రైల్వే మంత్రిత్వ శాఖ
సరుకు రవాణా పరంగా ఆగస్టు 2021లో అత్యున్నత స్థాయిని సాధించిన భారతీయ రైల్వేలు
ఆగస్టు 2020 (94.59 మిలియన్ టన్నులు)తో పోలిస్తే 16.87% అధికంగా 110.55 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిన భారతీయ రైల్వేలు
సరుకు రవాణా ద్వారా ఆగస్టు 2020లోఆర్జించిన రూ. 9,043.44 కోట్లతో పోలిస్తే 20.16% అధికంగా ఈ ఏడాది రూ. 10,866. 20 కోట్లు ఆర్జించిన రైల్వేలు
Posted On:
01 SEP 2021 5:47PM by PIB Hyderabad
కోవిడ్ సవాళ్ళు నేపథ్యంలో కూడా ఆగస్టు 2021లో లోడింగ్, ఆదాయాల పరంగా భారతీయ రైల్వే సరుకు రవాణా గణాంకాలలో అత్యున్నత ప్రగతిని సాధించింది. ఆగస్టు 2020లో (94.59 మిలియన్ టన్నులు)తో పోలిస్తే ఆగస్టు 2021లో 110.55 మిలియన్ టన్నులను భారతీయ రైల్వేలు సరుకు రవాణా చేసింది. ఆగస్టు 2020లో రూ.9,043.44 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఆగస్టు 2021లో 10,866.20 కోట్ల ఆదాయాన్ని సరుకు రవాణా ద్వారా భారతీయ రైల్వే ఆర్జించింది. ఇది గత ఏడాదికన్నా 20.16 శాతం ఎక్కువ.
ఆగస్టు 2021లో రవాణా చేసిన వస్తువులలో 47.94 మిలియన్ టన్నుల బొగ్గు, 13.53 మిలియన్ టన్నుల ఇనుపధాతువు, 5.77 మిలియన్ టన్నుల పెళుసు ఇనుము& మెరుగుపెట్టిన ఉక్కు, 6.88 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 4.16 మిలియన్ టన్నుల ఫర్టిలైజర్లు, 3.60 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్, 6.3 మిలియన్ టన్నుల సిమెంట్ (శిలాద్రవం - క్లింకర్ మినహా), 4.51 మిలియన్ టన్నుల శిలాద్రవం ఉన్నాయి.
రైల్వేల ద్వారా సరకు రవాణాను మరింత ఆకర్షణీయం చేయడం కోసం భారతీయ రైల్వేలు అనేక రాయితీలను / డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుతమున్న నెట్‌వర్క్ లో సరుకు రవాణా రైళ్ళ వేగాన్ని పెంచారు. సరుకు రవాణా వేగాన్ని మెరుగుపరచడమన్నది అందరు భాగస్వాములకు వ్యయాన్ని ఆదా చేస్తుంది. సరుగకు రవాణా రైళ్ళు గత 19 నెలల్లో రెండింతలు అయ్యాయి.
కోవిడ్ 19 మహమ్మారిని మొత్తం సామర్ధ్యాలను, పనితీరును మెరుగుపరచే అవకాశంగా భారతీయ రైల్వేలు ఉపయోగించుకుంది.
***
(Release ID: 1751245)
Visitor Counter : 141