ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
11 ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కోవిడ్ -19 వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం
18 సంవత్సరాలకు పైబడిన వయసు వారికి తొలి డోస్‌ను వీలైనంత త్వరగా వేయాల్సిందిగా రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, 60 సంవత్సరాలకు పైబడిన వారు, అర్హులైన వారికి రెండొ డోస్‌పై దృష్టిపెట్టాల్సిందిగా సూచన.
Posted On:
04 SEP 2021 5:29PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ఈరోజు 11 ఈశాన్య , కొండప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్ము కాశ్మీర్, లద్దాక్, మణిపూర్, మేఘాలయ, మిజోరమ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఎ) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 18 సంవత్సరాలు పైబడిన వారికి తొలి డోస్ వాక్సిన్ వేయడం త్వరగా పూర్తి చేయాలి.
బి) రాష్ట్రాలు 60 సంవత్సరాల వయసు పైబడిన కేటగిరిలోని వారికి మొదటి , రెండో డోస్ వేయడంపై దృష్టిపెట్టాలి. అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయలలో ఈ కేటగిరిలో అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయలలో సంతృప్తికరంగా లేదని గుర్తించారు. ఈ వయసు వారు కోవిడ్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నందువల్ల వీరికి మరింత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది.
సి) రెండో డోస్ తో పోల్చినపుడు మొదటి డోస్ వేయడంలో వేగం పెరిగిన విషయాన్ని రాష్ట్రాల దృష్టికి తేవడం జరిగింది. రాష్ట్రాలు డోస్‌లను, రోజులను, లబ్ధిదారులకు వేయాల్సిన వాక్సిన్‌కు సంబంధించిన లక్ష్యాలను నిర్ణయించుకోవాలని సూచించడం జరిగింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా 0.5 ఎం.ఎల్ సిరంజ్‌ల మిగులు స్టాక్, ట్రాన్స్‌జండర్ వ్యక్తులు, దివ్యాంగులు, పిడబ్ల్యు:, ఖైదీలు వంటి ప్రత్యేక గ్రూపులవారికి , ప్రత్యేకించి గర్భిణులైన మహిళలు, పాలిచ్చే తల్లులకు వాక్సినేషన్‌కు సంబంధించి కూడా సమావేశంలో చర్చించడం జరిగింది.
రాష్ట్ర వాక్సిన్ స్టోర్స్‌నుంచి కోల్డ్ చెయిన్ పాయింట్ వరకు స్టాక్ విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. అలాగే సహేతుకమైన రీతిలో వీటి పంపిణ ఉండేలా చూడాలని, వాక్సిన్ వృధాను 2 శాతం లోపు ఉండేట్టు చూడాలని , ఈవిన్‌లో ( ఎలక్ట్రానిక్ వాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్) లో రోజువారిగా వివరాలు అప్‌డేట్ చేయాలని సూచించారు. అలాగే కోవిడ్ వాక్సినేషన్‌కు 0.5 ఎం.ఎల్, 1 ఎం.ఎల్, 2 ఎం.ఎల్ ,3 ఎం.ఎల్, ఆటోడిజేబుల్, రీ యూజ్ ప్రివెంన్షన్ సిరెంజ్‌లు, దిస్పోజబుల్ సిరంజీల సరఫరాను పరిశీలించాలని సూచిండం జరిగింది.
****
(Release ID: 1752249)
Visitor Counter : 161