సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
“రాజ్యాంగం తయారీ”పై ఇ-ఫొటో ప్రదర్శన
“చిత్రాంజలి@75” పేరిట ఫిల్మ్ పోస్టర్
ప్రారంభించిన కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.
స్వరాజ్యోద్యమ ప్రయాణంలో
ముఖ్య ఘట్టాల స్మరణకోసమే
‘మీ రాజ్యాంగాన్ని తెలుసుకోండి’ కార్యక్రమం..
హిందీ, ఇంగ్లీష్,11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి..
Posted On:
27 AUG 2021 5:31PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
- స్వాతంత్ర్య పోరాట యోధుల పవిత్ర జ్ఞాపకాలను చిత్రాంజలి@75 గుర్తుచేస్తుంది.; ఈ చిత్రాలను మా మంత్రిత్వ శాఖ భవిష్యత్తులో జనాల చేరువకు తీసుకెళ్తుంది: మంత్రి ఠాకూర్
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.ను యువత సారథ్యంలోని ఉద్యమంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. : కిషన్ రెడ్డి.
- ఫొటో, పోస్టర్ ఎగ్జిబిషన్,.. యువతలో స్ఫూర్తిని రగిలించి, వారిని శక్తివంతం చేస్తుంది.: కిషన్ రెడ్డి
- ఎగ్జిబిషన్లలోని ఛాయాచిత్రాల పటాలు కూడా ఆవిష్కరణ
“రాజ్యాంగం తయారీ”పై ఇ-ఫొటో ప్రదర్శనను, “చిత్రాంజలి@75” పేరిట వర్చువల్ ఫిల్మ్ పోస్టర్ ప్రదర్శనను కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్,; పార్లమెంటరీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, విదేశాంగ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలతోపాటుగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఐకానిక్ వీక్ (#IconicWeek) పేరిట “భారత రాజ్యాంగం రూపకల్పన” పై వర్చువల్ ఫొటో ప్రదర్శనను ఈ సందర్భంగా ప్రారంభించారు. నవభారతం అనే భావనను గురించి తెలియజెప్పేందుకు, స్వాతంత్ర్య సముపార్జనకోసం సమరయోధులు అందించిన సేవలను గురించి అవగాహన కల్పించేందుకు వివిధ రకాల సమాచార సాధనాలతో కలసి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నా ‘గుర్తింపుకు నోచుకోని వీరుల’ గురించి పలురకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజెప్పనున్నారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రాజ్యాంగం తయారీ ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఇ-ఫొటో ఎగ్జిబిషన్ ధ్యేయమన్నారు. ప్రజలకు భాగస్వామ్యం కల్పించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో విశిష్టమైనదన్నారు. మన రాజ్యాంగం గురించి తెలుసుకొనేలా దేశంలోని యువతను ప్రోత్సహించేందుకు, వారి హక్కులు, బాధ్యతలను తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
‘మీ రాజ్యాంగాన్ని తెలుసుకోండి’ అనే పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తుందని ఠాకూర్ చెప్పారు. రాజ్యాంగం వ్యవస్థాపక సూత్రాలను గురించి ప్రచారం చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం వహించేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. “నిరంతర మార్పులతో కూడిన డిజిటల్ విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని, డిజిటల్ రూపంలోనే ఫొటోల సంకలనాన్ని విడుదల చేశాం. హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటుగా 11 భారతీయ భాషల్లో ఈ పుస్తకం విడుదల అవుతుంది. స్వాతంత్ర్యం సాధించే వరకూ మనం జరిపిన ప్రయాణంలోని పలు ముఖ్య ఘట్టాలను ఈ విభిన్న సంకలనం తెలియజెపుతుంది.” అని ఆయన అన్నారు. వర్చువల్ రూపంలోని ఈ ప్రదర్శనలో పలు వీడియోలు, ప్రసంగాలు ఉన్నాయి. అలాగే, ఇ-సర్టిఫికెట్.కు అనుసంధానంతో ఇంటరాక్టివ్ క్విజ్ పోటీలు కూడా ఇందులో ఉన్నాయి.
వర్చువల్ పోస్టర్ ప్రదర్శన గురించి మంత్రి మాట్లాడుతూ, చిత్రాంజలి@75 అనేది, 75 సంవత్సరాల భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రతిబింబిస్తుంది. మన స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక సంస్కర్తలు, మన సైనికుల ధైర్య సాహసాలను గురించిన పవిత్ర జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మా పోస్టర్ ఎగ్జిబిషన్ లో ఇలాంటి 75 అపురూప చలనచిత్రాలను చేర్చడానికి మేం ప్రయత్నించాం. అని. అన్నారు. ఇకపై భవిష్యత్తులో కేవలం పోస్టర్లను మాత్రమే కాక, చిత్రాలను కూడా అందుబాటులో ఉంచేందుకు తమ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం ముందుకాలంతో సహా పలు దశాబ్దాల భారతీయ సినీరంగ పయనాన్ని గురించి పోస్టర్ ప్రదర్శన వివరిస్తుందని ఆయన చెప్పారు. దేశం నలుమూలలకూ చెందిన అపురూప చలన చిత్రాలను ఈ ఎగ్జిబిషన్ వివరిస్తుందన్నారు. వర్చువల్ రూపంలోని ఈ పోస్టర్ ఎవరైనా డౌన్.లోడ్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. అందరూ ఈ పోస్టర్.ను డౌన్.లోడ్ చేసుకుని పరస్పరం పంపిణీ చేసుకోవాలని సూచించారు.
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని యువత సారథ్యంలోని నడిచే ఉద్యమంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారని చెప్పారు. చలనచిత్రం అనేది శక్తివంతమైన మాధ్యమమని, యువతకు తగిన ప్రమేయం కల్పించడం సినిమాల ద్వారానే సులభ సాధ్యమవుతుందని అన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ సారథ్యంలో, పరస్పర సాంస్కృతిక అవగాహన, యోగా, ఆయుర్వేద, కళల ద్వారా భారతదేశం శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తున్నాయి. చలన చిత్రాలను మన సాంస్కృతిక వారసత్వ సంపదలో భాగంగా పరిగణించేందుకు ఇదే తగిన అవకాశమం. భారతదేశపు శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు చలన చిత్రాలు విభిన్నమైన అవకాశాన్ని కల్పిస్తాయని నేను విశ్వసిస్తాను.” అని ఆయన అన్నారు. 2047లో మనం వందేళ్ళ స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునేటపుడు మరింత శక్తివంతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశాన్ని ఊహించుకునేలా ఈ కార్యక్రమాల ద్వారా యువతకు తగిన స్ఫూర్తిని కలిగించాలన్నది ప్రధాని భావన అని ఆయన చెప్పారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ప్రపంచ పలు కార్యక్రమాలను మేం చురుకుగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలను ప్రజల ఉద్యమంగా చేపడుతున్నాం. ఈ మహోత్సవాలకోసం గత మార్చిలోనే సన్నాహాలు ప్రారంభించాం. 2021 ఆగస్టు 15వ తేదీనుంచి అమృత మహోత్సవ్ (#AmritMahotsav) జరుపుకుంటున్నాం.
--కేంద్రమంత్రి @kishanreddybjp pic.twitter.com/4ATcC01X1G
— పి.ఐ.బి. ఇండియా (@PIB_India) ఆగస్టు 27, 2021.
ఆగస్టు 23నుంచి 29వ తేదీవరకూ ఐకానిక్ వీక్ నిర్వహణకు, రాజ్యాంగం తయారీపై ఇ-ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహణకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సారథ్య బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి చెప్పారు. మన స్వాంతంత్ర్య సమర యోధుల త్యాగాలను ప్రజలకు గుర్తు చేసేందుకు చిత్రాంజలి@75 అనే కార్యక్రమం దోహదపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఫొటో ప్రదర్శన, పోస్టర్ ఎగ్జిబిషన్ యువతలో స్ఫూర్తిని రగిలించగలవని తాను విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ, మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను యువతకు చేరువ చేసేందుకు ఇదే తగిన కార్యక్రమమని అన్నారు.
కేంద్రమంత్రులు ఠాకూర్, కిషన్ రెడ్డి, డాక్టర్ ఎల్. మురుగన్, అర్జురాం మేఘ్వాల్, మీనాక్షీ లేఖి ఈ సందర్బంగా ఎగ్జిబిషన్.కు సంబంధించిన పలు ఛాయా చిత్రాల ఫలకాలను కూడా ఆవిష్కరించారు.
(ఛాయా చిత్రాల పటాల ఆవిష్కరణ)
(ఛాయా చిత్రాల పటంపై సంతకం చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి)
చిత్రాంజలి@75 గురించి..:
పలు దృశ్యరూపాల డాక్యుమెంటరీలతో కూడిన ఈ వర్చువల్ ఎగ్జిబిషన్ భారతీయ చలనచిత్ర వైభవాన్ని, సినీరంగ పయనాన్ని వివరిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల, సైనికుల, ధైర్య సాహసాలను చక్కగా వర్ణిస్తుంది. అనేక సంస్కరణలకు దారి తీసిన సమాజ పరిణామాలను వివరించే సినిమాలను కూడా ఇందులో పొందుపరిచారు. సాయుధ బలగాల వీరుల గురించిన చలన చిత్రాలను కూడా ఇందులో పొందుపరిచారు.
‘చిత్రాంజలి@75’ ప్రదర్శన,.. పలురకాల దేశభక్తి భావనలను విభిన్న భాషల చలనచిత్రాలకు చెందిన 75 ఫిల్మ్ పోస్టర్లు, ఫొటోగ్రాఫుల ద్వారా తెలియజెపుతుంది. ఈ ఎగ్జిబిషన్.ను మూడు విభాగాలుగా విభజించారు.: ‘సాంఘిక సంస్కరణల సినిమా’, ‘స్వాతంత్ర్య పోరాటంపై సినిమాలు’ ‘దైర్యసాహసాల సైనికులకు వందనం’ పేరిట మూడు విభాగాలను రూపొందించారు.
1921వ సంవత్సరానికి చెందిన భక్త విదుర్ మూకీ సినిమానుంచి, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పోరాటం స్ఫూర్తిగా ఇటీవల తెలుగులో వచ్చిన, సైరా నరసింహా రెడ్డి (2019) వరకూ 75 ఫొటోలను రూపొందించారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలపై సినిమాలను, దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, సామాజిక దురాచారాలపై విజయాన్ని, సరిహద్దుల రక్షణ విధుల్లోని వీరుల ధైర్యసాహసాలను వర్ణించే వివిధ బాషల చిత్రాలను ఇందులో పొందుపరిచారు. ఈ ఎగ్బిషన్.ను షేరింగ్ చేయడానికి, డౌన్ లోడింగ్.కు తగిన ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచారు.
https://www.nfai.gov.in/virtual-poster-exhibition.php అనే లింక్ ద్వారా ఎవరైనా ఎగ్జిబిషన్.ను చూడవచ్చు.
రాజ్యాంగం తయారీ గురించి:
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా, స్వాంతంత్ర్య పోరాటానికి సంబంధించిన వివిధ అంశాలపై పలు రకాల ఇ-బుక్స్.ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంవత్సరమంతా చేపడుతుంది. ఈ బుక్స్ పరంపరలో భాగంగా తొట్టతొలుతగా,.. ‘రాజ్యాంగం తయారీ’పై ఇ-బుక్.ను రూపొందించారు. దీని తర్వాత, దేశ సమగ్రత, స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళలు, గిరిజన ఉద్యమాలు, విప్లవాత్మక ఉద్యమాలు, గాంధేయ ఉద్యమాలు వంటి అంశాలపై కూడా ఇ.బుక్స్ రూపొందిస్తారు.
'రాజ్యాంగం తయారీ'పై రూపొందిన ఇ-బుక్,..రాజ్యాంగం రూపకల్పన గురించి తెలియజేస్తుంది. ఎంతో అరుదైన చిత్రాలను ఇందులో పొందుపరిచారు. ఆకాశవాణి లైబ్రరీలు, ఫిల్మ్ డివిజన్ల అభిలేఖగారాల్లోని వీడియోలను, ప్రసంగాల రికార్డులను చూసేందుకు వీలుగా ఇందులో తగిన లింక్ ఏర్పాట్లు ఉంటాయి.
ఇంటరాక్టివ్ క్విజ్ పోటీని కూడా ఇ-బుక్ లో పొందుపరిచారు. పాఠకుల ప్రమేయాన్ని మరింత పెంచేందుకు, పౌరులకు తగిన భాగస్వామ్యాన్ని కల్పించేందుకు క్విజ్.లో పది ప్రశ్నలు ఉంటాయి.
హిందీ, ఇంగ్లీష్ భాషలతోపాటుగా, 11 ఇతర భారతీయ భాషల్లో కూడా ఇ-బుక్ అందుబాటులో ఉంటుంది. (ఒడియా, మరాఠీ, అస్సామీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ వంటి భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.). ఇందుకు సంబంధించిన లింకులను స్థానిక విశ్వవిద్యాలకు, కళాశాలలకు, పాఠశాలలకు అందుబాటులో ఉంచుతారు. పి.ఐ.బి./ఆర్.ఒ.బి. కార్యాలయాలు వీటిని అందుబాటులో ఉంచుతాయి. తమకు సంబంధించిన సామాజిక మాధ్యమ వేదికల్లో కూడా వీటిని పొందుపరుస్తారు.
ఇందుకు సంబంధించిన లింక్.. https://constitution-of-india.in/
****
(Release ID: 1749756)
Visitor Counter : 205