మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్స్య శాఖ విభాగం , కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ, ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా వెబ్‌నార్ నిర్వహించింది
"మంచినీటి ఆక్వాకల్చర్‌లో ప్రధాన వ్యాధుల సమస్య మరియు నివారణ " పై ప్రత్యేక వెబినార్
Posted On:
28 AUG 2021 4:01PM by PIB Hyderabad
ఆజాదిక అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత ప్రభుత్వ మత్స్య శాఖ విభాగం , కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో "మంచినీటి ఆక్వాకల్చర్‌లో ప్రధాన వ్యాధి సమస్యలు మరియు నివారణ" అనే అంశంపై 28 ఆగస్ట్ 2021 న మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షతన వెబ్‌నార్ జరిగింది. శ్రీ స్వైన్ తన ప్రారంభ ప్రసంగంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశ విప్లవం మరియు అభివృద్ధి గురించి క్లుప్తంగా తెలియజేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా భారతప్రభుత్వ మత్స్య శాఖ, భారత ప్రభుత్వం వెబ్‌నార్‌ల శ్రేణిని నిర్వహిస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. నేటి వెబ్‌నార్ మంచినీటి ఆక్వాకల్చర్‌లోని ప్రధాన వ్యాధుల నిర్వహణ మరియు వాటి నిర్వహణపై దృష్టి పెట్టింది. దేశంలోని చేపల ఉత్పత్తికి మంచినీటి ఆక్వాకల్చర్ సహకారాన్ని శ్రీ స్వైన్ హైలైట్ చేసారు. దేశంలో మంచినీటి ఆక్వాకల్చర్‌లో వ్యాధుల నివారణ కోసం పిఎంఎంఎస్‌వై పథకం కింద అందుబాటులో ఉన్న విభాగాల గురించి క్లుప్తంగా వివరించారు.
శ్రీ సాగర్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ (ఇన్‌లాండ్ ఫిషరీస్) మరియు డాక్టర్ జె. బాలాజీ, జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్) కూడా వెబ్‌నార్‌లో ప్రసంగించారు. మత్స్య శాఖ ఇతర అధికారులు, భారత ప్రభుత్వ మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మత్స్యశాఖ అధికారులు, దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, రాష్ట్ర జంతు మరియు మత్స్య విశ్వవిద్యాలయాలు, పారిశ్రామికవేత్తలు, ఆక్వాకల్చర్ రైతులు మరియు దేశవ్యాప్తంగా హేచరీ యజమానులు, ఆక్వాకల్చర్ పరిశ్రమ ప్రతినిధులు వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.
శ్రీ సాగర్ మెహ్రా, జేఎస్ (ఐఎఫ్) భారతదేశంలోని మంచినీటి ఆక్వాకల్చర్‌లో వ్యాధి నిర్వహణలో ప్రాముఖ్యత మరియు సవాళ్లను క్లుప్తంగా తెలియజేశారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) ద్వారా ఈ రంగం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ఆయన తెలియజేశారు. ఇంకా పిఎంఎంఎస్‌వై కింద మంచినీటి ఆక్వాకల్చర్‌లో వ్యాధి నిర్వహణ కోసం సంస్థలు, రైతులు మరియు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించబడుతుందని శ్రీ మెహ్రా తెలిపారు. డాక్టర్ జె. బాలాజీ తన ప్రసంగంలో వ్యాధి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేసారు మరియు వ్యాధి మరియు జల ఆరోగ్య నిర్వహణ సమస్యలను అధిగమించడానికి వ్యూహం మరియు ప్రణాళికపై వివరించారు.
డా. ప్రమోద కుమార్ సాహూ, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసిఎఆర్- సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ భారతదేశంలో మంచినీటి ఆక్వాకల్చర్‌లోని ప్రధాన వ్యాధుల సమస్యలు మరియు వాటి నిర్వహణ గురించి వివరంగా తెలియజేశారు. తన ప్రెజెంటేషన్‌లో ఆయన ముఖ్యమైన చేపల వ్యాధులు మరియు వ్యాధుల కారణంగా వచ్చే నష్టాన్ని ప్రధానం తెలియజేశారు. ఇంకా ఆయన చేపల ఆరోగ్య రంగం యొక్క వ్యాధి నిర్వహణ చర్యలు, సమస్యలు మరియు ఆందోళనల గురించి వివరంగా తెలియజేశారు. మరియు మెరుగైన ఆరోగ్య నిర్వహణ కోసం కొన్ని సూచనలు చేసారు.
కార్యక్రమం తర్వాత రైతులు, పారిశ్రామికవేత్తలు, హేచరీ యజమానులు, శాస్త్రవేత్తలు మరియు విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో ఫలవంతమైన పరస్పర చర్య చేపట్టబడింది.ఐసిఎఆర్-సిఐఎఫ్‌ఎ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.కె. సాహూ వాటాదారులతో చర్చకు నాయకత్వం వహించారు. వాటాదారులు వివిధ వ్యవసాయ స్థాయి వ్యాధి మరియు వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య నిర్వహణ సమస్యలను లేవనెత్తారు. వాటాదారులు లేవనెత్తిన సమస్యలపై డాక్టర్ సాహూ తగిన నిర్వహణ చర్యలను సూచించారు. మంచినీటి ఆక్వాకల్చర్‌లో వ్యాధి నిర్వహణ కోసం పిఎంఎంఎస్‌వై విభాగాల గురించి మత్స్య శాఖ విభాగం, భారతప్రభుత్వ అధికారులు వివరించారు. వ్యాధి నిర్ధారణ మరియు నాణ్యతా పరీక్షా ప్రయోగశాలలు మరియు మొబైల్ ల్యాబ్‌లు, నాణ్యమైన పరీక్ష మరియు వ్యాధి నిర్ధారణ కొరకు ఆక్వాటిక్ రెఫరల్ ల్యాబ్‌లు, సమర్థవంతమైన జల ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ, వ్యాధి పర్యవేక్షణ బలోపేతం మరియు నిఘా కార్యక్రమం, జల దిగ్బంధ సౌకర్యాల ఏర్పాటు, మొదలైనవాటి గురించి వివరించారు.
శ్రీ ఐ.ఎ. సిద్ధిఖీ, ఫిషరీస్ డెవలప్‌మెంట్ కమిషనర్, డిఓఎఫ్ వెబ్‌నార్ సమయంలో చర్చను నియంత్రించారు.
*******
(Release ID: 1750126)
Visitor Counter : 463