బొగ్గు మంత్రిత్వ శాఖ
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ఒక్క రోజుల్లో అత్యధికంగా 102 రేక్స్ బొగ్గును డిస్పాచ్ చేసి రికార్డ్ సృష్టించింది.
Posted On:
31 AUG 2021 6:24PM by PIB Hyderabad
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్), బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక మినీరత్న కంపెనీ. ఈ కంపెనీ ఈరోజు రైలు విధానంలో అత్యధికంగా బొగ్గును పంపి రికార్డ్ సృష్టించింది. ఒకేరోజులో ఐబీ వ్యాలీ మరియు తాల్చేర్ కోల్‌ఫీల్డ్‌ల నుండి 102 రేకులు వివిధ పవర్ స్టేషన్లకు చేరుకున్నాయి.
ఎంసీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ పికె సిన్హా పర్యావరణ అనుకూలమైన రైలు మోడ్ ద్వారా రికార్డ్ డిస్పాచ్ సాధించడంలో పాల్గొన్న బృందాలను అభినందించారు. " భారతీయ రైల్వేల నుండి అందిన సమన్వయం మరియు మద్దతుతో ఎంసీఎస్ టీమ్ ఆకట్టుకునే ప్రదర్శన చేసిందని " మిస్టర్ సిన్హా అన్నారు. దేశం ఇంధన అవసరాలను తీర్చడానికి గొప్ప బాధ్యతతో పనిచేసినందుకు జట్టు నాయకులతో పాటు ఆయా బృందాలను ఆయన అభినందించారు.
ఆగస్టు 30, 2021 న తాల్చేర్ బొగ్గు క్షేత్రాల నుండి అత్యధికంగా 61 రేక్‌లను పంపి రికార్డు సృష్టించిన ఎంసీఎల్ తద్వారా వివిధ విద్యుత్ కేంద్రాలకు నాలుగు లక్షల టన్నుల బొగ్గుతో పాటు మొత్తం 5.3 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేసింది.
అదనంగా, 16 రేక్‌లు ఎంజీఆర్- మోడ్ (మెర్రీ-గో-రౌండ్) ద్వారా 1.15 లక్షల టన్నులకు పైగా బొగ్గు ట్రక్కుల ద్వారా వివిధ వినియోగదారులకు పంపబడింది.
ఎంసీఎల్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ. ఈ సంస్థ మైనింగ్ కార్యకలాపాలు ఒడిశాలోని జార్సుగూడ, సుందర్‌గఢ్ మరియు అంగుల్ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి.
సుస్థిర మైనింగ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళుతూ ఎంసీఎల్ మొత్తం 3,600 కోట్ల వ్యయంతో కాలుష్యం లేని అత్యాధునిక రేక్ లోడింగ్ వ్యవస్థను అందించడానికి తొమ్మిది ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఇది 2024 సంవత్సరం నాటికి సంవత్సరానికి 126 మిలియన్ టన్నుల డిస్పాచ్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది,
1999 లో పర్యావరణ అనుకూలమైన సర్ఫేస్ మైనింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి బొగ్గు కంపెనీ ఎంసిఎల్. 66 సర్ఫేస్ మైనర్ల అతిపెద్ద సముదాయ కంపెనీ. మొత్తం బొగ్గు ఉత్పత్తికి 95 శాతం సహకారం అందిస్తోంది.
*****
(Release ID: 1750930)
Visitor Counter : 160