పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో విమానయాన మౌలిక సదుపాయాల బలోపేతం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా లేఖ

प्रविष्टि तिथि: 26 AUG 2021 8:01PM by PIB Hyderabad

గుజరాత్‌లో విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీకి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా లేఖ రాశారు. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి తగ్గట్లుగా వచ్చే 4-5 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు రూ.20,000 కోట్లను మంత్రిత్వ శాఖ ఖర్చు చేస్తోంది.  

    గుజరాత్‌లో విమానయాన రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపుతున్న ఈ క్రింది సమస్యలను శ్రీ సింధియా శ్రీ రూపానీ దృష్టికి తీసుకొచ్చారు:

* ఏబీ-320 రకం విమానాల నిర్వహణకు అనువుగా మార్చడానికి భావ్‌నగర్ విమానాశ్రయానికి 490.36 ఎకరాలు అవసరం.
* నగరం వైపు మౌలిక సదుపాయాల అభివృద్ధికి జామ్‌నగర్ విమానాశ్రయం వద్ద 17.38 ఎకరాలు అవసరం.
* ఏబీ-320 రకం విమానాల నిర్వహణకు అనువుగా కాండ్లా విమానాశ్రయాన్ని మార్చడానికి 322.85 ఎకరాలు అవసరం.
* రన్‌ వేను విస్తరించడానికి, ఏబీ-320 రకం విమానాల నిర్వహణకు అనుకూలంగా మార్చడానికి పోర్‌బందర్‌ విమానాశ్రయానికి 434.5 ఎకరాలు అవసరం.
* ప్రాథమిక అవసరాలు, సమాంతర టాక్సీ ట్రాక్ కోసం వడోదర విమానాశ్రయానికి 18.33 ఎకరాలు అవసరం.
* క్యాట్‌-I అప్రోచ్ లైటింగ్ వ్యవస్థ, రన్‌ వే పొడిగింపు కోసం సూరత్‌ విమానాశ్రయానికి 96.93 ఎకరాల భూమి అవసరం. 2వ రన్‌వే అభివృద్ధి కోసం 2100 ఎకరాల భూమిని కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి అభ్యర్థించారు.
* సబర్మతి రివర్ ఫ్రంట్, కెవాడియా మధ్య ఆగిన సీ ప్లేన్‌ కార్యకలాపాల పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
* 'రీజినల్‌ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్' (రాఫ్ట్‌)లో వీజీఎఫ్‌ వాటాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.47 లక్షలు బకాయి ఉంది.

***


(रिलीज़ आईडी: 1749403) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी