పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఉడాన్ కింద జామ్‌నగర్ - బెంగళూరు - హైదరాబాద్ మార్గంలో మొదటి డైరెక్ట్విమానాన్ని ప్రారంభించారు
Posted On:
26 AUG 2021 7:30PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్(రిటైర్డ్)తో కలిసి భారత ప్రభుత్వం యొక్క RCS-UDAN (ప్రాంతీయ అనుసంధాన పథకం- ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద జామ్‌నగర్ (గుజరాత్), బెంగళూరు (కర్ణాటక) & హైదరాబాద్ (తెలంగాణ) మధ్య మొదటి ప్రత్యక్ష విమాన సర్వీసులను వర్చువల్ ప్రారంభించారు. గుజరాత్ పర్యాటకశాఖ మంత్రి జవహర్భాయ్ చావ్డా, గుజరాత్ రాష్ట్ర పౌర విమానయానశాఖ మంత్రి భూపేంద్ర సిన్హ్ చుడసామ, జామ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు పూనంబెన్ హేమత్భాయ్ మాదం, ఎమ్మెల్యేలు ఆర్సీ ఫల్దు, రాఘవ్జీ హంసరాజ్ భాయ్ పటేల్తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ, విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విమాన సర్వీసుల ప్రారంభోత్సవంతో దేశంలోని ముంబై(మహారాష్ట్ర), బెంగళూరు(కర్ణాటక), హైదరాబాద్(తెలంగాణ) నగరాలతో జామ్నగర్కు వైమానిక అనుసంధానం పెరుగుతుంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ.. ‘‘ఉడాన్ కింద జామ్‌నగర్ నుండి ప్రాంతీయ అనుసంధానతను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు నుండి, M/s స్టార్ ఎయిర్ మొదటిసారి జామ్‌నగర్ మరియు బెంగళూరు , జామ్నగర్మరియు హైదరాబాద్ మధ్య ఉడాన్ పథకంలోభాగంగా ప్రత్యక్ష విమానాలను నడుపుతుంది. జామ్‌నగర్ పట్టణం వాణిజ్యం, సాంస్కృతిక మరియు మతపరమైన కేంద్రాల సంపూర్ణ సమ్మేళనం. అంతేకాకుండా.. ఉడాన్ కింద గుజరాత్ నుండి మరో 10 అదనపు విమానాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించేందుకు నేను సంతోషిస్తున్నాను. మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన ఉడాన్ పథకం దేశ పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది’’
100 కి పైగా దేవాలయాలు ఉన్నందున జామ్‌నగర్‌ను "ఛోటి కాశి" అని కూడా పిలుస్తారు. జామ్‌నగర్ నాలుగు పాలరాతి జైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. వర్ధమాన్ షా టెంపుల్, రైసీ షా టెంపుల్, షేత్ టెంపుల్ మరియు వసుపూజ్య స్వామి టెంపుల్. ఇవన్నీ 1574 మరియు 1622 మధ్య నిర్మించబడ్డాయి. ఇంకా చార్ధామ్‌లలో ఒకటైన - మోక్షపురి నగరం - ద్వారకకు జామ్‌నగర్‌ను గేట్‌వే నగరం అని పిలుస్తారు.
జామ్నగర్ పట్టణాన్ని వరల్డ్ ఆయిల్ సిటీ అని కూడా పిలుస్తారు. అందుకు కారణం.. మోతి ఖావ్దీ గ్రామానికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఉంది. అంతేకాకుండా భారతదేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ కూడా వదినార్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇత్తడి వస్తువులను తయారుచేసేసుమారు 5వేల పెద్దస్థాయి, 10వేల చిన్నస్థాయి వర్క్ షాప్లు జామ్నగర్లో ఉండడం వల్ల ఈ నగరాన్ని బ్రాస్సిటీ అని కూడా పిలిచేవారు. ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా ఇత్తడి వస్తువుల ఉత్పత్తి నమోదైంది.
ఇప్పటిదాకా ఎయిర్ లేదా రైలు కనెక్టివిటీ నేరుగా లేనందున ప్రజలు ఈ నగరాలకు చేరుకునేందుకు సుధీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చేది. జామ్నగర్మరియు బెంగళూరు మధ్య డైరెక్ట్ విమానం అందుబాటులోకి రావడంతో ముంబై నుంచి కనెక్టింగ్ విమానాను ఉపయోగించుకొని చేసే ప్రయాణం 7 గంటల నుంచి 135 నిమిషాలకు తగ్గుతుంది. ఈ రెండు నగరాల మధ్య రహదారి ద్వారా ప్రత్యామ్నాయ ప్రయాణానికి దాదాపు 30 గంటలు పడుతుంది. రైలు ప్రయాణానికి సుమారు 20 గంటలు పడుతుంది.
ఇక జామ్నగర్ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి సుమారు ఒకరోజు కంటే ఎక్కువ సమయం పట్టేది. ఈ రెండు నగరాల మధ్య ప్రత్యక్ష విమానాల కనెక్టివిటీ లేనందున, అనుసంధాన విమానాలను ఉపయోగించి విమానాల ద్వారా ప్రయాణానికి 6 గంటలకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు, స్థానికులు విమాన ప్రయాణాన్ని ఎంచుకోవడం వల్ల కేవలం 130 నిమిషాల్లో రెండు నగరాల మధ్య సులభంగా ప్రయాణించవచ్చు.
ఉడాన్3 బిడ్డింగ్ ప్రక్రియలో స్టార్ ఎయిర్కు పై మార్గాలను కేటాయించడం జరిగింది. విమానయాన సంస్థలు ఛార్జీలను సరసమైన మిరయు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉడాన్ పథకం కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ ఈ మార్గంలో వారానికి మూడుసార్లు విమానాలను నడుపుతుంది మరియు దాని 50 -సీటర్ ఎంబ్రేర్ ERJ-145 విమానాలను సిద్ధంగా ఉంచుతుంది. ఈ మార్గంలో రవాణా సేవల ద్వారా విమానయాన సంస్థ 32 వ ఉడాన్ మార్గాన్ని ప్రారంభించిన మైలురాయిని చేరింది.
ఇప్పటి వరకు, 369 మార్గాలు మరియు 60 విమానాశ్రయాలు (5 హెలీపోర్ట్‌లు మరియు 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా) ఉడాన్ పథకం కింద పనిచేస్తున్నాయి.
Flt No:
|
Sector
|
Dep
|
Arrival
|
Frequency
|
Aircraft
|
OG131
|
Bengaluru - Jamnagar
|
06:35
|
08:50
|
Tuesday, Thursday & Saturday
|
ERJ145
|
OG149
|
Jamnagar - Hyderabad
|
09:15
|
11:30
|
Tuesday, Thursday & Saturday
|
ERJ145
|
OG150
|
Hyderabad - Jamnagar
|
15:15
|
17:20
|
Tuesday, Thursday & Saturday
|
ERJ145
|
OG132
|
Jamnagar - Bengaluru
|
17:45
|
20:00
|
Tuesday, Thursday & Saturday
|
ERJ145
|
(Release ID: 1749626)
Visitor Counter : 237