ఆయుష్
మీడియాలో ఒక వర్గంలో ఆయుష్ 64పై దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
"అది వాస్తవాలను వక్రీకరించడం, విషయ పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం"
प्रविष्टि तिथि:
26 AUG 2021 10:49AM by PIB Hyderabad
గత కొద్దీ రోజులుగా కొన్ని మీడియా వర్గాలలో ఇంకా ప్రచురితం కానీ (సమకాలికుల సమీక్ష జరగని) ఒక చిన్న అధ్యయనం ఫలితాలను చూపి సాధారణంగా ఆయుర్వేదానికి వ్యతిరేకంగా మరియు ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారం జరుగుతోంది. ఆయుష్ 64ను కేంద్రంగా చేసుకొని ఏకపక్షంగా దుష్ప్రచారం సాగుతోంది. అయితే కోవిడ్ -19 రోగులకు నయం చేయడం ఆయుష్ 64 సమర్ధవంతంగా పనిచేసినట్లు అనేక అధ్యయనాలు, చికిత్సా సంబంధ పరీక్షలలో తేలింది.
ఆ వార్తా కథనాలలో చాలా చిన్న ప్రాథమిక అధ్యయనాన్ని, ఇంకా ప్రచురితం కాని ఒక పత్రాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఆ విధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ , అలోపతి మరియు ఆయుర్వేద పరిశోధకుల టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలను అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం అది. జైపూర్ కు చెందిన జాతీయ ఆయుర్వేద సంస్థ మరియు జోధ్ పూర్ కు చెందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ భాగస్వామ్యంలో జరిపిన అధ్యయనం అది. దానిని ఇంకా ప్రచురించక మీడియాలో వెల్లడించారు. ఈ రెండు సంస్థలు సంబంధిత క్షేత్రాలలో పరిశోధనలు చేయడంలో , రోగుల చికిత్సలో ఉత్తమమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. తమ అధ్యయనంపై తప్పుడు వార్తలను ప్రచురించడాన్ని ఖండిస్తున్నాయి.
ఈ సందర్బంగా డాక్టర్ జై కరణ్ చరణ్ పేరిట మీడియాలో ప్రచురితమైన తప్పుడు వ్యాఖ్యలను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. ఆ వ్యాఖ్యలను ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు. "ఆయుష్ 64 నిష్ఫలమైనదని, నిరుపయోగమైనదని నేనెప్పుడూ చెప్పలేదు. పైగా ఆయుష్ 64 ప్రాధమిక దశలో సమర్ధవంతంగా పనిచేసింది. ఆయుష్ 64 సురక్షితమైన ఔషధం. ప్రామాణిక చికిత్సతో సరిపోల్చదగినది. గణాంక రీత్యా 'తేడా లేదు' అంటే నిష్ఫలమైనదని, నిరుపయోగమైనదని కాదు దాని అర్ధం సమానం" అని డాక్టర్ వివరించారు.
ఇతరుల ప్రేరేపణతో రాసిన ఆ వార్తా కథనాలు వాస్తవాలను వక్రీకరించడం మరియు గ్లాసు సగం ఖాళీగా ఉన్నదని చెప్పడం వంటిదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా ప్రచురితం కానీ నివేదికలో అధ్యయనం ఫలితాలలో పేర్కొన్నారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులలో ఒక బృందానికి ఆయుష్ 64, మరొక నియంత్రిత బృందానికి ఇతర చికిత్స చేయడం జరిగింది. ఆ తరువాత ఐదవ రోజున ఆర్ టి - పిసి ఆర్ పరీక్ష చేయగా రెండు బృందాల వారికి దాదాపు సమాన శాతాలలో నెగెటివ్ వచ్చింది. అయితే ఈ తేడా గణాంక రీత్యా చాలా స్వల్పం. అంతేకాక అంచనా సమయంలో ఏ బృందంలో కూడా ప్రతికూల పరిణామాలు జరుగలేదు. "
ఆయుష్ 64 సురక్షితమైన ఔషధం అని, ప్రామాణిక చికిత్సకు సరితూగేదని ఈ అధ్యయనం ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దానికి సంబందించిన మరిన్ని వివరాలను https://doi.org/10.1101/2021.06.12.21258345 లింక్ లో దర్శించి తెలుసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో నమూనాను తీసుకొని విస్తృత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని కూడా దానిలో పేర్కొన్నారు.
వార్తా సమాచారాన్ని నిష్పక్షపాతంగా అందించాలనే నియమానికి విరుద్ధంగా ఈ వార్తా కథనాలను ప్రచురించడం జరిగింది. ప్రయోగాత్మకంగా కొద్ది సంఖ్యలో ఉన్న నమూనాతో జరిపిన అధ్యయనం ఫలితాలను సాధారణం చేయడం తప్పు. ఆ జర్నలిస్టు సంబంధం లేని విషయాలను రాసి ఔషధం నిష్పలమైనదని, నిరుపయోగమైనదని పేర్కొన్నారు. ఆ మందు వల్ల ఉపశమనం శాతం ఎక్కువనీ, తీసుకున్న నమూనా కొద్దిపాటిది కావడం వల్ల మందు సామర్ధ్యాన్ని నిశ్చయంగా తెలుసుకొనలేకపోయామని, గణాంకరీత్యా అది అల్పమని అధ్యయనం ఫలితాలలో పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ఉన్న నమూనాతో మరియు బహుళచోట్ల జరిపిన అధ్యయనం ప్రామాణిక చికిత్సలో ఆ మందు సామర్ధ్యం స్థిరమైంది. అధ్యయనం ఫలితాలు తుది నివేదికలో విస్తృతమైన నమూనాతో అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1749755)
आगंतुक पटल : 207