సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మైసూరులో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించిన సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి
- "ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కోసం" అనే నినాదానికి కమ్యూనిటీ రేడియో ఒక చక్కని ఉదాహరణ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి
Posted On:
29 AUG 2021 3:38PM by PIB Hyderabad
'ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కోసం' అనే సూత్రం కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు సంపూర్ణంగా వర్తిస్తుందని, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జేఎస్ఎస్ మహా విద్యా పీఠంలో పవిత్ర జగద్గురు డాక్టర్ శ్రీ శివరాత్రి రాజేంద్ర మహాస్వామి 106వ జయంతి వేడుకల సందర్భంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్ (జేఎస్ఎస్ రేడియో 91.2 MHz) ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 329 కార్యాచరణ కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రసారమవుతున్నాయి, వీటిలో 22 కర్ణాటకలో ఉన్నాయి జేఎస్ఎస్ రేడియో అనేది మైసూర్ నగరంలో ప్రసారమయ్యే మూడవ కమ్యూనిటీ రేడియో స్టేషన్. "వెనుకబడిన ప్రాంతాలలో కింది స్థాయి వ్యక్తుల మీడియాగా, కమ్యూనిటీ రేడియో ఇటీవలి సంవత్సరాలలో ప్రజాదరణ పొందింది మరియు విధానకర్తలు మరియు అట్టడుగు వర్గాల ప్రజలు తమ సంఘం అభివృద్ధి ప్రక్రియలో పాల్డొనేలా ఇది ఒక కొత్త శకానికి తెరతీస్తుంది" అని మంత్రి తెలిపారు. స్థానిక జనాభాలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల యొక్క ప్రాముఖ్యతను మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. కోవిడ్ 19 గురించి అవగాహన కల్పించడంలో, అలాగే మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల గురించి తెలియజేయడంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ముఖ్యమైన పాత్ర పోషించాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సుత్తూర్ మఠం యొక్క సహకారాన్ని తెలియజేస్తూ ఈ మఠం దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ మత కేంద్రాలలో ఒకటని అన్నారు. మానవత్వానికి, సాధ్యమైన అన్ని విధాలలో నిష్కళంకమైన సేవకు ఈ మఠం ప్రసిద్ధి చెందింది
అని అన్నారు. వెయ్యి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ ఫలవంతమైన తన ఉనికితో, దేశవ్యాప్తంగా మరియు విదేశాలలో వేలాది మంది ప్రజలకు సామాజిక-ఆధ్యాత్మిక-ఆరోగ్య మరియు విద్యా కేంద్రంగా శ్రీ సుత్తూర్ మఠం ఒక కేంద్రంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుత్తూరు వీరసింహాసన సంస్థాన్ మఠానికి చెందిన పవిత్ర జగద్గురు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామిజీతో పాటు
కృష్ణరాజ్ నియోజకవర్గం ఎంఎల్ఏ శ్రీ ఎస్.ఎ. రామదాస్, చామరాజ ఎంఎల్ఏ నియోజకవర్ఘానికి చెందిన శాసనసభ్యుడు శ్రీ నాగేంద్ర, నరసింహరాజ్ నియోజక వర్గం ఎంఎల్ఏ శ్రీ తన్వీర్ సైత్, మైసూర్ సిటీ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి సునంద పలనేత్ర, మైసూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ హేమంత కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
***
(Release ID: 1750302)
Visitor Counter : 155