ఆర్థిక మంత్రిత్వ శాఖ
24వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
03 SEP 2021 6:45PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్ డిసి) 24వ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్ రావు కరద్, శ్రీ పంకజ్ చౌధరి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీ శక్తికాంతదాస్; ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ శేఠ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవిన్యూ శాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి శ్రీ దేబశీష్ పాండా, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ వర్మ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కృష్ణమూర్తి.వి.సుబ్రమణియన్, సెబి చైర్ పర్సన్ శ్రీ అజయ్ త్యాగి, పిఎఫ్ఆర్ డిఎ చైర్ పర్సన్ శ్రీ సుప్రతిమ్ బందోపాధ్యాయ, ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ డాక్టర్ ఎం.ఎస్.సాహూ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అధారిటీ చైర్ పర్సన్ శ్రీ ఇంజేటి శ్రీనివాస్, ఐఆర్ డిఏఐ సభ్యురాలు (నాన్-లైఫ్) శ్రీమతి టి.ఎల్.అలమేలు, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖకు అనుబంధంగా గల ఎఫ్ఎస్ డిసి కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎఫ్ఎస్ డిసికి సంబంధించిన వివిధ అంశాలు - ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక కార్యకలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడం, స్థూల ఆర్థిక పర్యవేక్షణ, భారీ ఆర్థిక సంస్థల పనితీరు వంటి పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.
ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు నిరంతర నిఘా ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఒత్తిడిలో ఉన్న ఆస్తులు, ఆర్థిక స్థిరత్వ విశ్లేషణకు సంబంధించి వ్యవస్థాత్మక యంత్రాంగం పటిష్ఠత, ఆర్థిక కార్యకలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడం, ఆర్థిక సంస్థల మధ్య వివాదాల పరిష్కార యంత్రాంగం, ఐబిసి సంబంధిత అంశాలు; ప్రభుత్వం, విభిన్న రంగాలకు బ్యాంకుల రుణ వితరణ, ప్రభుత్వ అధికారుల మధ్య డేటా మార్పిడి, రూపాయికి అంతర్జాతీయ హోదా కల్పించడం, పెన్షన్ సంబంధిత అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఆర్ బిఐ గవర్నర్ అధ్యక్షతలోని ఎఫ్ఎస్ డిసి సబ్ కమిటీ కార్యకలాపాలు, ఎఫ్ఎస్ డిసి గతంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
***
(Release ID: 1751902)
Visitor Counter : 244