ఆయుష్
ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి పని ప్రదేశంలో 'వై-బ్రేక్' తీసుకోవాలని డాక్టర్ ముంజ్‌పారా భారతదేశ ప్రజలను కోరారు
Posted On:
05 SEP 2021 6:46PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన 'ఆజాది కా అమృత్ మహోత్సవం' వారోత్సవ కార్యక్రమంలో యోగా బ్రేక్ యాప్ వినియోగంపై అవగాహన వెబ్‌నార్‌తో అత్యున్నత స్థాయికి చేరుకుంది. దీనిలో దేశవ్యాప్తంగా నిపుణులు మరియు ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఆయుష్ మరియు స్త్రీ & శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ వెబ్‌నార్‌ను ప్రారంభిస్తూ " వై-బ్రేక్ ప్రోటోకాల్‌లోని యోగాసనాలు ఛాతీ కుహరాన్ని తెరిచి హృదయనాళ వ్యవస్థకు సహాయపడతాయి. భారతదేశం అంతటా పని ప్రదేశాలలో ప్రజలు ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఈ సరళమైన మరియు ప్రభావవంతమైన ప్రోటోకాల్‌ను స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. " అని తెలిపారు.
వై-బ్రేక్ యాప్ వినియోగంపై నిర్వహించిన వెబ్‌నార్‌లో యోగా అభ్యాసకుల భారీ భాగస్వామ్యం కనిపించింది. యోగా ప్రోటోకాల్‌లోని ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానాలు కేవలం ఐదు నిమిషాల్లో ప్రజలు తమ పని ప్రదేశాలలో పనిని రిఫ్రెష్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు తిరిగి పనిపై దృష్టి పెట్టడానికి ఎలా సహాయపడతాయనే దానిపై సాంకేతిక సెషన్‌లు నిర్వహించాయి.
స్వాతంత్య్రం సాధించి ఆగస్ట్ 2022 నాటికి 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆజాది కా మహోత్సవం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒక వారం కేటాయించబడింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 న విజ్ఞాన్ భవన్‌లో జరిగిన వేడుకలో కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరో నలుగురు కేంద్ర మంత్రులతో కలిసి వై-బ్రేక్ మొబైల్ యాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటెచా మాట్లాడుతూ " భారత ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులందరికీ కార్యాలయాల్లో ఐదు నిమిషాల యోగా చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. "ఉద్యోగులు ఒత్తిడి ఉన్న వాతావరణంలో పని చేస్తారు. అందుకే వారి జీవితంలో యోగా అవసరం. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఉత్తమమైన మార్గం అని అనేక విశ్లేషణలు కనుగొన్నాయి. రోజంతా శారీరకంగా చురుకుగా ఉండే వ్యక్తులు వ్యాయామంతో సమానమైన ప్రయోజనాలను పొందుతారు" అని ఆయన చెప్పారు. ఒత్తిడిని తగ్గించడంలో వై-బ్రేక్ ఒక పెద్ద మెట్టు అని నిరూపించబడుతుంది మరియు సాధ్యమైనంత తక్కువ సమయంలో గరిష్ట ప్రయోజనాన్ని అందించే మాధ్యమం ఇది అని తెలిపారు.
తన స్వాగతోపన్యాసంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి. బసవరెడ్డి మాట్లాడుతూ "వివిధ రంగాలకు మరియు వాటిలో పనిచేసే వ్యక్తుల కోసం యాప్ యొక్క ప్రయోజనాన్ని చూడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. "వై-బ్రేక్ యాప్ మరియు కామన్ యోగా ప్రోటోకాల్‌తో మేము యోగాను ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్తాము." అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండిఎన్‌ఐవై), మరియు ప్రసిద్ధ యోగా సంస్థలు, కృష్ణమాచార్య యోగా మందిరం, చెన్నై, రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బేలూర్‌మఠ్, కోల్‌కతా, నిమ్హాన్స్, బెంగళూరు, కైవల్యధామ హెల్త్ అండ్ యోగా రీసెర్చ్ సెంటర్, లోనావ్లా మరియు హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్‌లు ఈ యాప్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాయి.
ప్రసంగాలను అనుసరించిన సాంకేతిక సెషన్‌లో వివిధ వయసుల మరియు వృత్తుల వ్యక్తులపై ఉమ్మడి యోగా ప్రోటోకాల్ ప్రభావాన్ని నిపుణులు నొక్కిచెప్పారు.
కోల్‌కతాలోని బేలూరు మఠం రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీ ఛాన్సలర్ స్వామి ఆత్మప్రియానంద మాట్లాడుతూ "వై-బ్రేక్ యాప్ చూసినప్పుడు తనకు ఉపనిషత్తులు గుర్తుకు వచ్చాయని చెప్పారు. "స్వామి వివేకానంద యోగాను పశ్చిమదేశాలకు తీసుకువెళ్లారు. యోగా చాలా శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనది కానీ అది సామాన్యుడికి అంత సులభంగా అందుబాటులో ఉండదు. భారతదేశ విశిష్టత ఏమిటంటే మన జీవితంలోని ప్రతి అంశం నిరంతరం యోగాలో మునిగిపోతుంది." అని చెప్పారు.
బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమ మూర్తి మాట్లాడుతూ అమృత్ మహోత్సవ వేడుక విజయవంతమైందని, ఇది యోగా యొక్క ప్రాచీన సంప్రదాయాన్ని సాంకేతికతతో సినర్జీగా తీసుకువచ్చిందని చెప్పారు.
"ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మానసిక మరియు అభిజ్ఞా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఆందోళనను తగ్గిస్తుంది. డిప్రెషన్, ఆందోళన మరియు స్కిజోఫ్రెనియాపై యోగా ప్రభావాన్ని చూపినట్ట అనేక పరిశోధనలు తెలిపాయి. ఇది కేవలం భౌతిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా సానుకూల రీతిలో జ్ఞానాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది అని ఆమె తెలిపారు.
సుబోధ్ తివారీ, సిఈవో, కైవల్యధామ యోగా ఇనిస్టిట్యూట్, లోనావాలా, ముంబై వై-బ్రేక్ ట్రయల్స్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. యోగా ఒక లోతైన శాస్త్రం మరియు ప్రయోజనకరమైనదని, అయితే అభ్యాసం ప్రారంభించని ప్రదేశాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు.
"మేము ముంబైలోని ఆరు కార్యాలయాలలో 15 రోజుల పాటు వై-బ్రేక్ ప్రోటోకాల్ ట్రయల్ ప్రారంభించాము మరియు 15 రోజుల తర్వాత చాలా మంది కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలలో యోగా విరామాలు తీసుకుంటూ ముందుకు సాగాయి. కార్పొరేట్ మరియు ఆఫీస్ స్పేస్‌లలో ఈ వై- బ్రేక్ యాప్ ప్రభావం గురించి మాకు చాలా ముఖ్యమైన అంతర్దృష్టిని అందించింది" అని ఆయన చెప్పారు.
భారతదేశంతో పాటు విదేశాలలో ఉన్న యోగా అనుభవజ్ఞులు, యోగా ఔత్సాహికులు, వివిధ ఆయుష్ కళాశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల విద్యార్థులు, ఆధునిక వైద్యం, అనుబంధ శాస్త్రాలు, మీడియా వ్యక్తులు మరియు IT నిపుణులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.
మంత్రిత్వ శాఖ నిర్వహించిన వారం రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం, గృహాలకు ఔషధ మొక్కల పంపిణీ, మరియు ఆయుష్ వ్యవస్థను ప్రచారం చేయడానికి వెబ్‌నార్లు మరియు కోవిడ్ -19 ను ఎదుర్కోవడంలో దాని పాత్ర వంటి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యకలాపాలు ఆగస్టు 2022 వరకు కొనసాగుతాయి.
***
(Release ID: 1752423)
Visitor Counter : 227