సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కోవిడ్ కారణంగా ఆప్తులను కోల్పోయిన గోవాలో తొమ్మిది మంది మహిళలకు స్వయం ఉపాధితో పునరావాసం కల్పించిన కేవీఐసీ
Posted On:
07 SEP 2021 3:45PM by PIB Hyderabad
కోవిడ్ కారణంగా తమ ప్రియమైనవారిని కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురైన గోవాలో తొమ్మిది మంది మహిళలకు ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) సుదీర్ఘ ప్రయోజనాలను కలిగించేలా ప్రత్యేక చొరవను చేపట్టింది. వీరికి స్థిరమైన స్వయం ఉపాధి చర్యలను కల్పించడం ద్వారా వారికి భరోసాను కల్పించేలా కేవీఐసీ ప్రత్యేక చొరవ తీసుకుంది. తమ తమ కుటుంబాల జీవనాధారంగా ఉన్న ఆప్తులను కోల్సోయి దుఃఖం, నిరాశ, జీవనోపాధి సంక్షోభంలో ఉన్న మంది మహిళలకు ప్రధాన మంత్రి ఉపాధి ఉత్పత్తి కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద.. వారికి సొంతగా తయారీ యూనిట్లను స్థాపించుకొనేందుకు గాను ఆర్థిక సహాయాన్ని అందించింది. మహమ్మారి బారిన పడిన బలహీన ప్రజల కోసం ప్రభుత్వ సంస్థ జీవనోపాధి సహాయాన్ని సృష్టించడం దేశంలో ఇదే మొదటిసారి. కోవిడ్ కారణంగా తమ ఆప్తును కోల్పోయిన వారికి కేవీఐసీ ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. వస్త్రాలు కుట్టడం, ఆటోమోటివ్ రిపేర్, బేకరీ మరియు కేక్ షాపులు, బ్యూటీ పార్లర్, మూలికా-ఆయుర్వేదిక్ మందులు మరియు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు వంటి సొంత తయారీ యూనిట్లను ప్రారంభించేందుకు వీలుగా ఈ తొమ్మిది మంది మహిళలకు శ్రీ వినయ్ కుమార్ సక్సేనా రూ .1.48 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారులకు పీఎంఈజీపీ పథకం కింద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ. 25 లక్షల వరకు రుణాలు అందించబడ్డాయి. దీనికి తోడు ప్రతి కొత్త యూనిట్లలో కనీసం 8 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ స్వయం ఉపాధి కార్యక్రమాలు ఆయా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పిస్తుందని కేవీఐసీ ఛైర్మన్ అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలను నిలబెట్టడానికి కేవీఐసీ స్థానిక తయారీ మరియు స్వయం ఉపాధికి పెద్దపీట వేసిందని వివరించారు. సమాజంలోని బలహీన వర్గాల నుండి పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు మరియు బాధిత ప్రజలు పీఎంఈజీపీ కింద స్వయం ఉపాధి కార్యకలాపాలను చేపట్టేలా ప్రేరేపించబడ్డారు. ఫలితంగా.. ఈ కొత్త పారిశ్రామికవేత్తలు తమను తాము ఆర్థికంగా నిలబెట్టుకోవడమే కాకుండా అనేక ఇతర కుటుంబాలను వారి కొత్త తయారీ యూనిట్లలో నియమించుకోవడం ద్వారా వారికి మద్దతుగా నిలిచారు.
***
(Release ID: 1752964)
Visitor Counter : 217