మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న‌వంబ‌ర్ నెల‌లో దేశంలోని 23 ఐఐటిల‌కు సంబంధించి ప‌రిశోధ‌న అభివృద్ధి ఫెయిర్ నిర్వ‌హ‌ణః కేంద్ర విద్యాశాఖ మంత్రి


నూత‌న విద్యా విధానంలో పేర్కొన్న‌విధంగా అధునాత‌న ప‌రిశోధ‌న వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌రచేందుకు ఆర్ అండ్ డి ఫెయిర్ ఏర్పాటు ః ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

Posted On: 03 SEP 2021 5:26PM by PIB Hyderabad

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటి) రిసెర్చ్‌, డ‌వ‌ల‌ప్‌మెంట్ ఫెయిర్ ఏర్పాటుకు ఏర్పాటుచేసిన స్టీరింగ్ క‌మిటీ స‌భ్యుల‌తో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ,వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖ స‌హాయ‌మంత్రి శ్రీ సుభాస్ స‌ర్కార్ , విద్యాశాఖ స‌హాయ‌మంత్రి శ్రీ రంజ‌న్ కుమార్ సింగ్‌, ఉన్న‌త విద్యాశాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అమిత్ ఖ‌రే, విద్యా మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇత‌ర ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి, దేశంలోని మొత్తం 23 ఐఐటి లతో ప‌రిశోధ‌న అభివృద్ధి ఫెయిర్‌ను 2021 న‌వంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. దేశ 75వ స్వాతంత్ర్ర్య ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా ఈ ఫెయిర్‌ను నిర్వ‌హించనున్నారు. ఈ ఫెయిర్ ఐఐటిలలో సామర్థ్యాలు , అధిక సాంకేతికత సంసిద్ధత స్థాయిలపై భారతీయ పరిశ్రమ రంగంలో  అవగాహనను మరింత మెరుగుపరచడానికి ఉప‌క‌రిస్తుంద‌ని ఆయన అన్నారు.

ఈ ప‌రిశోధ‌న అభివృద్ధి ఫెయిర్‌, నూత‌న విద్యా విధానంలో పేర్కొన్న విధంగా వివిధ రంగాల‌లో అధునాత‌న ప‌రిశోధ‌న‌కు అనువైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 23 ఐఐటిలు సంయుక్తంగా భార‌తీయ ప‌రిశ్ర‌మ‌ల‌తో క‌ల‌సి భార‌తీయ , అంత‌ర్జాతీయ మార్కెట్ల కోసం నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌నున్నాయి. ఇది సుల‌భ‌త‌ర జీవ‌నానికి, ఐఐటిల పూర్వ విద్యార్ధులు, ప‌రిశ్ర‌మ‌లు వివిధ రంగాల‌లో పెట్టుబ‌డులు మ‌రింత పెట్ట‌డానికి , భ‌విష్య‌త్ సాంకేతిక‌త‌ల‌లో ప‌రిశోధ‌న‌లు ముమ్మ‌రం చేయ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది.

ఇంధ‌న‌వ్య‌వ‌స్థ‌లు, క‌మ్యూనికేష‌న్ ఉప‌క‌ర‌ణాలు, వేస్ట్ మేనేజ్‌మెంట్‌, ఆర్కిటెక్చ‌ర్‌, నిర్మాణ రంగంతో సంప్ర‌దాయ విజ్ఞానాన్ని మిళితం చేయ‌డం వంటి వాటిపై ప‌రిశోధ‌న‌ల‌కు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని ఇందుకు సంబంధించి థీమాటిక్ సెష‌న్‌లకు  ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని అన్నారు.

ప్రాధాన్య‌తా అంశాల‌లో ప‌దిథీమ్‌ల‌ను గుర్తించారు. అలాగే ఈ థీమ్‌ల‌పై 23 ఐఐటిలు రూపొందించిన 72 ప్రాజెక్టుల‌నుంచి ఈ క‌మిటీ కొన్నింటిని ఎంపిక చేస్తుంది. క‌మిటీ ప‌రిశీల‌న అనంత‌రం ఈ ప్రాజెక్టుల‌ను రెండు రోజుల మెగా ఈవెంట్‌లో ప్ర‌ద‌ర్శిస్తారు.ఈ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యేవారిలో భార‌తీయ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన వారు, అంత‌ర్జాతీయ సంస్థ‌లు, వివిధ సిఎఫ్‌టిఐల‌కు చెందిన ఫాక‌ల్టీలు, డిఆర్‌డిఒ, ఇస్రో, సిఎస్ఐఆర్‌, ఐసిఎఆర్‌, ల‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు, విద్యార్థులు, యువ‌త‌, ప‌రిశోధ‌కులు ఉంటారు.

బిఒజి ఐఐటి మ‌ద్రాస్‌కు చెందిన డాక్ట‌ర్ ప‌వ‌న్ గోయంకా, ఐఐటి హైద‌రాబాద్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ బివిఆర్ మోహ‌న్ రెడ్డి, స్టాండింగ్ క‌మిటీ ఫ‌ర్ ఐఐటి కౌన్సిల్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ కె. రాధాకృష్ణ‌న్‌, ఐఐటి కెజిపి డైర‌క్ట‌ర్ ప్రొఫెస‌ర్ వీరేంద్ర కుమార్‌,ఐఐటి మ‌ద్రాస్ డైర‌క్ట‌ర్ ప్రొఫెస‌ర్ భాస్క‌ర్ రామ‌మూర్తి, ఐఐటి కాన్పూర్ డైర‌క్ట‌ర్ ప్రొఫెస‌ర్ అభయ్ క‌రండిక‌ర్‌, ఐఐటి ఢిల్లీ ప్రొఫెస‌ర్ ప్రొఫెస‌ర్ రామ‌గోపాల్ రావు, ఐఔఐటి గౌహ‌తికి చెందిన ప్రొఫెస‌ర్ టి.సీతారామ్‌, ఐఐటి హైద‌రాబాద్ డైర‌క్ట‌ర్ ప్రొఫెస‌ర్ బి.ఎస్‌మూర్తి, ఐఐటి బొంబాయి డైర‌క్ట‌ర్‌

ప్రొఫెస‌ర్ సుభాసిస్ చౌద‌రి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1751873) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Punjabi