గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయపూర్‌లో నూతన సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి
Posted On:
27 AUG 2021 2:14PM by PIB Hyderabad
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయపూర్‌లో నూతన సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సిపిడబ్ల్యూడి) ఈ భవన నిర్మాణాన్ని రూ. 66.91 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది 15 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు వసతి కల్పిస్తుంది, ఏటా రూ. 4 కోట్ల అద్దె డబ్బు ఆదా అవుతుంది.
ఈ సందర్భంగా శ్రీ పూరి మాట్లాడుతూ, 100 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పైకప్పు సోలార్ ప్యానెల్‌లు, ఎల్ఈడి ఫిట్టింగ్‌లు, వనరులను సంరక్షించడంలో సహాయపడే హరిత, ఇంధన-పొదుపు చర్యలను భవనంలో చేపట్టినందుకు సిపిడబ్ల్యూడిని ప్రశంసించారు. సిపిడబ్ల్యుడి గత 167 సంవత్సరాలుగా జాతి నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని ఆయన అన్నారు. గత 7 సంవత్సరాలలో, డిపార్ట్‌మెంట్ నాణ్యమైన నిర్మాణాలను నిర్మించడమే కాకుండా వాటిని నిర్ణీత సమయంలో, మంజూరు చేసిన బడ్జెట్‌లో పూర్తి చేయడంపై దృష్టి సారించింది. అదే పద్ధతిని ఇతర చోట్ల కూడా ఉపయోగించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా నిర్మాణ సాంకేతికతలను చేర్చాలని, పర్యావరణ అనుకూల స్థానిక పదార్థాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
నవ రాయపూర్‌లోని కొత్త సెంట్రల్ సెక్రటేరియట్ భవనం 11,476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 5 అంతస్తులు, బేస్‌మెంట్‌తో విస్తరించి ఉంది. ఇది 800 అధికారులకు కార్యాలయ వసతి కల్పించడమే కాకుండా, 192 వాహనాల పార్కింగ్ సామర్ధ్యం కలిగి ఉంది. ఈ భవనం 3-స్టార్ 'గృహ' రేటింగ్‌ను కలిగి ఉంది, ఎందుకంటే ఇది పర్యావరణ అనుకూలమైన, నిలకడ లక్షణాలను కలిగి ఉంది. ఇది జీపీఆర్ఏ వసతి ప్రాంగణానికి కేవలం 1.5 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వ అధికారులకు రాకపోకలకు చాలా సమయం ఆదా చేస్తుంది.
***
(Release ID: 1749656)
Visitor Counter : 143