హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దావణగేరెలో అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రమంత్రి అమిత్ షా శ్రీకారం!

పలువురు స్వాతంత్ర్య సమరయోధులకు సత్కారం
స్వరాజ్య పోరాటంలో వారి సేవలకు కృతజ్ఞతలు

రెండేళ్లుగా మహమ్మారితో ప్రపంచదేశాలు, భారత్ పోరు..
నరేంద్ర మోదీ సారథ్యంలో కోవిడ్.పై భారత్ గట్టి పోరాటం
కరోనాపై పోరులో ఏ అవకాశాన్నీ వదలని ప్రభుత్వం..


కోవిడ్ పోరులో తమ ప్రాణాలే ఫణంగా పెట్టిన భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు...
కరోనాపై యుద్ధంలో సమాజానికి పోరాట స్ఫూర్తినిచ్చిన
కోవిడ్-19 యుద్ధవీరులకు అభివందనం...
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం
భారత్.లో సమర్థవంతంగా అమలు..




కోవిడ్.పై గట్టిగా పోరాడిన కర్ణాటక ప్రభుత్వం,
కర్ణాటకలో ఇప్పటిదాకా 5కోట్ల 20లక్షల మందికి కోవిడ్ టీకా..
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో ఈ నెలాఖరుకు
90శాతం జనాభాకు టీకాలు పూర్తయ్యే అవకాశం..


పేదలు, బీసీలు, గిరిజనుల గురించే ప్రధాని మోదీ ఆలోచన
ఫస్ట్, సెకండ్ వేవ్.ల సమయంలో ప్రతి ఒక్కరికీ 5కేజీల
ఆహార ధాన్యాలను పంచిన మోదీ ప్రభుత్వం
80కోట్లమంది జనాభాకు 5కిలోల చొప్పున ఆహారధాన్యాలు
10 నెలలపాటు ఉచితంగా సరఫరా..

నరేంద్ర మోదీజీ సారథ్యంలో దేశం త్వరలోనే
‘ఆత్మనిర్భర భారత్’గా రూపుదాల్చే అవకాశం

Posted On: 02 SEP 2021 7:18PM by PIB Hyderabad

  కర్ణాటక రాష్ట్రంలోని దావణగేరెలో రూ. 50కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 2వ తేదీన ప్రారంభించారు. దావణగేరెలో గాంధీభవన్, పోలీస్ పబ్లిక్ స్కూల్, జి.ఎం. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంట్రల్ లైబ్రరీలను అమిత్ షా ప్రారంభించారు. పలువురు స్వాతంత్ర్య సమర యోధులను కూడా ఆయన సత్కరించారు.  స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నోవిలువైన సేవలందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

https://ci6.googleusercontent.com/proxy/MxZU_QJ5k5tZUeWzYGfMPlCRGMVXycOYtqrEd0QgJkuCksrrh0PB6EwYn1TANyxqNz6UzvGr5nkgHfx_f701e_Jnc8AS7eoXmDKL4i3HvWOYvgL5XJOdtxT7BQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CR80.jpg

  ఈ సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లుగా భారతదేశంతోపాటుగా, ప్రపంచంలోని పలు దేశాలు వైరస్ మహమ్మారిని ఎదుర్కొంటూ ఉన్నాయని అన్నారు. మొత్తం మానవాళికే పెనుసవాలుగా కోవిడ్ మహమ్మారి మారిందని, కోవిడ్ వైరస్.పై భారత్ ఎంతో సమర్థవంతంగా పోరాటం సాగించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లనే మనం కోవిడ్ బారినుంచి దాదాపుగా బయటపడగలిగామని ఆయన అన్నారు.

  కోవిడ్-19తో పోరులో పలువురు కోవిడ్ యుద్ధవీరుల సేవలను కేంద్రమంత్రి అమిత్ షా స్మరించుకున్నారు. కోవిడ్.పై పోరాటంలో భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టారని, వైరస్ పై పోరాడే శక్తిని వారు సమాజానికి అందించారని, వారిలో చాలామంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని ఆయన అన్నారు. కోవిడ్ అనేది భారతదేశానికి, దేశంలోని 130 కోట్ల జనాభాకు ఎంతో పెద్దసవాలుగా యావత్ప్రపంచం, నిపుణులు పరిగణించారని, అయితే, ఈ సవాలును ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచానికే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో సమర్థవంతంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. భారతదేశమే ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సీన్లను అందించిందంటూ మనం ఈ రోజున గర్వంగా చెప్పుకోగలమని అమిత్ షా అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/u8IXH4McKJcq9li-LB6qow4F1ziMcqDF_hKOOjyB1wagAo5_47OmfYt_Kyofsphki_DHP0WhEejpVYB9vfZ7r36fw82bmo_GSXq5jJ99nhfB_T8zHheolU3Ncg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021KB0.jpg

  కోవిడ్.పై కర్ణాటక ప్రభుత్వం కూడా సమర్థవంతంగా పోరాడిందని, ఈ రోజు వరకూ దాదాపు 5 కోట్ల 20లక్షల మందికి వ్యాక్సీన్లను అందించారని అన్నారు. వారిలో నాలుగు కోట్లమందికి తొలి డోసు వ్యాక్సీన్ అందిందని, కోటీ 16లక్షల మంది ప్రజలు 2వ డోసు టీకాను కూడా అందుకున్నారని చెప్పారు. బసవరాజ్ బొమ్మై నాయకత్వంలో 90శాతంపైగా కర్ణాటక జనాభాకు సెప్టెంబరు నెలాఖరులోగా వ్యాక్సినేషన్ పూర్తికాగలదని అన్నారు. ప్రభుత్వం, ప్రజలు సమన్వయంతో మెలిగిన పక్షంలో ఈ వ్యాక్సినేషన్ భారీ విజయం సాధించగలదని, ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవగలదని అమిత్ షా అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/gm6w6lGCFMz6q4vwa96rbBHOEy6X6qZwAe9wT9lfEmiO97qDxaHNkWmBUf21Vw7afGDyE5VMwM-wQYweq_LQYSciKdgi-myoBT1c1tJqZBFqPyVjO1Q-R7SXXw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003D8A6.jpg

దేశంలోని నిరుపేదలు, వెనుకబడిన తరగతులవారు, గిరిజనుల గురించే ప్రధాననమంత్రి నరేంద్ర మోదీ ఎల్లపుడూ అలోచిస్తూ ఉంటారని కేంద్రహోమ్ మంత్రి చెప్పారు. కోవిడ్-19 సంక్షోభంతో  దేశంలోని పేదవర్గాల ప్రజలే ఎక్కువగా దెబ్బతిన్నారని, చాలా మంది రోజువారీ కూలీలు ఒక పూట భోజనం కూడా సంపాదించుకోలేక కష్టాలపాలయ్యారని అమిత్ షా అన్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేపథ్యంలో,.. మే నెలనుంచి దీపావళి పండుగ వరకూ ప్రతి ఒక్కరికీ ఐదు కేజీల చొప్పున ఆహార ధాన్యాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచితంగా అందించిందన్నారు. దేశంలోని 80కోట్ల జనాభాకు ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఆహార ధాన్యాలను పది నెలల పాటు ఉచితంగా అందించడం ఎవరికీ ఊహకు కూడా అందని విషయమని అన్నారు.

  కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వం ఏ అవకాశాన్నీ వదులుకోలేదని, ఏ ఇంటిలోనూ మహిళలు, చిన్నారులు ఖాళీ కడుపుతో నిద్రించే పరిస్థితి తలెత్తకుండా ప్రధానమంత్రి తగిన చర్యలు తీసుకున్నారని అమిత్ షా చెప్పారు. ఒకవేళ,.. థర్డ్ వేవ్ వైరస్ సంక్రమణ తలెత్తిన పక్షంలో కోవిడ్.పై సమర్థంగా పోరాటం సాగించేలా ప్రతి రాష్ట్రాన్ని, నగరాన్ని సన్నాహపరిచేందుకు, వేలాది కోట్ల రూపాయల ప్యాకేజీలను ప్రధానమంత్రి ప్రకటించారని ఆయన చెప్పారు.

  దేశంలో సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి సందర్భంగా ఆక్సిజన్.కు కొరత ఏర్పడిందని, దీనితో దేశంలో వేలాదిగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి రావడం మొదలైందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం త్వరలోనే ఆక్సిజన్ విషయంలో ఆత్మనిర్భర భారత్.గా స్వావలంబనను సాధించగలదన్న విశ్వాసం కలుగుతోందని అమిత్ షా అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/wcHEWumk_cC2aig3noHmURyUeg6P_guIJapv7l2vKfFV38NnJOonSv1QthUaJqujkti4t-cjZaARvF5d53J-4jT_LUSZJeBzQxR2FCfNRmC8SqMMpiKvf4EybA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NLY0.jpg

  కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైకి తమ పార్టీ అవకాశం కల్పించిందని అన్నారు. ఇక, యడియూరప్ప కూడా తన పరిపాలనా కాలంలో కర్ణాటక అభివృద్ధికి గల అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రెండు సార్లు కూడా ప్రత్యేకించి గ్రామాలు, రైతుల అభివృద్ధికోసం యడియూరప్ప కృషి చేశారని అమిత్ షా చెప్పారు. తమ పార్టీ ఆధ్వర్యంలో, యడియూరప్ప హయాంలో మాత్రమే కర్ణాటకలో అభివృద్ధి శకం ప్రారంభమైందని అన్నారు. బసవరాజ్ బొమ్మై నాయకత్వంలో తమ పార్టీ మరోసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బొమ్మై అనేక ముఖ్యమైన కార్యక్రమాలను అమలులోకి తెచ్చారన్నారు. పోలీసు సిబ్బందినుంచి సెల్యూట్.ను స్వీకరించే ఆనవాయితీకి, వి.వి.ఐ.పి. సంస్కృతితో ముడివడిన అనేక అంశాలకు ఆయన స్వస్తి చెప్పారన్నారని, పరిపాలనలో పారదర్శకత కోసం పలు చర్యలు తీసుకున్నారని అమిత్ షా చెప్పారు.

  కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో ఇంకా అభ్యంతరాలు, సందేహాలు ఉన్నాయని అమిత్ షా అన్నారు. అయితే, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో, కుటుంబంలో, స్నేహవర్గంలో వ్యాక్సినేషన్ అందని వారెవరూ మిగిలకూడదన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరగాలని, అందరికీ టీకా అందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. కోవిడ్-19పై విజయానికి వందశాతం వ్యాక్సినేషన్ మాత్రమే తగిన మంత్రమని, అవసరమైన వ్యాక్సీన్ల సరఫరా సక్రమంగా జరిగేలా భారత ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకున్నదని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు.

 

*****


(Release ID: 1751633) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Tamil , Kannada