ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

2022-23 మార్కెట్ సీజ‌న్‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎం.ఎస్‌.పి)ని పెంచిన కేంద్ర కేబినెట్‌


పంట వైవిధ్యాన్ని ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఎం.ఎస్‌.పి పెంపు
గోధుమ‌లు, ర్యాప్‌సీడ్‌, ఆవాలు, పప్పులు, బార్లీ, పొద్దుతిరుగుడు,కందిప‌ప్పు విష‌యంలో రైతుల ఉత్ప‌త్తి ఖ‌ర్చుక‌న్న అధిక రాబ‌డికివ‌చ్చే అవ‌కాశం
గోధుమలు, రేప్‌సీడ్ , ఆవాలు, ఇంకా కాయధాన్యాలు, కందిప‌ప్పు, బార్లీ ,కుసుమ వంటి వాటి ఉత్పత్తి వ్యయంపై రైతులు అధిక రాబ‌డి పొంద‌వ‌చ్చ‌ని అంచనా.
చ‌మురుగింజ‌లు, ప‌ప్పుధాన్యాలు, తృణ‌ధాన్యాల‌కు అనుగుణంగా ఎం.ఎస్‌.పిల‌ను స‌మ‌తుల్యం చేయ‌డం జ‌రిగింది.
ర‌బీ పంట‌ల‌కు ఎం.ఎస్‌.పి పెంపు వ‌ల్ల రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌డానికి వీలు క‌లుగుతుంది.

Posted On: 08 SEP 2021 2:33PM by PIB Hyderabad
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ , ర‌బీ మార్కెట్ సీజ‌న్ 2022-23 కు సంబంధించి అన్ని అధీకృత ర‌బీ పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎం.ఎస్‌.పి) పెంపున‌కు ఆమోదం తెలిపింది.
2022-23 ర‌బీ మార్కెట్ సీజ‌న్‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం , ఉత్ప‌త్తిదారుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు  క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎం.ఎస్‌.పి)ని పెంచింది.
గ‌త ఏడాది కంటే అత్యంత ఎక్కువ‌గా మ‌సూర్‌కు రాప్‌సీడ్‌, ఆవాల‌కు క్వింటాలుకు రూ 400 రూపాయ‌ల వంతున అలాగే కందిప‌ప్పుకు క్వింటాలుకు 130 రూపాయ‌ల‌వంతున పెంపు. పొద్దుతిరుగుడు విష‌యంలో గ‌త ఏడాదితో పోలిస్తే క్వింటాలుకు 114 రూపాయ‌లు పెంచారు. పంట‌ల వైవిద్య‌త‌ను పెంచేందుకు డిఫ‌రెన్షియ‌ల్ రెమ్యున‌రేష‌న్ విధానాన్ని అనుస‌రించారు
పంట‌

 RMS 2021-22కు ఎం.ఎస్‌.పి

 

RMS2022-23కు ఎం.ఎస్‌.పి

 

ఉత్పత్తి వ్య‌యం

2022-23

MSP పెరుగుద‌ల‌

 

(Absolute)

ఖ‌ర్చుపైరాబ‌డి (శాతంలో) 

గోధుమ‌

1975

2015

1008

40

100

బార్లీ

1600

1635

1019

35

60

Gram

5100

5230

3004

130

74

మ‌సూర్‌

5100

5500

3079

400

79

రాప్‌సీడ్‌,

 &

ఆవాలు

4650

5050

2523

400

100

ఆవాలు

5327

5441

3627

114

50

*  ఇది స‌మ‌గ్ర ఖ‌ర్చును సూచిస్తుంది. అంటే అన్ని ర‌కాల చెల్లింపు ఖ‌ర్చులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. అంటే శ్రామికులు, ఎద్దుల బండి ఖ‌ర్చు,  దా మెషిన్ లేబ‌ర్‌, భూమి లీజుకు చెల్లించిన మొత్తం, విత్త‌నాలు, ఎరువులు, నీటి చార్జీలు, ఉప‌క‌ర‌ణాల‌పై త‌రుగుద‌ల , పంట భ‌వ‌నాలు, వ‌ర్కింగ్ కేపిట‌ల్‌పై వ‌డ్డీ, పంపుసెట్ల నిర్వ‌హ‌ణ‌కు డీజిల్‌, విద్యుత్ వినియోగం త‌దిత‌ర ఇత‌ర ఖ‌ర్చులు, కుటుంబ స‌భ్యుల శ్ర‌మ త‌దిత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది.
 
2022-23 ర‌బీ మార్కెట్ సీజ‌న్‌కు ర‌బీ పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పెంపు ను 2018-19 కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన విధంగా ఉత్ప‌త్తి వ్య‌యానికి ఆలిండియా వెయిటెడ్ యావ‌రేజ్ ఖ‌ర్చుకు క‌నీసం 1.5 రెట్లు ఉండేలా నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. దీనివ‌ల్ల రైతుల‌కు  మంచి స‌హేతుక స్థాయిలో గిట్టుబాటు ధ‌ర ల‌భిస్తుంది. రైతుల‌కు తాము పెట్టిన ఖ‌ర్చుపై గోధుమ‌లు, రాప్ సీడ్‌, ఆవాల‌కు (ఒక్కొక్క‌దానికి 100 శాతం వంతున‌) ల‌భించ‌నుంది. ఆ త‌ర్వాత లెంటిల్ 79 శాతం, కందిప‌ప్పు 74 శాతం, బార్లీ 60 శాతం, పొద్దుతిరుగుడు 50 శాతం పొంద‌నున్నాయి.
చ‌మురుగింజ‌లు, ప‌ప్పుధాన్యాలు,తృణ‌ధాన్యాల‌కు అనుకూలంగా ఎం.ఎస్‌.పి ధ‌ర‌ల‌ను గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రించేందుకు గ‌ట్టి కృషి జ‌రుగుతోంది. రైతులు ఈ పంట‌ల‌వైపు ఆక‌ర్షితులు అయ్యేలా ప్రోత్స‌హించేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి మెరుగైన వ్య‌వ‌సాయ విధానాల ద్వారా ఉత్ప‌త్తిని పెంచి స‌ర‌ఫ‌రా డిమాండ్ కు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని స‌రిదిద్ద‌డానికి ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
దీనికితోడు,  ఇటీవ‌ల‌ కేంద్ర ప్ర‌భుత్వం స్పాన్స‌ర్ చేని ప్ర‌క‌టించిన ప‌థ‌కం
 వంట‌నూనెల‌ నేష‌న‌ల్ మిష‌న్‌, ఆయిల్ పామ్‌(ఎన్‌.ఎం.ఇ.ఒ-ఒపి), వ‌ల్ల దేశంలొ వంట నూనెల ఉత్ప‌త్తి పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌దు. దీనివ‌ల్ల పెద్ద ఎత్తున దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డే  ప‌రిస్థితి త‌ప్పుతుంది. 11 వేలా 040 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ఈ ప‌థ‌కం ఈ రంగంలోని ఉత్పాద‌క విస్తీర్ణాన్ని పెంచ‌డ‌మే కాక‌, రైతులు త‌మ రాబ‌డి పెంచుకోవ‌డానికి , అద‌న‌పు ఉపాధిని క‌ల్పించ‌డానికి వీలు క‌ల్పిస్తుంది.
 
మ‌రో ప‌థ‌క‌మైన ప్ర‌ధాన‌మంత్రి అన్న‌దాతా ఆయ్ సంర‌క్ష‌ణ్ అభియాన్ (పిఎం-ఎఎఎస్‌హెచ్ఎ)ను కేంద్ర ప్ర‌భుత్వం 2018లో ప్ర‌క‌టించింది. ఇది రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు  స‌హాయ‌ప‌డే ప‌థ‌కం. ఈ ప‌థ‌కంలో మూడు ఉప ప‌థ‌కాలు ఉన్నాయి. అవి, ధ‌ర మ‌ద్ద‌తు ప‌థ‌కం (పిఎస్ఎస్‌), ధ‌ర త‌రుగు చెల్లింపు ప‌థ‌కం, ప్రైవేట్ ప్రొక్యూర్‌మెంట్‌, స్టాకిస్టు ప‌థ‌కం (పిపిఎస్ఎస్‌) పైల‌ట్ ప‌థ‌కం. 
 
 
***

(Release ID: 1753205) Visitor Counter : 468