ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బ్రిక్స్ డిజిటల్ హెల్త్ సమ్మిట్‌ లో పాల్గొన్న - భారతదేశం

బ్రిక్స్ సభ్య దేశాల మంత్రుల స్థాయి సదస్సు లో డిజిటల్ హెల్త్ అమలు సమయంలో సవాళ్లు, అవకాశాల గురించి చర్చించిన - డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

"డిజిటల్ ఆరోగ్యాన్ని ఎన్.డి.హెచ్.ఎం. క్రమబద్ధీకరించడంతో పాటు, ప్రత్యేక ఆరోగ్య ఐ.డి. జారీ ద్వారా సదుపాయాలు, అభ్యాసకుల కోసం సత్యానికి సంబంధించిన ఏకైక మూలాన్ని సృష్టిస్తుంది."

"బ్రిక్స్ డిజిటల్ హెల్త్ విధానం నేటి పరిస్థితులకు చాలా అవసరం. ఇది సాక్ష్యం ఆధారిత విధాన రూపకల్పనకు ఒక భాండాగారాన్ని సమకూరుస్తుంది."

ఆమోదం పొందిన - బ్రిక్స్ డిజిటల్ హెల్త్ డిక్లరేషన్

Posted On: 03 SEP 2021 7:56PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సభ్య దేశాల మంత్రుల స్థాయి ప్రతినిధుల సమావేశంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు.  డిజిటల్ హెల్త్ అమలు సమయంలో సవాళ్లు, అవకాశాలు గురించి మంత్రుల బృందం సభ్యులు చర్చించారు.

అన్ని స్థాయిలలో డిజిటల్ ఆరోగ్య సాంకేతికతలను పూర్తిగా స్వీకరించడంతో పాటు, బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రామాణిక పాఠ్యాంశాలను ఉపయోగించి సమర్థవంతమైన హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ నిపుణుల క్యాడర్‌ ను నిర్మించడంలో బ్రిక్స్ వ్యూహంపై ఆమె భారతదేశ స్ఫూర్తి గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఆరోగ్య విధానాల కోసం (బ్రిక్స్ కింద) ఆధారాల ఆధారిత డిజిటల్ సాంకేతికతలు, మరియు ఆవిష్కరణల భాండాగారం అభివృద్ధిపై భారతదేశం అంచనాలతో పాటు,  కోవిడ్-19 సమయంలో డిజిటల్ ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య వ్యవస్థల స్థితిస్థాపకతను పెంపొందించే దిశగా భారతదేశం అనుసరించిన వ్యూహాత్మక విధానం గురించి కూడా ఈ సదస్సులో చర్చించడం జరిగింది.

ప్రారంభంలో, డాక్టర్ పవార్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ఆరోగ్యానికి ప్రాధాన్యత నిచ్చినట్లు పేర్కొన్నారు.  "కోవిడ్ రెండు దశలు మనకు ప్రత్యేకమైన సవాళ్లను అందించాయి, దీని కోసం ప్రాంతీయ అవసరాలకు సున్నితమైన ప్రభావవంతమైన, మానవీయ విలువలతో కూడిన కేంద్రీకృత ప్రతిస్పందన అవసరం. మహమ్మారిని నియంత్రించడంలో డిజిటల్ హెల్త్ సముచితంగా ఉపయోగించబడింది, మన ప్రతిస్పందనను బలోపేతం చేయడానికి మరింత శాస్త్రీయ, సమాచార ఆధారిత విధానం కోసం మనకు వీలు కల్పించింది.” అని ఆమె వివరించారు. 

భారతదేశంలో డిజిటల్ కార్యక్రమాల కోసం విస్తృతమైన నిర్మాణ కేంద్రంగా భారతదేశ జాతీయ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ గురించి ఆమె వివరిస్తూ,  "జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ (ఎన్.డి.హెచ్.ఎం) ద్వారా డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి మేము సిఫార్సులను అమలు చేస్తున్నాము.  ప్రత్యేక ఆరోగ్య ఐ.డి. జారీ ద్వారా ఎన్.డి.హెచ్.ఎం. సౌకర్యాలు, అభ్యాసకుల కోసం సత్యానికి సంబంధించిన ఏకైక మూలాన్ని సృష్టించడంతో పాటు,  డిజిటల్ విధానం ద్వారా వివిధ ఆరోగ్య సేవలను విస్తరించడానికి దారితీస్తుంది." అని పేర్కొన్నారు. 

డిజిటల్  ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ ను రూపొందించడానికి టెలి-మెడిసిన్ ద్వారా ప్రతి పౌరుడికి రియల్ టైమ్ క్లినికల్ మేనేజ్‌మెంట్, సరసమైన, అందుబాటులో ఉండే వైద్య సంప్రదింపుల కోసం అన్ని జిల్లా ఆసుపత్రులలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సమాచార విధానాన్ని (హెచ్.ఎం.ఐ.ఎస్) అమలు చేయడంతో పాటు, సంబంధిత భాగస్వాములందరినీ కలుపుకొని ఆరోగ్య విపత్తు నిర్వహణ కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయడం వంటి భారతదేశ తక్షణ క్షేత్ర స్థాయి ప్రాధాన్యతలను గుర్తించడం జరిగిందని, డాక్టర్ పవార్, ఈ సందర్భంగా తెలియజేశారు.  

మహమ్మారిని డిజిటల్‌ గా నిర్వహించడానికి మానవ వనరుల సముదాయాన్ని సృష్టించినప్పుడు, డాక్టర్లు, అనుబంధ వైద్య సిబ్బంది, నర్సులు, సమాజంలోని ఇతర వ్యక్తులతో సహా, కోవిడ్‌ ని నిర్వహించడానికి ముందు వరుసలో ఉన్న 16 మిలియన్లకు పైగా కోవిడ్ యోధులకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశం ఐ-జి.ఓ.టి. (ఆన్‌-లైన్ శిక్షణా వేదిక) ను ఉపయోగించుకుంటున్న విధానాన్ని కేంద్ర మంత్రి, ఈ సందర్భంగా వివరించారు. 

బ్రిక్స్ డిజిటల్ ఆరోగ్య వేదిక అనేది బ్రిక్స్ సభ్య దేశాలలో ఆరోగ్య సమాచార లభ్యతను నిర్ధారించడానికి తక్షణ అవసరమని డాక్టర్ పవార్ ప్రముఖంగా తెలియజేస్తూ,  "ప్రపంచ శ్రేయస్సు కోసం సాక్ష్యం ఆధారిత డిజిటల్ ఆరోగ్య ఉత్తమ పద్ధతులను సృష్టించడానికి మనం సన్నిహితంగా, సహకారంతో పనిచేయాలి. సమాచారం ఇచ్చిపుచ్చుకోడానికీ, సమాచార లభ్యతతో పాటు, ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి వంటి వ్యాధుల నుండి రక్షణ కోసం సమాచారాన్ని సమన్వయం చేయడానికి, సంగ్రహించడానికి, పంచుకోవడానికి ప్రపంచ సామర్థ్యాలను పెంచడంలో, ఈ విధమైన ఏర్పాటు సహాయపడుతుంది.” అని వివరించారు. 

అంతర్జాతీయ డిజిటల్ ఆరోగ్య భాగస్వామ్యం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జి-20 దేశాల కూటమి మొదలైన సంస్థలు, వారి అనుభవం బ్రిక్స్ దేశాలకు పరిమితం కాకుండా డిజిటల్ టెక్నాలజీలను ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క సామర్థ్యం ద్వారా తగిన విధంగా స్వీకరించాలనేది, భారతదేశం యొక్క ప్రధాన నిరీక్షణగా భావించబడింది.

కోవిడ్-19 నియంత్రణ సమయంలో అవలంబించిన సాంకేతికతలపై, ఆమె మాట్లాడుతూ,  "మేము జాతీయ కోవిడ్ పోర్టల్ ద్వారా ఒక బలమైన యంత్రాంగాన్ని ప్రారంభించాము, ఇది నిఘా, పరీక్ష, లాజిస్టిక్ మేనేజ్‌మెంట్, డేటా ఆధారిత విశ్లేషణలు మొదలైన వాటిని సమగ్రపరిచింది. మేము "ఆరోగ్య సేతు" యాప్ తో పాటు, పౌరుల నుండి డేటాను సేకరించడానికి, సమాజంలో రాబోయే హాట్‌-పాట్‌ లను అంచనా వేయడానికి డిజిటల్ నిఘా యాప్ - "ఇతిహాస్" యాప్ ను ప్రాచుర్యంలోకి తెచ్చాము.  201 మిలియన్లకు పైగా డౌన్‌-లోడ్‌ లతో అత్యధికంగా డౌన్‌-లోడ్ చేయబడిన అప్లికేషన్లలో "ఆరోగ్య సేతు" ఒకటిగా నిలిచింది.  అదేవిధంగా, ఆరోగ్య సేవలను పౌరుడి ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు, మేము భారతదేశంలోని జాతీయ టెలి-మెడిసిన్ వేదిక "ఈ-సంజీవని" యాప్ ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇందుకోసం, అన్ని జిల్లాల్లో అంకితభావంతో పనిచేసే వైద్యులతో "టెలి-మెడిసిన్-హబ్‌" లను ఏర్పాటు చేస్తున్నాము.  కోవిడ్ తో పాటు కోవిడ్ కాని వ్యాధుల ఆరోగ్య సంరక్షణ మద్దతు కోసం ఈ హబ్ లు తమ తమ  ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలను అందిస్తాయి." అని వివరించారు.

ప్రజారోగ్యంపై ఈ ప్లాట్‌-ఫారమ్‌ లలో కొన్నిఎలా శాశ్వత ప్రభావాన్ని చూపుతాయో కూడా ఆమె ప్రత్యేకంగా పేర్కొంటూ,  "సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక ద్వారా భారతదేశం వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమాన్ని అందిస్తోంది, ఇది కమ్యూనిటీ నిఘా కోసం 33 ఎపిడెమిక్ పీడిత వ్యాధుల సదుపాయాల నుండి నిజ సమయ డేటాను అందిస్తుంది.  భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం ప్రక్రియ డిజిటల్ సాధనం కో-విన్ (కోవిడ్‌ పై విజయం) ద్వారా నిర్వహించబడుతోంది.  కోవిన్‌ కు మాత్రమే పరిమితం కాకుండా సాంప్రదాయిక ఇమ్యునైజేషన్ కోసం కూడా టీకాలు వేసే కార్యక్రమ నిర్వహణ కోసం ఏ దేశమైనా వినియోగించడానికి వీలుగా భారత ప్రభుత్వం కో-విన్‌ ను ప్రపంచవ్యాప్త వస్తువుగా ప్రకటించింది." అని చెప్పారు. 

బ్రిక్స్ సభ్య దేశాల గౌరవ ఆరోగ్యశాఖ మంత్రుల సమక్షంలో, బ్రిక్స్ డిజిటల్ హెల్త్ డిక్లరేషన్ ఆమోదించబడింది.

భారత్ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ డిజిటల్ ఆరోగ్య సదస్సు కు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షత వహించారు.  స్పెక్ట్రమ్‌ లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో జనాభా పర్యవేక్షణ, క్రియాశీల కేసు కనుగొనడం, సంక్షోభంలో ఉన్న సాధారణ పౌరులతో కమ్యూనికేషన్ వంటి వాటితో సహా  డిజిటల్ ఆరోగ్యాన్ని విస్తృతంగా అమలుచేయడంపై ఆయన గట్టిగా దృష్టి సారించారు.  ప్రాథమిక సార్వత్రిక ఆరోగ్య కవరేజీని పూర్తి స్థాయిలో అమలుచేయడం కోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలు వినియోగించడం పై  ఈ సందర్భంగా ప్రముఖంగా చర్చించడం జరిగింది.  డిజిటల్ ఆరోగ్యానికి సంబంధించి తమ విలువైన విజయాలు, సూచనలను పంచుకున్నందుకు సమావేశంలో పాల్గొన్న అన్ని దేశాలకు శ్రీ భూషణ్ ధన్యవాదాలు తెలిపారు.

 

*****



(Release ID: 1751901) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi , Manipuri