కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఒడిశా మోసం కేసులలో పోస్టల్ శాఖ చర్యలు

బాధిత వ్యక్తులకు 30 రోజుల్లో న్యాయం : పోస్టల్ కార్యదర్శి శ్రీ వినీత్ పాండే

లాచి పేట పోస్ట్ ఆఫీస్ కేసులో శాఖాపరమైన విచారణ ఇప్పటికే పూర్తయింది

Posted On: 27 AUG 2021 3:13PM by PIB Hyderabad

పోస్టల్ వ్యవస్థ పై ప్రజలు చూపిస్తున్న విశ్వాసం కొనసాగేలా చూస్తామని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ  పోస్టల్    శాఖ కార్యదర్శి శ్రీ వినీత్ పాండే అన్నారు.పోస్టల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి అవినీతి, మోసాలకు తావు లేకుండా చూస్తామని ఆయన అన్నారు. ఈ రోజు ఇక్కడ  విలేఖరుల సమావేశంలో మాట్లాడిన  శ్రీ వినీత్ పాండే ఒడిశాలో ఇటీవల వెలుగుచూసిన మోసం కేసులలో  శాఖ తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశంలోసీనియర్ డిడిజి (విజిలెన్స్) , చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ వినయ ప్రకాష్ సింగ్ ఇతర సీనియర్ పోస్ట్ అధికారులు ఒడిశా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ శ్రీ సువేందు స్వైన్ ఒడిశా నుంచి విర్చువల్ విధానంలో పాల్గొన్నారు. 

2021 ఆగష్టు21 న కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వే శాఖ మంత్రి  శ్రీ అశ్వినీ వైష్ణ కోరాపుట్ లో పర్యటించినప్పుడు ఆయన దృష్టికి కోరాపుట్ డివిజన్ లోని లేచి పేట,మల్కనగిరిబీజంగివాడ పోస్ట్ ఆఫీసుల్లో జరిగిన  మూడు మోసం కేసులను ప్రజలు,  ప్రసార వ్యవస్థల ప్రతినిధులు తీసుకుని వచ్చారు.

ఈ మూడు కేసుల్లో 2.44 కోట్ల రూపాయల లావాదేవీలు ఉన్నాయని శ్రీ పాండే తెలిపారు. సంబంధిత పోస్ట్‌మాస్టర్‌లందరూ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు.   లాచిపేట మరియు మల్కన్ గిరి కాలనీ పోస్టాఫీసులలో శ్రీ బిశ్వనాథ్ పొడియామి పాల్పడిన  మోసాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.భేజంగివాడ  బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ శ్రీ మన పూజారిని పోలీసులు అరెస్టు చేసి ఐపీసీ  సెక్షన్ 408, 409, 420, 468, 471 మరియు 473 కింద కేసు నమోదు చేశారు. విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సీబీఐ, పోలీసులను మంత్రిత్వ శాఖ కోరింది. నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. 

లాచి పేట పోస్ట్ ఆఫీస్ కేసులో శాఖాపరమైన విచారణ  ఇప్పటికే పూర్తయింది. మిగిలిన  రెండు కేసులలో ప్రాథమిక విచారణ పూర్తి అయ్యింది.  నెల రోజుల్లో పూర్తి విచారణ పూర్తి అవుతుంది. ప్రాథమిక నేరస్థులపై కఠిన చర్యలను తీసుకుంటామని శ్రీ పాండే తెలిపారు.ఈ మోసాలకు సహకరించిన వారందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

బాధిత ప్రజల నుంచి  క్లెయిమ్‌లను పొందడానికి చర్యలు ప్రారంభం అయ్యాయి.   దీని కోసం ఒడిశా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఇప్పటికే ప్రెస్ నోట్ జారీ చేశారు.  2021మే 27 న తపాలా విభాగంన్యూఢిల్లీ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా 30 రోజుల్లోసమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు.   ప్రభావిత డిపాజిట్ దారులు   https: // utilities.cept. gov.in//dop/pdfbind.ashx?id= 5602 ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చును. 

 

****

 

 



(Release ID: 1749754) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi , Tamil