ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ, గుజరాత్, దాద్రాలో సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ
Posted On:
02 SEP 2021 5:49PM by PIB Hyderabad
సింథటిక్ నూలు, పాలిస్టర్ చిప్‌ల తయారీదారు, డిస్ట్రిబ్యూటర్ అయిన ఒక గ్రూపుకు చెందిన కార్యాలయాలు, వివిధ కర్మాగారాలపై ఆదాయపు పన్ను శాఖ 01.09.2021వ తేదీన సోదాలు నిర్వహించింది. వ్యాపారానికి చెందిన ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయం, దాద్రా & నగర్ హవేలి, దహేజ్‌లో ఉన్న కర్మాగారాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు (సెర్చ్), జప్తు(సీజ్) ఆపరేషన్ నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ సోదాల సమయంలో వివిధ రకాల నేరారోపణ పత్రాలు, లెక్కకు చూపని వదులుగా ఉండే పత్రాలు, పలు డిజిటల్ ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. లెక్కకు చూపని లావాదేవీలలో గ్రూపు యొక్క ప్రమేయాన్ని సూచిస్తూ ఆధారాలు కనుగొనబడ్డాయి. సాధారణ ఖాతాల పుస్తకాలు, నగదు కొనుగోళ్లు, అమ్మకాలను తక్కువగా చూపేందుకు బోగస్ పార్టీలకు విక్రయాల బుకింగ్ వెలుపల లావాదేవీలకు సంబంధించిన పలు గణనీయమైన ఆధారాలు కూడా ఈ సోదాలలో కనుగొనబడ్డాయి. గ్రూపు మొత్తంగా సుమారు రూ.380 కోట్ల విలువైన లెక్కకు చూపని నిధులను దారి మళ్లించినట్టుగా సోదాలలో తేలింది. గత కొన్ని సంవత్సరాలుగా పేపర్లకే పరిమితమై ఉన్న సంస్థల ద్వారా, బోగస్ అసురక్షిత రుణాల రూపంలో ఈ నిధులను దారి మళ్లించనట్టుగా ఆధారాలు సోదాలలో లభించాయి. దీనికి తోడుగా డోల్ల కంపెనీల రూపంలో రూ.40 కోట్ల విలువైన నిధులను షేర్ ప్రీమియం రూపంలో ప్రవేశపెట్టబడ్డాయి. షెల్ సంస్థల డైరెక్టర్లు మరియు ఆడిటర్లు, తమ ప్రకటనలో ఈ విషయమై స్పందిస్తూ సంస్థ తప్పనిసరై వివిధ నమోదులు చేయడానికి ఉపయోగించబడ్డాయని అంగీకరించారు. నగదు కొనుగోలుకు సంబంధించిన గణనీయమైన ఆధారాలు మరియు "అంగడియాల" ద్వారా నగదు తరలింపును వెల్లడించే పత్రాలు సోదాలలో పొందబడ్డాయి. దీనికి తోడు రూ.154 బోగస్ కొనుగోళ్ల బుకింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఈ సోధాలలో గుర్తించబడ్డాయి. శోధన సమయంలో, లెక్కలోకి రాని ఆభరణాలను కూడా గుర్తించారు. దీనికి తోడు 11 లాకర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది తదుపరి విచారణ కొనసాగుతోంది.
****
(Release ID: 1751632)
Visitor Counter : 177