ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియాలో మొత్తం 66 కోట్లను దాటిన కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్
గత 24 గంటలలో 81 లక్షల డోస్‌లు వేయడం జరిగింది.
రికవరీ రేటు ప్రస్తుతం 97.48 శాతం గా ఉంది.
గత 24 గంటలలో 47 , 092 కొత్త కేసులు నమోదు
భారతదేశంలో క్రియాశీల కేస్ లోడ్ (3,89,583) ఇది మొత్తం కేసులలో 1.19 శాతంగా ఉంది.
వారపు పాజిటివిటి రేటు (2.62 శాతం) ఇది గత 69 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
Posted On:
02 SEP 2021 9:56AM by PIB Hyderabad
భారతదేశంలో మొత్తం వాక్సినేషన్ కవరేజ్ నిన్న చరిత్రాత్మకంగా 66 కోట్ల మైలురాయిని దాటింది.గత 24 గంటలలో 81,09,244 వాక్సినేషన్ డోస్‌లు వేయడంతో ఈ ఉదయం 7 గంటలకు అందిన ప్రాధిమక నివేదికల ప్రకారం కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ మొత్తం 66.30 కోట్లు (66,30,37,334) దాటింది. 69,60,983 సెషన్‌లలో దీనిని సాధించారు.
ఈ ఉదయం 7 గంటల వరకు అందిన ప్రాధమిక నివేదికల ప్రకారం వివరాలు కిందివిధంగా ఉన్నాయి.
HCWs
|
1st Dose
|
1,03,59,391
|
2nd Dose
|
84,14,897
|
FLWs
|
1st Dose
|
1,83,25,922
|
2nd Dose
|
1,33,20,833
|
Age Group 18-44 years
|
1st Dose
|
25,97,17,695
|
2nd Dose
|
2,98,87,208
|
Age Group 45-59 years
|
1st Dose
|
13,33,18,523
|
2nd Dose
|
5,59,07,199
|
Over 60 years
|
1st Dose
|
8,80,78,095
|
2nd Dose
|
4,57,07,571
|
Total
|
66,30,37,334
|
కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి దీనిని దేశవ్యాప్తంగా మరింత విస్తృతపరచేందుకు కట్టుబడి ఉంది.
దేశ వ్యాప్తంగా గత 24 గంటలలో 35,181 మంది పేషెంట్లు కోలుకోవడంతో , కోవిడ్ -19 నుంచి కోలుకున్న మొత్తం పేషెంట్ల సంఖ్య , కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటినుంచి ఇప్పటి వరకు 3,20,28,825 కు చేరింది.
ఫలితంగా ఇండియాలో కోవిడ్‌నుంచి కోలుకున్న వారి రేటు 97.48 శాతంగా ఉంది.
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమష్టి నిరంతర కృషి ఫలితంగా ప్రస్తుతం వరుసగా 67 వ రోజు రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 50 వేల లోపు ఉంటున్నది.
గత 24 గంటలలో 47,092 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
క్రియాశీల కేస్‌లోడ్ ప్రస్తుతం 3,89,583 గా ఉంది. దేశ మొత్తం పాజిటిజివ్ కేసులలో ఇది 1.19 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచడం జరుగుతోంది. గత 24 గంటలలో మొత్తం 16,84,441 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 52.48 కోట్లకుపైగా ( 52,48,68,734)కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దేశంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెంచడంతో , వారపు పాజిటివిటి రేటు 2.62 శాతంగా ఉంది. గత 68 రోజులుగా ఇది 3 శాతం దిగువన ఉంది.. రోజువారి పాజిటివిటి రేటు 2.80 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటి రేటు వరుసగా గత 87 రోజులుగా 5 శాతం దిగువన ఉంది.
***
(Release ID: 1751371)
Visitor Counter : 205