ను తీసుకొంటోంది, ఒక పరివర్తన రావడాన్ని చూస్తూ ఉన్నది. మరి దీని వెనుక ఉన్న అతి పెద్ద శక్తి, ఆ శక్తి వైపునకు నా దృష్టి ని, మీ పండితులు అందరి దృష్టి ని ఆకర్షించాలి అని నేను అనుకొంటున్నాను. ఈ ఉద్యమం విధానాల పైన మాత్రమే ఆధారపడినటువంటిది కాదు, అది అంతా పాలుపంచుకోవడం అనే విషయం పైన కూడా ఆధారపడినటువంటిది అని చెప్పాలి. ఎన్ఇపి కి రూపకల్పన చేయడం మొదలుకొని అమలు చేయడం వరకు, ప్రతి ఒక్క స్థాయి లో విద్యావేత్త ల, నిపుణుల, ఉపాధ్యాయుల, ఇలాగ అందరి తోడ్పాటు లభించింది. మీరందరూ దీనికి గానున ప్రశంసల ను పొందడానికి అర్హులు అయ్యారు. ఇప్పుడు మనం ఈ భాగస్వామ్యాన్ని ఒక కొత్త స్థాయి కి తీసుకు పోవలసి ఉంది; మనం దీనిలో సమాజాన్ని కూడాను జోడించవలసిన అవసరం ఉంది.

 

సహచరులారా,

 

వ్యయే కృతే వర్ధతే ఎవ్ నిత్యమ్ విద్యాధనమ్ సర్వధన్ ప్రధానమ్అని ఆర్యోక్తి.

ఈ మాటల కు.. విద్య అన్ని సంపదల లోను, అన్ని సంపత్తుల లోను అతిపెద్ద ఆస్తి.. అని భావం. ఎందుకు అంటే విద్య అనేది మాత్రమే దానిని ఇతరుల కు ఇవ్వడం ద్వారా, దానం చేయడం ద్వారా పెరుగుతుంటుంది. విద్య ను దానం చేయడం, బోధించే వారి జీవనం లో చాలా పెద్ద పరివర్తన ను తీసుకు వస్తుంది. ఈ కార్యక్రమం తో సంబంధం గల మీ ఉపాధ్యాయులు అందరూ వారి వారి హృదయాల లో ఈ భావన ను అనుభూతి చెంది ఉండి ఉంటారు. ఒకరి కి ఏదైనా కొత్త దానిని బోధించడం తాలూకు సుఖం సంతోషం కలుగుతాయో, ఆ సంతృప్తి భిన్నం గానే ఉంటుంది మరి. విద్యాంజలి 2.0’, ఈ పురాతన సంప్రదాయాన్ని ఇప్పుడు ఒక కొత్త ఫ్లేవర్ లో బలోపేతం చేస్తుంది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్తో పాటు సబ్ కా ప్రయాస్తాలూకు ఏ సంకల్పాన్నయితే చెప్పుకోవడం జరిగిందో; ‘విద్యాంజలి 2.0దానికి ఒక చాలా ఉత్తేజకరం అయిన వేదిక లాంటిది. ఇది ఒక హుషారైన వేదిక లాంటిది. దీనిలో మన సమాజం, మన ప్రైవేట్ రంగం ముందుకు రావాలి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యత ను పెంచడం లో వాటి వంతు తోడ్పాటు ను అందించాలి.

 

సహచరులారా,

 

అనాది కాలం నుంచి భారతదేశం లో సమాజం యొక్క సామూహిక శక్తి మీద భరోసా ను పెట్టుకొంటూ రావడమైంది. ఇది చాలా కాలం గా మన సామాజిక సంప్రదాయం లో ఒక భాగం గా ఉంటూ వచ్చింది. సమాజం కలసి ఏదైనా చేసిందీ అంటే గనక ఆశించిన ఫలితాలు తప్పక దక్కుతాయి. గత కొన్ని సంవత్సరాలు గా కొనసాగినటువంటి ప్రజల భాగస్వామ్యం ఇప్పుడు మళ్ళీ భారతదేశం తాలూకు జాతీయ స్వభావం గా మారుతుండటాన్ని మీరు గమనించే ఉంటారు. గత 6-7 సంవత్సరాల లో, సామూహిక భాగస్వామ్యం యొక్క శక్తి తో, భారతదేశం లో అయినటువంటి కార్యాల ను ఎవరూ ఊహించనైనా ఊహించి ఉండరు. అది స్వచ్ఛత ఉద్యమం కావచ్చు, లేదా గివ్ ఇట్ అప్తాలూకు భావన కావచ్చు, లేదా ప్రతి పేద ఇంటి కి గ్యాస్ కనెక్షన్ ను చేర్చడం కావచ్చు, పేదల కు డిజిటల్ లావాదేవీల ను నేర్పించడం కావచ్చు.. ప్రతి రంగం లో భారతదేశం సాధించిన పురోగతి ప్రజల భాగస్వామ్యం నుంచి శక్తి ని అందుకొంది. ఇప్పుడు విద్యాంజలికూడా అదే వరుస లో ఒక సువర్ణ అధ్యాయం కానుంది. విద్యాంజలి దేశం లో ప్రతి పౌరుని కి/ప్రతి పౌరురాలి కి ఉద్దేశించిన ఆహ్వానం. ప్రతి పౌరుడు/ ప్రతి పౌరురాలు దీనిలో పాలుపంచుకోవాలని, దేశం భవిష్యత్తు ను రూపొందించడం లో వారి క్రియాత్మక పాత్ర ను పోషించాలి అనేదే ఆ ఆహ్వానం. రెండు అడుగు లు ముందుకు రండి. మీరు ఒక ఇంజినీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక రిసర్చ్ సైంటిస్ట్ కావచ్చు, మీరు ఎక్కడైనా ఒక ఐఎఎస్ అధికారి అయ్యి ఎక్కడైనా కలెక్టర్ రూపం లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ మీరు ఏ పాఠశాల కో వెళ్లి బాలల కు బోలెడన్ని విషయాల ను నేర్పించగలరు! మీ ద్వారా ఆ పిల్లల కు నేర్చుకోవడానికి దొరికే విషయాలు వారి కలల కు కొత్త దిశ ను ఇవ్వగలవు. ఇలా చేస్తున్న చాలా మంది వ్యక్తుల ను గురించి మీకు, మాకు తెలుసును. ఎవరో బ్యాంకు మేనేజర్ గా పదవీవిరమణ చేసిన వ్యక్తి ఉత్తరాఖండ్ లోని మారుమూల కొండ ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థుల కు చదువు చెప్తున్నారు. ఎవరో వైద్య రంగం తో సంబంధం కలిగివున్న వ్యక్తి పేద పిల్లల కు ఆన్ లైన్ క్లాసుల ను నిర్వహిస్తున్నారు, వారి కోసం సాయాన్ని అందిస్తున్నారు. అంటే, మీరు సమాజం లో ఏ పాత్ర ను పోషించినా, విజయం యొక్క ఏ మెట్టు పైన ఉన్నా, యువత భవిష్యత్తు ను నిర్మించడం లో మీకు భూమికంటూ ఉంది, మీ భాగస్వామ్యమూ ఉంది. ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో, పారా-ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు గొప్ప గా రాణించారు. వారి నుంచి మన యువత ఎంతగా ప్రేరణ ను పొందిందో. నేను మన క్రీడాకారులను, క్రీడాకారిణుల ను అభ్యర్థించాను.. స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవ్ సందర్భం లో ప్రతి క్రీడాకారుడు/ ప్రతి క్రీడాకారిణి కనీసం 75 పాఠశాలల కు వెళ్లాలి అని. నేను చెప్పిన దానిని క్రీడాకారులు, క్రీడాకారిణులు స్వీకరించినందుకు నాకు సంతోషం గా ఉంది. మరి మరి నేను గౌరవనీయులైన శిక్షకగణాని కి, ఆచార్యుల సముదాయానికి సైతం చెప్తున్నాను.. ఏమని అంటే మీరు మీ మీ ప్రాంతాల లో ఈ క్రీడాకారుల తోను, క్రీడాకారిణుల తోను సంప్రదింపులు జరపండి, వారిని మీ మీ పాఠశాలల కు పిలవండి. పిల్లల తో వారు మాట్లాడేటట్టు చూడండి అని. దీని వల్ల మన విద్యార్థుల కు ఎంత ప్రేరణ దొరుకుతుందో గమనించండి, ఎంత మంది ప్రతిభావంతులైన విద్యార్థుల కు క్రీడల లో ముందు కు సాగిపోవడానికి ధైర్యం లభిస్తుందో.

 

సహచరులారా,

 

నేడు, స్కూల్ క్వాలిటి అసెస్ మెంట్ ఎండ్ అశ్యూరన్స్ ఫ్రేం వర్క్ (ఎస్.క్యు.ఎ.ఎ.ఎఫ్.) అనే మరొక ముఖ్యమైన ప్రారంభం అయింది. ఇప్పటి వరకు దేశం లో మన పాఠశాలల కోసం విద్య కై ఏదైనా ఒక ఉమ్మడి సైంటిఫిక్ ఫ్రేం వర్క్ అంటూ లేనేలేదు. కామన్ ఫ్రేంవర్క్ లేనిదే, పాఠ్య క్రమం, అధ్యాపన కళ, మూల్యాంకనం, ప్రాథమిక సదుపాయాలు, అందరిని కలుపుకొనిపోయే అభ్యాసాలు, పాలన ప్రక్రియ.. ఇవన్నింటి కోసం ప్రమాణాల ను రూపొందించడం కష్టం అయిపోయేది. దీని వల్ల దేశం లోని వేరు వేరు ప్రాంతాల లో, వివిధ పాఠశాలల్లో విద్యార్థుల కు సమానమైన చదువు లభించడం లో అసమానత బారిన పడవలసివస్తుంది. కానీ ఎస్.క్యు.ఎ.ఎ.ఎఫ్ ఇప్పుడు ఈ కందకాన్ని నింపే పని ని చేస్తుంది. ఈ ఫ్రేంవర్క్ తాలూకు గొప్పతనం ఏమిటి అంటే ఈ ఈ ఫ్రేంవర్క్ ను రాష్ట్రాలు వాటి అవసరాని కి అనుగుణం గా మార్చుకొనే వెసులుబాటు రాష్ట్రాల వద్దే ఉంటుంది. పాఠశాల లు కూడా దీని ని ఆధారం గా చేసుకొని వాటి మూల్యాంకనాన్ని అవే స్వయం గా చేసుకోగలుగుతాయి. దీని ఆధారం గా పాఠశాల లు ఒక పరివర్తనపూర్వక మార్పు కోసం ప్రోత్సహాన్ని సైతం అందించవచ్చును.

 

సహచరులారా,

 

విద్య లో అసమానత ను తొలగించి దాని ని ఆధునికీకరించడం లో నేశనల్ డిజిటల్ ఎడ్యుకేశనల్ ఆర్కిటెక్చర్, అంటే ఎన్-డియర్ (N-DEAR) కు కూడా గొప్ప పాత్ర లభించనుంది. బ్యాంకింగ్ రంగాన్ని యుపిఐ ఇంటర్ ఫేస్ విప్లవాత్మకం గా మార్చివేసిన మాదిరి గానే ఎన్-డియర్ అన్ని విద్యా సంబంధి కార్యకలాపాల మధ్య సూపర్ కనెక్ట్ వలె పనిచేస్తుంది. ఒక పాఠశాల నుండి మరొక పాఠశాల కు వెళ్లడం కావచ్చు, లేదా ఉన్నత విద్య లో ప్రవేశమో, బహుళ ప్రవేశం-నిష్క్రమణ తాలూకు వ్యవస్థ కావచ్చు, లేదా అకైడమిక్ క్రెడిట్ బ్యాంక్, ఇంకా విద్యార్థుల నైపుణ్యాల రెకార్డు.. ప్రతిదీ ఎన్-డియర్ మాధ్యమం ద్వారా ఇట్టే అందుబాటు లోకి రాగలదు. ఈ పరివర్తనలన్నీ కూడాను మన నూతన యుగ విద్యతాలూకు ముఖం గా మారుతాయి; నాణ్యమైన విద్య లో భేదభావాన్ని కూడా తొలగించివేస్తాయి.

 

సహచరులారా,

 

ఏ దేశం ప్రగతి ని సాధించాలన్నా విద్య అన్ని వర్గాల కు అందడం ఒక్కటే కాకుండా సమాన ప్రాతిపదిక ను కలిగివుండాలి అనే సంగతి ని గురించి మీకు అందరి కి తెలుసును. అందుకే నేడు దేశం టాకింగ్ బుక్స్, ఆడియో బుక్స్ వంటి సాంకేతికత ను విద్య లో ఓ భాగం గా చేస్తోంది. యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లర్నింగ్ అంటే యుడిఎల్ ఆధారం గా 10,000 పదాల తో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్శనరీ ని కూడా అభివృద్ధి చేయడమైంది. అసమ్ లోని బిహూ నుంచి భరతనాట్యమ్ వరకు, ప్రతీకాత్మక భాష మన దగ్గర శతాబ్దాల నాటి నుంచి కళలు మరియు సంస్కృతి లో భాగం గా ఉంది. ఇప్పుడు, మొట్టమొదటిసారి గా, దేశం సైగల భాష (సైన్ లాంగ్వేజ్ ) ను ఒక సబ్జెక్టు గా పాఠ్యక్రమం లో భాగం గా చేస్తోంది; దీని ద్వారా ఏ అమాయక బాలల కు దీని గొప్ప అవసరం ఉన్నదో, వారు ఎవ్వరికీ తీసిపోబోరు! ఈ టెక్నిక్ దివ్యాంగ యువత కు కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అదే విధం గా, నిపుణ్ భారత్ అభియాన్ లో మూడు ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు బాలల కోసం ఫౌండేశన్ లిటరసీ ఎండ్ న్యూమరసీ మిశన్ను ప్రారంభించడం జరిగింది. 3 సంవత్సరాల వయస్సు నుంచే పిల్లలంతా నిర్బంధ ప్రి-స్కూల్ విద్య ను అందుకొనే విధం గా అవసరమైన చర్యల ను తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిని మనం చాలా దూరం తీసుకుపోవాలి, ముఖ్యం గా మన గురు మిత్రుల భూమిక చాలా ప్రధానమైనది అని చెప్పాలి.

 

 

 

స్నేహితులు,

 

మన శాస్త్రాల లో ఇలా చెప్పడం జరిగింది..:

 

‘‘ద్రిష్టాంతో నవ్ ద్రష్టి: త్రి-భువన్ జఠరే,

సద్గురో: జ్ఞాన దాతు:’’ అని.

 

ఈ మాటల కు.. యావత్తు బ్రహ్మాండం లో గురువు కు పోలిక అంటూ ఉండదు, ఎలాంటి దీటుతనం ఉండనే ఉండదు. గురువు చేయగలిగే పని ని ఎవరూ చేయలేరు అని భావం. ఈ కారణం గానే, నేడు దేశం తన యువత కోసం విద్య కు సంబంధించిన ఎన్ని ప్రయత్నాలను చేస్తున్నా, ఆ ప్రయత్నాల తాలూకు కళ్లేలు మన ఉపాధ్యాయ సోదరులు మరియు మన ఉపాధ్యాయ సోదరీమణుల చేతుల లో ఉన్నాయి. కానీ వేగం గా మారుతున్నటువంటి ఈ యుగం లో మన ఉపాధ్యాయులు కూడా కొత్త నిబంధనలను, పద్ధతుల ను గురించి త్వరగా నేర్చుకోవాలి. నిష్ఠశిక్షణ కార్యక్రమాల తో ఈ ట్రయినింగ్ ప్రోగ్రామ్ యొక్క ఒక మంచి నిష్ఠ ను ఇప్పుడు మీ సమక్షం లో సమర్పించడం జరిగింది. ఈ నిష్ఠ కార్యక్రమం మాధ్యమం ద్వారా దేశం తన గురువుల ను ఈ మార్పుల కోసం సిద్ధం చేస్తున్నది. 'నిష్ట 3.0' ఇప్పుడు ఈ దిశ లో మరొక తదుపరి అడుగు గా ఉంది. అంతేకాదు దీనిని చాలా ముఖ్యమైనటువంటి అడుగు గా నేను భావిస్తాను. మన ఉపాధ్యాయులు ఎప్పుడైతే కాంపిటెన్సీ బేస్ డ్ టీచింగ్, ఆర్ట్ - ఇంటిగ్రేశన్, హై- ఆర్డర్ థింకింగ్ మరియు క్రియేటివ్ ఎండ్ క్రిటికల్ థింకింగ్ ల వంటి కొత్త రీతులు, మార్గాలను గురించి తెలుసుకుంటారో అప్పుడు వారు భవిష్యత్తు కోసం యువత ను మరింత సులభం గా దిద్దితీర్చగలుగుతారు.

 

సహచరులారా,

 

భారతదేశం లోని ఉపాధ్యాయుల కు ఏ ప్రపంచ ప్రమాణాలకు అయినా దీటు గా రాణించే సామర్థ్యం ఉండనే ఉంది, దీనికి తోడు వారి దగ్గర వారి వారిది అయినటువంటి ప్రత్యేక మూలధనం కూడా ఉంది. వారి యొక్క ఈ ప్రత్యేక మూలధనం, ఈ ప్రత్యేక బలమల్లా వారి లోపల ఉన్న భారతీయ సంస్కరమే. మరి మీకు నేను నా యొక్క రెండు అనుభవాల ను చెప్పాలని అనుకొంటున్నాను. నేను ప్రధాన మంత్రి ని అయ్యి మొదటి సారి భూటాన్ కు వెళ్ళినప్పుడు అక్కడి రాజ కుటుంబం కావచ్చు, అక్కడి పాలక వ్యవస్థ తాలూకు వ్యక్తులు కావచ్చు, ఇదివరకు దాదాపు గా ఉపాధ్యాయులు అందరూ భారతదేశం నుంచి వచ్చే వారు, వారు ఇక్కడి మారుమూల ప్రాంతాలకు కాలినడక న వెళ్లి చదువు ను చెప్పే వారు అని చాలా గర్వం గా చెప్పే వారు. ఉపాధ్యాయుల ను గురించిన మాటలు ప్రస్తావనకు వచ్చాయి అంటే భూటాన్ రాజ కుటుంబం కావచ్చు, లేదా అక్కడి పాలకులు చాలా గర్వం గా అగపడే వారు, వారి కళ్ళలో ప్రకాశం కనిపించేది. అదేవిధం గా, నేను సౌదీ అరేబియా కు వెళ్లినప్పుడు బహుశా సౌదీ అరేబియా రాజు తో అనుకుంటాను, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన చాలా గర్వం గా నాతో ప్రస్తావించసాగారు.. ఏమని అంటే నాకు చదువు చెప్పింది భారతదేశాని కి చెందిన ఉపాధ్యాయుడు అని. నా గురువు భారతదేశాని కి చెందిన వారు అని. ఇప్పుడు చూడండి, టీచర్ పట్ల ఏ వ్యక్తి అయినా ఎక్కడకు చేరుకొన్నా వారి మనస్సు లో ఎలాంటి భావం ఉంటుందో.

 

సహచరులారా,

 

మన ఉపాధ్యాయులు వారి పని ని కేవలం వృత్తి అని అనుకోరు, వారికి బోధించడం అనేది ఒక మానవీయ సంవేదన, ఒక పవిత్ర కర్తవ్యం, ఒక నైతిక కర్తవ్యం. ఈ కారణం గా, మన దగ్గర టీచరు కు, పిల్లల కు మధ్య వృత్తిపరమైన బంధం అంటూ ఉండదు, కానీ ఒక కుటుంబిక బంధం అంటూ ఉంటుంది. మరి ఈ బంధమూ, ఈ సంబంధమూ యావత్తు జీవనానికి సంబంధించినది అయివుంటుంది. అందుకే, భారతదేశం లో ఉపాధ్యాయులు ప్రపంచం లో ఎక్కడ కు వెళ్ళినప్పటికీ, వారిది అయినటువంటి ఒక భిన్నమైన ముద్ర ను వేస్తారు. ఈ కారణం గా, నేడు భారతదేశ యువత కు ప్రపంచం లో అపారమైన సంభావ్యత లు కూడా ఉన్నాయి. మనం ఆధునిక ఎడ్యుకేశన్ ఇకోసిస్టమ్ ప్రకారం మనలను మనం తయారు చేసుకోవలసి ఉంది. ఈ సంభావ్యతల ను అవకాశాలు గా కూడాను మార్చుకోవలసి ఉంది. దీని కోసం మనం నిరంతరం నూతన ఆవిష్కరణల ను చేస్తూ సాగిపోతుండాలి. మనం బోధన, నేర్వడం అనే ప్రక్రియల ను అదే పని గా పునర్ నిర్వచించడం, నమూనా ను పునరావిష్కరించడం చేస్తుండాలి. మీరు ఏ ఉత్సాహాన్ని అయితే ఇప్పటివరకు చూపించారో, దానికి మనం ఇప్పుడు మరింత ఎత్తు ను, మరింత సాహసాన్ని ఇవ్వవలసి ఉంది. శిక్షక్ పర్వ్ సందర్భం లో, ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ 17 వరకు [ మన దేశం లో సెప్టెంబర్ 17 ను విశ్వకర్మ జయంతిగా జరుపుకొంటూ ఉంటాం; ఈ విశ్వకర్మ స్వయం గా ఒక నిర్మాత, సృష్టికర్త] వివిధ విషయాలపై వర్క్ షాపు లు, చర్చాసభల ను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇది ఓ ప్రశంసనీయమైన ప్రయత్నం. దేశం అంతటా గల ఇంత మంది ఉపాధ్యాయులు, నిపుణులు, విధాన రూపకర్త లు ఒక్కుమ్మడి గా మథనాన్ని సాగిస్తారో, అటువంటప్పుడు దీని వల్ల స్వతంత్రం తాలూకు అమృత్ మహోత్సవ్ లో ఈ అమృతం తాలూకు ప్రాధాన్యం మరింత అధికం అయిపోతుంది. మీ సామూహిక మథనం జాతీయ విద్య విధానాన్ని విజయవంతం గా అమలుపరచడం లో సైతం చాలా సాయం లభిస్తుంది. మీరు ఇదే విధం గా మీ మీ పట్టణాల లో, గ్రామాల లో సైతం స్థానిక ప్రయాసల ను చేపట్టాలి అని నేను కోరుకొంటున్నాను. ఈ దిశ లో సబ్ కా ప్రయాస్వల్ల దేశం సంకల్పాల కు కొత్త గతి లభిస్తుంది అని నాకు విశ్వాసం ఉంది. అమృత్ మహోత్సవ్ లో దేశం ఏదయితే లక్ష్యాల ను నిర్దేశించుకొందో, వాటిని మనం అందరం కలసి సాధిస్తాం. ఇవే శుభాకాంక్షల తో, మీకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా శుభాకాంక్షలూను.

 

****

 



(Release ID: 1754014) Visitor Counter : 381