పర్యటక మంత్రిత్వ శాఖ

"లడాఖ్: కొత్త ప్రారంభం, కొత్త లక్ష్యాలు" అనే శీర్షికతో 'లే' లో ప్రారంభమైన - మూడు రోజుల మెగా టూరిజం ఈవెంట్


లడాఖ్‌లో సాంస్కృతిక మరియు వారసత్వ పర్యాటకం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది : శ్రీ రాధాకృష్ణ మాథుర్


పర్యాటకానికి లడాఖ్ వంటి ప్రదేశాలకు కమ్యూనిటీ భాగస్వామ్యం చాలా ముఖ్యం : శ్రీ జి. కిషన్ రెడ్డి


లడాక్ ప్రాంత సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించి "లడాఖ్ కోసం ఒక పర్యాటక విజన్" పత్రం ఆవిష్కరించబడింది

Posted On: 26 AUG 2021 4:44PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు :

*          సాహసం, సంస్కృతి మరియు బాధ్యతాయుతమైన పర్యాటక అంశాలపై దృష్టి సారించి లడాఖ్‌ ని ఒక పర్యాటక  ప్రాంతంగా ప్రోత్సహించడం ఈ  కార్యక్రమం యొక్క లక్ష్యం 

*         పరిశ్రమ వాటాదారులకు స్వదేశీ ఉత్పత్తి పరిజ్ఞానాన్ని అందించడం, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి టూర్ ఆపరేటర్లు / కొనుగోలుదారులతో పరస్పర చర్య కోసం స్థానిక వాటాదారులకు ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

*          మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పర్యాటక ఉత్సవంలో భాగంగా -  లడాఖ్ లో అందుబాటులో ఉండే పర్యాటక సౌకర్యాలు, పర్యాటక ఉత్పత్తులను తెలియజేసే విధంగా ఎగ్జిబిషన్,  ప్యానెల్ చర్చలు,  బి-2-బి సమావేశాలు, సాంకేతిక పర్యటనలు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి.

"లడాఖ్ : కొత్త ప్రారంభం, కొత్త లక్ష్యాలు" అనే శీర్షికతో లే లో ఈ రోజు ప్రారంభమైన మెగా టూరిజం ఈవెంట్ లో, లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ రాధా కృష్ణ మాథుర్; కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు.   శ్రీ జి. కిషన్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  లడాక్ ప్రాంత సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించి, రూపొందించిన "లడాఖ్ కోసం ఒక పర్యాటక విజన్" అనే పత్రాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.   సుస్థిరమైన పర్యావరణ పద్ధతుల నేపథ్యంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా అందుబాటులో ఉండే వస్తు సామాగ్రి, మానవ వనరుల ఆధారంగా ఈ పత్రాన్ని రూపొందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో - లడాఖ్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ జమ్యాంగ్ ట్సెరింగ్ నాంగ్యాల్;  లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంత పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ కె మెహబూబ్ అలీ ఖాన్;  భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ అరవింద్ సింగ్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

లడాఖ్ కేంద్రపాలిత ప్రాంత పర్యాటక శాఖ మరియు అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏ.టి.ఓ.ఏ.ఐ) సహకారంతో,  "లడాఖ్: కొత్త ప్రారంభం, కొత్త లక్ష్యాలు" అనే శీర్షికతో, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ, ఈ కార్యక్రమాన్ని, 2021 ఆగష్టు 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తోంది.  సాహసం, సంస్కృతి మరియు బాధ్యతాయుతమైన పర్యాటక అంశాలపై దృష్టి సారించి లడాఖ్‌ని ఒక పర్యాటక  ప్రాంతంగా ప్రోత్సహించడం ఈ  కార్యక్రమం యొక్క లక్ష్యం.   పరిశ్రమ వాటాదారులకు స్వదేశీ ఉత్పత్తి పరిజ్ఞానాన్ని అందించడం, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి టూర్ ఆపరేటర్లు / కొనుగోలుదారులతో పరస్పర చర్య కోసం స్థానిక వాటాదారులకు ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ రాధాకృష్ణ మాథుర్ మాట్లాడుతూ, సందర్శకులకు లడాఖ్ అందించే,  శీతాకాల పర్యాటకం, సైన్స్ ఆధారిత పర్యాటకం మొదలైన కొత్త పర్యాటక ఉత్పత్తులు/సదుపాయాల గురించి తెలియజేశారు.   లడఖ్‌ సందర్శించే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి సాంస్కృతిక మరియు వారసత్వ పర్యాటకం  అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, శ్రీ మాథుర్, చెప్పారు. లడాఖ్ కోసం అనుసరిస్తున్న కర్బన తటస్థ విధానం గురించి కూడా శ్రీ మాథుర్, ఈ సందర్భంగా, ప్రస్తావించారు.   బౌద్ధ మార్గాన్ని అనుసరించడం లడాఖ్ యొక్క సహజమైన, ప్రత్యక్ష సాంస్కృతిక వారసత్వంగా గుర్తించినట్లు యునెస్కో పేర్కొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖను, అభినందించారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగిస్తూ, గత 40 సంవత్సరాలలో లడాఖ్ లో పర్యాటకం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.  లడాఖ్ 'ల్యాండ్ ఆఫ్ హై పాసెస్" గా పేరుగాంచిందనీ,  ప్రకృతి అందాల ఆనందం నుండి ట్రెక్కర్లు, బైకర్లు, సైక్లిస్టులు, అధిరోహకులు మొదలైన వారికి సాహస అవకాశాల వరకు ప్రతి పర్యాటకులకు ఏదో ఒక మంచి అనుభూతిని కలుగచేస్తుందనీ, ఆయన చెప్పారు.  అదే సమయంలో, హేమిస్, ఆల్చి, తిక్సే మఠాలు లడాఖ్ ను ఒక సాంస్కృతిక మరియు వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాయి. లడాఖ్ యొక్క భారీ పర్యాటక సామర్థ్యాన్ని పెంచడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖ 'లడాఖ్: నూతన ప్రారంభం నూతన లక్ష్యాలు' అనే  కార్యక్రమాన్ని ప్రారంభించిందనీ, ఇది దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన టూర్ ఆపరేటర్లు, వినియోగదారులు, లడాఖ్ కు చెందిన స్థానికి భాగస్వాములతో సంప్రదింపులు జరిపే వేదికగ వ్యవహరిస్తుందని కూడా కేంద్రమంత్రి పేర్కొన్నారు.   లడాఖ్ లో టూరిజం అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు వివరంగా తెలియజేసే విధంగా, పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ ‘లడాఖ్ విజన్ డాక్యుమెంట్’ ను సిద్ధం చేసిందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం టూరిస్ట్ వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ మల్టీమీడియా షోతో పాటు ఇతర పర్యాటక ఆకర్షణల కోసం 23.21 కోట్ల రూపాయలు సమకూర్చింది, చౌకీ హాంగ్ విహారా ప్రాజెక్ట్‌ను ప్రసాద్ (పి.ఆర్.ఏ.ఎస్.హెచ్.ఏ.డి) పథకం కింద అభివృద్ధి చేసింది.  లడాఖ్  వంటి ప్రదేశాలలో పర్యాటకం కోసం కమ్యూనిటీ పార్టనర్‌ షిప్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం అని ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  వృత్తి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సృష్టించడంపై దృష్టి సారించడంతో పాటు మొత్తం పర్యాటక అభివృద్ధిని పెంపొందించాల్సిన అవసరాన్ని శ్రీరెడ్డి నొక్కి చెప్పారు.  భారతదేశంలో పర్యాటక రంగం ఒక అతిపెద్ద ఉపాధి సృష్టికర్తల్లో ఒకటని, మంత్రి పేర్కొన్నారు.  సేవల పరిశ్రమ లోని  12 ఛాంపియన్ సెక్టార్‌ లలో పర్యాటకం ఒకటిగా ప్రధానమంత్రి అభివర్ణించారని ఆయన తెలియజేశారు. 

లడాఖ్ పార్లమెంటు సభ్యుడు శ్రీ జమ్యాంగ్ ట్సెరింగ్ నామ్‌గ్యాల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం లడాఖ్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఈ కేంద్రపాలిత ప్రాంత ఆర్థిక వ్యవస్థను కూడా పెంపొందిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.  ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ఎలా సృష్టించవచ్చో, ఈ కార్యక్రమం తెలియజేసిందని, ఆయన అన్నారు.   లడఖ్‌ ను టూరిజం కోసం ఏడాది పొడవునా గమ్యస్థానంగా మార్చాలనే తమ ఆలోచనను పంచుకుంటూ,  లడఖ్‌ లో శీతాకాల పర్యాటకం, మరియు శీతాకాలపు క్రీడల సామర్థ్యాన్ని, శ్రీ నామ్‌ గ్యాల్,  నొక్కి చెప్పారు.  ఒక నెల వ్యవధిలో జన్ స్కార్ వింటర్ టూరిజం ఫెస్టివల్ మరియు వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆయన నొక్కిచెప్పారు. కార్గిల్‌ లో కూడా పర్యాటకాన్ని పెంపొందించాలని, ఆయన కోరారు.

సాహస క్రీడలకు లడాఖ్ స్వర్గం లాంటిదని, భారత ప్రభుత్వ  పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ అరవింద్ సింగ్ అభివర్ణించారు.   ఇక్కడ గట్టిగా ఉండే భూ భాగం; ప్రవహించే నదులు,  ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్, పర్వతారోహణ,  బైకింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించడానికి మరిన్ని అవకాశాలను కల్పిస్తాయి.   లడాఖ్ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది.  కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని శ్రీ అరవింద్ అన్నారు.  ఏదేమైనా, రికవరీ సంకేతాలు కనిపించడం శుభ సూచకం. ఈ రికవరీ దశలో లడాఖ్ ప్రధాన కదలికలలో ఒకటిగా ఉంది, దీనితో పాటు అత్యంత ఇష్టపడే గమ్యస్థానాలలో లడాఖ్ ఒకటిగా నిలిచింది.   శ్రీ అరవింద్ ఇంకా మాట్లాడుతూ, మేము పర్యాటకాన్ని పునః ప్రారంభించినప్పుడు, మంత్రిత్వ శాఖ కోవిడ్-19 భద్రత మరియు పరిశుభ్రత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లో అంచనా, అవగాహన మరియు శిక్షణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది.  ఎస్.ఏ.ఏ.టి.హెచ్.ఐ. వ్యవస్థ కింద, ఇంతవరకు, 10,000 కంటే ఎక్కువ వసతి యూనిట్లు  నమోదు చేయడం జరిగింది.   జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో లడఖ్‌పై ఒక ప్రత్యేక వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ "దేఖో అప్నా దేశ్ వంటి వివిధ ప్రచారాలు మరియు కార్యక్రమాల ద్వారా లడాఖ్ ను ప్రోత్సహిస్తోంది. 

లడాఖ్ కేంద్రపాలిత ప్రాంత పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ కె. మెహబూబ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, "లడాఖ్ కోసం ఒక టూరిజం విజన్" పత్రాన్ని రూపొందించినందుకు, కేంద్ర  పర్యాటక మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.   కేంద్రపాలిత ప్రాంతం కోసం ఒక పర్యాటక విధానాన్ని ఖరారు చేయడంలో ఈ పత్రం సహాయపడుతుందని కూడా ఆయన చెప్పారు.  గణాంకాల ప్రకారం లడాఖ్ జి.డి.పి. లో 50 శాతం  పర్యాటక రంగంపై ఆధారపడి ఉందనీ, ఈ ప్రదేశానికి దాని స్వంత విశిష్టత ఉందనీ, శ్రీ మెహబూబ్ అలీ ఖాన్ పేర్కొన్నారు.    లడాఖ్ లో పర్యాటక విధానం కోసం నిపుణులైన కన్సల్టెంట్లను నియమించుకుంటామనీ, త్వరలో లడఖ్‌ లో టూరిజం పాలసీ వస్తుందని, ఆయన చెప్పారు. 

లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారుడు, శ్రీ ఉమాంగ్ నరూలా, మాట్లాడుతూ, విజన్ డాక్యుమెంట్ తయారు చేసినందుకు, పర్యాటక మంత్రిత్వ శాఖను,  అభినందించారు.  కేంద్ర పాలిత ప్రాంతం కోసం పర్యాటక విధానాన్ని ఖరారు చేయడానికి, ఈ విజన్ డాక్యుమెంట్, మంచి ఆధారాన్ని అందిస్తుంది.  లడక్  ఒక పర్యాటక విధానాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.  వివిధ కేంద్ర పథకాల ద్వారా సహాయం అందిస్తున్నందుకు, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు కూడా శ్రీ నరూల కృతజ్ఞతలు తెలిపారు.  శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, సున్నితమైన విధానంలో హోమ్‌స్టేను ఏర్పాటు చేశామనీ, అదేవిధంగా, శీతాకాల సమావేశాన్ని కూడా నిర్వహించామని ఆయన, చెప్పారు.  బాధ్యతాయుతమైన టూరిజం కోసం స్వీయ నియంత్రణను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా, ఆయన సూచించారు.

ఉత్తమ విలువలతో, తక్కువ ప్రభావం గల పర్యాటక గమ్యస్థానంగా లడాఖ్ ను ప్రోత్సహిస్తూ, స్థానిక సమాజానికి స్థిరమైన మరియు సమగ్ర వృద్ధిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో "విజన్ డాక్యుమెంట్" ను రూపొందించడం జరిగింది.   పర్యాటక పరిశ్రమ యొక్క వాటాదారుల అంచనాలతో పాటు స్థానిక జనాభా, వారి ఆర్థిక, సామాజిక అవసరాలను ఈ "విజన్ డాక్యుమెంట్" ప్రతిబింబిస్తుంది.  సౌలభ్యం మరియు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ అభ్యాసాలను సమగ్రపరచడం ద్వారా, ప్రపంచంలోని ఉత్తమ ప్రదేశాలతో పోల్చదగిన పర్యాటక అనుభవాలను లడాఖ్ లో  సృష్టించడమే ఈ డాక్యుమెంట్ లక్ష్యం.  డాక్యుమెంట్‌ లోని సూచనలు నియంత్రించబడిన, పర్యవేక్షించబడిన పర్యాటకం ద్వారా స్థానిక పర్యావరణం పైన కానీ, జనాభా పైన కానీ,  పర్యాటకం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు.  లడాఖ్‌ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా, స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు, లడాఖ్ సంస్కృతి, ఉత్పత్తులను భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు పరిచయం చేసి, ప్రోత్సహించాలని, ఈ డాక్యుమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రారంభ సదస్సు అనంతరం నిర్వహించిన ప్యానెల్ చర్చల్లో -  అభివృద్ధి, అనుసంధానత, మౌలిక సదుపాయాలు, స్థిరమైన, కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి కోసం కొత్త ప్రాంతాలపై దృష్టి సారించి లడఖ్‌లో పర్యాటక సమగ్ర అభివృద్ధి; "లే" లో అడ్వెంచర్ టూరిజం యొక్క అవకాశాలు మరియు సవాళ్లు;  హోమ్‌-స్టే టూరిజం ద్వారా కొత్త ప్రాంతాలను గుర్తించే అవకాశం ఉండడంతో, స్థానిక సమాజంతో పాటు మహిళలకు సాధికారత కల్పించడంలో హోమ్‌-స్టే టూరిజం పోషించిన పాత్ర వంటి వివిధ అంశాలపై చర్చ జరిగింది. 

భారతదేశంలో పర్యాటక రంగం మొత్తం అభివృద్ధిలో దేశీయ పర్యాటకం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.  దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వివిధ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.  పర్యాటక గమ్యస్థానాలు, ఉత్పత్తుల గురించి అవగాహన పెంచడంతో పాటు,  ఈశాన్య ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ వంటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా, ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 

కోవిడ్-19 మహమ్మారి ఇంతకూ ముందెన్నడూ లేని విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది, స్తంభింపచేసింది.  ఏదేమైనా, కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల రాకపోకలు ప్రారంభమయ్యాయి .  దేశీయ టూరిజం విభాగంలో సందర్శకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది.  విమాన, రైలు, రహదారి మార్గాల్లో, ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది.  పరిశ్రమ వాటాదారుల భాగస్వామ్యంతో మంత్రిత్వ శాఖ కూడా వేగంగా పర్యాటకాన్నిప్రోత్సహించడం ప్రారంభించింది.  జాతీయ , అంతర్జాతీయ మార్కెట్లలో లడాఖ్‌ పై ఒక ప్రత్యేక వెబినార్‌లో నిర్వహించిన, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ,  "దేఖో-అప్నా-దేశ్" వంటి వివిధ ప్రచారాలు మరియు కార్యక్రమాల ద్వారా లడఖ్‌ను ప్రోత్సహిస్తోంది.   "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" వెబ్‌-సైట్, మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమ వేదికలు, ప్రకటనల ముద్రణ మొదలైన వాటి ద్వారా కూడా లడాఖ్ ప్రాంతంపై  ప్రచారం కొనసాగుతోంది. 

అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు; టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, దౌత్యవేత్తలు, హోమ్‌స్టే యజమానులు, భారత ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు, లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంత సీనియర్ అధికారులు, మీడియా ప్రతినిధులతో కలిపి మొత్తం సుమారుగా 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పర్యాటక ఉత్సవంలో భాగంగా -  లడాఖ్ లో అందుబాటులో ఉండే పర్యాటక సౌకర్యాలు, పర్యాటక ఉత్పత్తులను తెలియజేసే విధంగా ఎగ్జిబిషన్,  ప్యానెల్ చర్చలు,  బి-2-బి సమావేశాలు, సాంకేతిక పర్యటనలు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి.

*****



(Release ID: 1749477) Visitor Counter : 192