ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆమ్నెస్టీ పథకానికి ఆలస్య రుసుము కట్టే ముగింపు తేదీ మరియు జి.ఎస్.టి. చట్టం కింద రిజిస్ట్రేషన్ రద్దును పునరుద్ధరించడానికి దరఖాస్తు దాఖలు చేయడానికి కాలపరిమితి - పొడిగింపు
प्रविष्टि तिथि:
29 AUG 2021 7:23PM by PIB Hyderabad
2017 జూలై, నుండి 2021 ఏప్రిల్ వరకు పన్ను కాలాలకు ఫారం జి.ఎస్.టి.ఆర్-3.బి. ని సమర్పించని పన్ను చెల్లింపుదారులకు ఆలస్య రుసుము తగ్గించడం లేదా రద్దు చేస్తూ ప్రభుత్వం, నోటిఫికేషన్ నం.19/2021- సెంట్రల్ ట్యాక్స్, తేదీ 01.06.2021 కి ప్రకారం ఉపశమనం కలిగించింది. అయితే వారు ఆయా కాలాలకు సంబంధించిన టాక్స్ రిటర్న్ లను 01.06.2021 నుండి 31.08.2021 మధ్య తప్పనిసరిగా సమర్పించి ఉండాలి. ఈ ఆలస్య రుసుము మాఫీ పథకం ప్రయోజనం పొందడానికి చివరి తేదీని, ప్రస్తుతం ఉన్న 31.08.2021 నుండి 30.11.2021 వరకు పొడిగించారు. [నోటిఫికేషన్ నం. 33/2021- సెంట్రల్ ట్యాక్స్, తేదీ 29.08.2021 చూడండి].
అనేక మంది నుండి విజ్ఞాపనలు అందిన నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ రద్దును ఉపసంహరించాలని దరఖాస్తు చేయడానికి గడువు తేదీ 01.03.2020 నుండి 31.08.2021 మధ్య ఉన్నచోట, రిజిస్ట్రేషన్ రద్దును ఉపసంహరించాలని దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం 30.09.2021 తేదీ వరకు పొడిగించింది. సి.జి.ఎస్.టి. చట్టంలోని సెక్షన్-29 లోని క్లాజ్ (బి) లేదా క్లాజ్ (సి) సబ్ సెక్షన్ (2) కింద రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడిన సందర్భాల్లో మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. [నోటిఫికేషన్ నం. 34/2021- సెంట్రల్ ట్యాక్స్, తేదీ 29.08.2021 చూడండి ].
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డి.ఎస్.సి) బదులుగా ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ (ఇ.వి.సి) ఉపయోగించే కంపెనీల ద్వారా ఫారం జి.ఎస్.టి.ఆర్-3బి మరియు ఫారం జి.ఎస్.టి.ఆర్-1/ఐ.ఎఫ్.ఎఫ్. దాఖలు చేయడం ఇప్పటికే 27.04.2021 నుండి 31.08.2021 వరకు అమలులో ఉంది. ఇది 2021 అక్టోబర్, 31వ తేదీ వరకు తిరిగి పొడిగించబడింది. [నోటిఫికేషన్ నం. 32/2021- సెంట్రల్ ట్యాక్స్, తేదీ 29.08.2021 చూడండి].
ఆలస్య రుసుము మాఫీ పథకం ముగింపు తేదీని పొడిగించడం, అదే విధంగా, రిజిస్ట్రేషన్ రద్దు ను ఉపసంహరించాలని దరఖాస్తు దాఖలు చేయడానికి కాలపరిమితిని పొడిగించడం వల్ల, అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా, చిన్న పన్ను చెల్లింపుదారులు, వివిధ కారణాల వల్ల, ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా, తమ రిటర్నులను సకాలంలో దాఖలు చేయలేక పోయినవారు, అదేవిధంగా, ఇదే కారణాలవల్ల రిజిస్ట్రేషన్లు రద్దయినవారు ప్రయోజనం పొందుతారు. పన్ను చెల్లింపుదారులు, చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి గాను, వీలైనంత త్వరగా ఈ పొడిగింపుల ప్రయోజనాన్ని పొందాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
*****
(रिलीज़ आईडी: 1750304)
आगंतुक पटल : 276