రక్షణ మంత్రిత్వ శాఖ
మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (కర్ణాటక) బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ రెజ్లింగ్ లో ప్రతిభ కనబరిచే బాలుర ఎంపిక కోసం 2021 సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు సెలక్షన్ ర్యాలీ (మైసూర్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్)
Posted On:
06 SEP 2021 12:05PM by PIB Hyderabad
1. మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (కర్ణాటక) బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ సెంటర్‌లో స్పోర్ట్స్ క్యాడెట్‌లుగా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయడానికి జిల్లా స్థాయి లో పోటీలను నిర్వహిస్తుంది. దీనికోసం ఈ రెజిమెంటల్ సెంటర్‌లో 2021 సెప్టెంబర్ 27 నుండి 30 సెప్టెంబర్ వరకు ప్రవేశ ర్యాలీలను నిర్వహిస్తారు. బాలుర క్రీడా విభాగంలో కుస్తీ విభాగంలో బాలురు ఎంపిక జరుగుతుంది.
2. అర్హత ప్రమాణాలు.
(a) 2021 01 సెప్టెంబర్ నాటికి 08-14 సంవత్సరాల మధ్య వయస్సు
(01 సెప్టెంబర్ 2007 నుంచి 30 ఆగస్టు 2013 మధ్య జన్మించిన వారు ).
(బి) విద్య . కనీస తరగతి 4 వ తరగతి ఇంగ్లీష్ మరియు హిందీలో తగినంత పరిజ్ఞానంతో ఉత్తీర్ణులు అయి ఉండాలి.
(సి) మెడికల్ ఫిట్‌నెస్ . మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మరియు ఆర్మీ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ స్పెషలిస్ట్ చేత నిర్ధారించబడుతుంది.
(డి) దరఖాస్తుదారు రెజ్లింగ్ విభాగంలో మొదటి / రెండవ / మూడవ స్థానాన్ని పొంది సాధించిన పతకం యొక్క సర్టిఫికెట్‌ను జిల్లా స్థాయిలో మరియు పైన డిపాజిట్ చేయవలసి ఉంటుంది.
(ఇ) శరీరంలో ఏ భాగంలోనైనా శాశ్వత టాటూ కలిగిన వారిని ఎంపిక చేయడం జరగదు.
(ఎఫ్) దిగువ పేర్కొన్న ఎత్తు మరియు బరువు ప్రమాణాలు నమోదుకు వర్తిస్తాయి: -
సంఖ్య
|
విభాగం
|
ప్రవేశ స్థాయిలో వయస్సు
|
వయస్సు (సంవత్సరాలు)
|
ఎత్తు (సెం.మీ)
|
బరువు
|
(a)
|
కుస్తీ
|
08-14 సంవత్సరాలు
|
08
|
134
|
29
|
09
|
139
|
31
|
10
|
143
|
34
|
11
|
150
|
37
|
12
|
153
|
40
|
13
|
155
|
42
|
14
|
160
|
47
|
గమనిక . ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు సడలింపబడవు. అయితే,జాతీయ మరియు అంతర్జాతీయ సర్టిఫికేట్ లేదా పతకం సాధించి అసాధారణ ప్రతిభావంతులైన బాలురకు వయోపరిమితి గరిష్టంగా 16 సంవత్సరాల వరకు సడలించడం జరుగుతుంది. ఈ వయస్సుకు వర్తించే ఎత్తు మరియు బరువు ప్రమాణాలు సరళంగా ఉంటాయి.
3.. బి ఎస్ సి సమయంలో సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాలు . ఎంపిక సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా కింది పత్రాలను కలిగి ఉండాలి:-
(ఎ) మున్సిపల్ కార్పొరేషన్/ జననాలు మరియు మరణాల రిజిస్టర్ ద్వారా మాత్రమే జారీ చేయబడిన ఒరిజినల్ జనన ధృవీకరణ పత్రం .
(బి) కుల ధృవీకరణ ఒరిజినల్ పత్రం
(సి) ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ / పాఠశాల జారీ చేసిన మార్కుల ఒరిజినల్ పత్రం
(డి) గ్రామ ప్రధాన్/ పాఠశాల ఇచ్చిన క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒరిజినల్ .
(ఇ) నివాస పత్రం ఒరిజినల్ కాపీ (తహసీల్దార్ / ఎస్డీయం జారీ చేసింది).
(ఎఫ్) పది తాజా కలర్ ఫోటోలు.
(జి) జిల్లా లేదా ఆ పై స్థాయి క్రీడల పోటీల్లో పాల్గొన్న సమయంలో పొందిన సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ.
(హెచ్ ) ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ.
గమనిక . ఒరిజినల్ చూపించి దరఖాస్తు ఫారంతో ఒక సీటీసీ ని జత చేయవలసి ఉంటుంది.
4. ర్యాలీ సమయంలో బోర్డింగ్ మరియు లాడ్జింగ్ . అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో ఎంపిక ర్యాలీకి హాజరు కావలసి ఉంటుంది. స్క్రీనింగ్ సమయంలో అభ్యర్థులు మరియు వారితో పాటు వచ్చే వ్యక్తులు బెల్గాం (కర్ణాటక) లో ఉండడానికి, రవాణాకు సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. బోర్డింగ్ లాడ్జింగ్ కోసం ఈ కంపెనీ బాధ్యత వహించదు. ర్యాలీ జరిగే సమయంలో అభ్యర్థులతో పాటు మహిళలను అనుమతించరు.
5. నమోదు కోసం రిపోర్టింగ్ సమయం .
(a) వేదిక - మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్, బెల్గాం (కర్ణాటక).
(బి) తేదీ - 27 సెప్టెంబర్ 2021.
(సి) సమయం - 0700 గంటల నుంచి 1000 గంటల వరకు.
6. ఎంపిక . స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ , బాయ్స్ కంపెనీ కి చెందిన సిబ్బంది మొత్తం పారదర్శక వాతావరణంలో ఎంపిక కార్యక్రమాలను నిర్వహిస్తారు నిర్వహిస్తారు. ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని తల్లిదండ్రులు / సంరక్షకులను కోరడం జరిగింది. ఎంపిక బృందం అన్ని సందేహాలను పరిష్కరిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ప్రిసైడింగ్ ఆఫీసర్, సెలెక్షన్ ట్రయల్స్, బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (కర్ణాటక) లో 27 సెప్టెంబర్ 2021 న 0700 గంటలకు హాజరు కావలసి ఉంటుంది. 1000 గంటల తర్వాత ప్రవేశాలను నిలిపివేస్తారు.
7. ఎంట్రీల ఎంపికలో జిల్లా / రాష్ట్ర / జాతీయ స్థాయిలో పతక విజేతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
8. ఎంపికైన అభ్యర్థులకు ఇంగ్లీష్/ హిందీ మాధ్యమంలో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (కర్ణాటక) లో విద్య ఉచితంగా అందించబడుతుంది. దీనితో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌లు/ ఆర్మీ కోచ్‌లు రెజ్లింగ్ విభాగంలో ఇంటెన్సివ్ కోచింగ్ కూడా అందిస్తారు. పదవతరగతి పూర్తి చేసుకున్న వారికి సైన్యంలో ప్రవేశించడానికి ప్రామాణిక పరీక్షా, ఎంపిక ప్రక్రియ కు హాజరు కావలసి ఉంటుంది. పదవ తరగతి పూర్తి చేసుకుని 17 సంవత్సరాల 06 నెలలు నిండిన తర్వాత స్పోర్ట్స్ క్యాడెట్‌లు సైన్యంలో చేరడానికి ఎంపిక ప్రక్రియలో పాల్గొనడం మరియు నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఏ కారణం చేతనైనా సైన్యంలో చేరడానికి ఇష్టపడని పక్షంలో, సంబంధిత బాలుర తల్లిదండ్రులు అలాంటి అబ్బాయిల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
9. ఎంపికైన బాలురు డీజీఎంటీ, సాయ్ ల ఆమోదం తరువాత ఎంపిక ట్రయల్స్ పూర్తి అయిన తేదీ నుంచి 03 నుంచి 06 నెలలలోపు బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (కర్ణాటక) లో చేరవలసి ఉంటుంది. ఖచ్చితమైన తేదీ మరియు జాయినింగ్ సూచనలు తరువాత తెలియజేయబడతాయి.
10. కోవిడ్ -19 జాగ్రత్త చర్యలు . అభ్యర్థులందరూ మాస్కులు మరియు చేతి తొడుగులను ధరించవలసి ఉంటుంది. ర్యాలీకి హాజరుకాడానికి ముందు జారీ అయిన RT-PCR నెగెటివ్ సర్టిఫికెట్ (72 గంటలలోపు పరీక్ష) , నో రిస్క్ సర్టిఫికెట్‌ను తమతో పాటు తీసుకుని రావలసి ఉంటుంది.
***
(Release ID: 1752592)