భారత ఎన్నికల సంఘం

06.10.2021 న పదవీ విరమణ చేస్తున్న సభ్యుని సీటును భర్తీ చేయడానికి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి రాష్ట్రాల కౌన్సిల్‌కు ద్వైవార్షిక ఎన్నికలు

Posted On: 09 SEP 2021 11:38AM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి ఎన్నికైన రాష్ట్రాల కౌన్సిల్ సభ్యుడి పదవీకాలం అక్టోబర్ 20, 2021న అతని పదవీ విరమణతో ముగుస్తుంది.

 

కేంద్రపాలిత ప్రాంతం పేరు    సభ్యుని పేరు పదవీ విరమణ తేదీ

 

పుదుచ్చేరి            శ్రీ. ఎన్. గోకులకృష్ణన్                06.10.2021

 

2.      కింది షెడ్యూల్ ప్రకారం పైన పేర్కొన్న ఖాళీని భర్తీ చేయడానికి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌కు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది: -

 

  క్రమ సంఖ్య   కార్యక్రమం            తేదీలురోజులు

 

 

            నోటిఫికేషన్ల జారీ                             15 సెప్టెంబర్, 2021 (బుధవారం)

            నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ          22 సెప్టెంబర్, 2021 (బుధవారం)

            నామినేషన్ల పరిశీలన                        23 సెప్టెంబర్, 2021 (గురువారం)

            నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ   27 సెప్టెంబర్, 2021 (సోమవారం)

            పోలింగ్ తేదీ                                   04 అక్టోబర్, 2021 (సోమవారం)

            పోలింగి జరిగే సమయం                     09:00 am - 04:00 pm

            ఓట్ల లెక్కింపు                                04 అక్టోబర్, 2021 (సోమవారం)

 సాయంత్రం 05:00 గం

            ఎన్నికను పూర్తి చేయడానికి గడువు తేది 06 అక్టోబర్, 2021 (బుధవారం)

 

3.        ఈసీఈ ఇప్పటికే జారీ చేసిన కోవిడ్ -19 విస్తృత మార్గదర్శకాలతో పాటు 04.09.2021 నాటి ప్రెస్ నోట్ 13 వ పేరాలో ఉన్న ఈసీఐజారీ చేసిన ఇటీవలి మార్గదర్శకాలు https://eci.gov.in/files/file/13681-schedule-to-fill-casual-vacancy-and-adjourned-poll-in-the-assembly-constituencies-regarding/ లింక్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులంతా ఆ మార్గదర్శకాలను అనుసరించాలి.

 4.        ఈ ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కోవిడ్ -19 నియంత్రణ చర్యలకు సంబంధించి ఉన్న సూచనలను పాటించేలా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన సీనియర్ అధికారిని నియమించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

*****



(Release ID: 1753538) Visitor Counter : 146