ఆయుష్

ఆజాది కా అమృతోత్సవ్ లో భాగంగా ప్రచార కార్యక్రమాలను ప్రకటించిన ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్


అవిశ్రామంగా వృత్తి ఉద్యోగాల్లో నిమగ్నమయ్యే వారి కోసం 5 నిమిషాల యోగా ప్రోటోకాల్ ప్రారంభం, 75 లక్షల కుటుంబాలకు ఔషధ మొక్కల పంపిణీ, వృద్ధులకు రోగనిరోధక మందుల పంపిణీ... వారం రోజుల ప్రచార ప్రణాళిక సిద్ధం

Posted On: 29 AUG 2021 2:21PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలు మరియు ప్రచారాల కార్యక్రమాలను ప్రకటించారు. విజ్ఞాన్ భవన్ నుండి వై బ్రేక్ యాప్ జాతీయ ప్రారంభోత్సవం, వ్యవసాయ భూముల్లో ఔషధ మొక్కల పెంపకం, గృహాలకు  ఔషధ  మొక్కల పంపిణీ, ఆయుష్ వ్యవస్థలపై పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు అవగాహన కల్పించడం వీటిలో ముఖ్యమైనవి. 

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 5 వరకు వారం రోజుల ప్రచార కార్యక్రమాలు దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు వెళ్లేలా, పిల్లల నుండి వృద్ధుల వరకు, రైతుల నుండి కార్పొరేట్ వరకు జనాభాలోని అన్నివర్గాలకు  చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీ సోనోవాల్ చెప్పారు.

 

 

ఆజాది కా అమృత్ మహోత్సవం భారతదేశ స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల శ్రేణి. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో ఈ మహోత్సవాన్ని జన్-ఉత్సవ్‌గా జరుపుకుంటున్నాము. 

ఆగష్టు 31 న రైతులకు ప్రయోజనం చేకూర్చే 75,000 హెక్టార్ల భూమిలో ఔషధ మొక్కల పెంపకం, సెప్టెంబర్ 1 న ఆఫీసు వెళ్లేవారి కోసం ఐదు నిమిషాల యోగా ప్రోటోకాల్, ప్రత్యేక దృష్టితో ఆయుష్ రోగనిరోధక మందుల పంపిణీ వంటి కార్యకలాపాలు ఉన్నాయి. సెప్టెంబరు 3న 'ఆయుష్ఆప్‌కేద్వార్' కార్యక్రమం కింద సంవత్సరంలో 75 లక్షల కుటుంబాల గడపలకు ఔషధ మొక్కలను తీసుకొని సెప్టెంబర్ 2 న పైన పేర్కొన్న 60 సంవత్సరాల వయస్సు గ్రూప్, సెప్టెంబర్ 4 న పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఐఇసి మెటీరియల్ పంపిణీ మరియు సెప్టెంబర్ 5 న వై-బ్రేక్ అప్లికేషన్‌పై వెబ్‌నార్ నిర్వహిస్తారు. ఆగస్టు 30 న ఆయుష్ షెల్టర్ ద్వారా తుఫానును తట్టుకోవడం అనే అంశంపై ఆయుష్ విద్యార్థులకు జాతీయ వెబ్‌నార్‌తో ఆయుష్ వారం ప్రారంభమవుతుంది.

విలేకరుల సమావేశంలో ప్రసంగించిన శ్రీ సోనోవాల్, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ తన సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే అవకాశాన్ని అందిపుచ్చుకుందని అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాల్గొని మంత్రిత్వ శాఖ ప్రయత్నంలో సహాయపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
 

"ఆయుష్ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేయగల సామర్థ్యం, జ్ఞానం కలిగి ఉంది. ఈ వారంలో మేము మాకున్న బలాన్ని, నిబద్ధతతో వినియోగిస్తాము” అని కేంద్ర ఆయుష్ మంత్రి చెప్పారు.

75,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఔషధ మొక్కల పెంపకం ప్రచారాన్ని ప్రారంభించడం వలన, ఔషధాల లభ్యతను నిర్ధారిస్తుంది మరియు రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుందని శ్రీ సోనోవాల్ అన్నారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా ఈ కార్యాచరణ అమలు చేస్తారు. లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డులు ఈ కార్యంలో ఉంటాయి అని తెలిపారు. "ఇది రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరుస్తుంది," అని ఆయన చెప్పారు. 

వై-బ్రేక్ అప్లికేషన్ ప్రారంభించడం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రణాళిక చేసిన అతి ముఖ్యమైన కార్యకలాపాలలో ఒకటి. అప్లికేషన్ విజ్ఞాన్ భవన్ నుండి ప్రారంభిస్తారు. యోగా ప్రోటోకాల్‌లో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సహా కష్టపడి ఎక్కువ సమయం వారి వృత్తి ఉద్యోగాలకే వెచ్చిస్తున్న వారి ఒత్తిడిని తగ్గించడానికి, రిఫ్రెష్ చేయడానికి, వారి పని ప్రదేశాలలో మెరుగైన రోగనిరోధక శక్తితో తిరిగి దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

"వై- బ్రేక్ మొబైల్ అప్లికేషన్ ఎం.డి.ఎన్.ఐ.వై (మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా) లో అభివృద్ధి చేసారు. ఈ యాప్ ద్వారా, యోగా, ధ్యానం కేవలం 5 నిమిషాల్లో ఎక్కడైనా చేయవచ్చు, ” అని కేంద్ర ఆయుష్ మంత్రి చెప్పారు.
60 సంవత్సరాల వయసు పైబడ్డవారి పట్ల  ప్రత్యేక దృష్టి సారించి ఆయుష్ రోగనిరోధక ఔషధాల పంపిణీ సమాజానికి కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. వివిధ ఆయుష్ వ్యవస్థల కోసం జారీ చేయబడిన కోవిడ్ సంబంధిత ప్రోటోకాల్‌లు ఉన్నాయి. ఆహారం మరియు జీవనశైలికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా మంత్రిత్వ శాఖ వ్యాప్తి చేస్తుంది.

‘ఆయుష్ఆప్‌కేద్వార్’ కార్యక్రమం కింద, కిచెన్ గార్డెన్‌లో ఔషధ మొక్కలను పెంచే భావనను ప్రోత్సహించడానికి ఇంటింటికీ పంపిణీ చేస్తారు.. ఇది సాధారణ అనారోగ్యాల కోసం గృహాలు తమ తోటల నుండి మందులను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.

ఆయుష్ వైపు యువత ను ఆకర్షితులను చేయడానికి, వారు ఆరోగ్యంగా ఉండేలా  సహాయపడటానికి, హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థుల కోసం ఆయుష్ వ్యవస్థపై వరుస అవగాహనా  ఉపన్యాసాలు కూడా వారంలో ప్రారంభిస్తారు. వారికి ఐఈసి మెటీరియల్ పంపిణీ చేస్తారు.

"ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాల గురించి దేశంలోని వివిధ సంస్థల విద్యార్థులకు అవగాహన కల్పిస్తాము. వారిని ఆయుష్ రంగాలతో అనుసంధానిస్తాము." అని  కేంద్ర మంత్రి వివరించారు. 

***



(Release ID: 1750202) Visitor Counter : 254


Read this release in: English , Urdu , Hindi , Tamil