వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖ‌రీఫ్ మార్కెట్ సీజ‌న్ సేక‌ర‌ణ ద్వారా 129.03 ల‌క్ష‌ల మంది అన్న‌దాత‌ల‌కు లబ్ధి గ‌తంలో ఎన్న‌డూ లేని స్థాయికి చేరుకున్న ధాన్య సేక‌ర‌ణ‌

Posted On: 24 AUG 2021 6:23PM by PIB Hyderabad

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా దేశంలో ధాన్య సేక‌ర‌ణ జ‌రిగింది. గ‌త ఏడాది అంటే 2019-20 ఖ‌రీఫ్ మార్కెట్ సీజ‌న్ లో చేసిన 773.45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కంటే అధికంగా ఈ సారి సేక‌ర‌ణ చేయ‌డం జ‌రిగింది. దీని ద్వారా 129.03 ల‌క్ష‌ల మంది అన్న‌దాత‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరింది. క‌నీస మ‌ద్ద‌తు ద్వారా చేసిన ఈ సేక‌ర‌ణ కార‌ణంగా రైతుల‌కు రూ. 1, 64, 951. 77 కోట్ల చెల్లింపులు జ‌రిగాయి.
దేశ‌వ్యాప్తంగా 2020-21 ఖ‌రీఫ్ సీజ‌న్ కు గాను సేక‌రణ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతోంది. ఈ సీజ‌న్లో 707.69 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఖ‌రీఫ్ ధాన్యాన్ని 165.99 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ర‌బీ పంట ధాన్యాన్ని సేక‌ర‌రించ‌డం జ‌రిగింది. ఈ గ‌ణాంకాలు ఆగ‌స్టు 23 నాటికి న‌మోద‌య్యాయి. ఇదే స‌మయానికి గ‌త ఏడాది 763.01 ల‌క్ష‌ల మెట్రిట్ ట‌న్నుల సేక‌ర‌ణ జ‌రిగ‌డం గ‌మ‌నార్హం. 

గోధుమ‌ల సేక‌ర‌ణ‌కు సంబంధించిన 2021-22 ర‌బీ మార్కెట్ సీజ‌న్ ముగిసింది ఇంత‌వ‌ర‌కూ అంటే ఆగస్టు 18 నాటికి 433.44 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ పంట‌ను సేక‌రించ‌డం జ‌రిగింది. ఇది గ‌తంతో పోలిస్టే రికార్డు స్థాయి సేక‌ర‌ణ. గ‌త ఏడాది ర‌బీ మార్కెటింగ్ సీజన్లో అంటే 2020-21 సీజ‌న్లో 389.93 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల్ని సేక‌రించ‌డం జ‌రిగింది. 
కొన‌సాగుతున్న ర‌బీ మార్కెట్ సీజ‌న్ సేక‌ర‌ణ‌ల‌ద్వారా 49.20 ల‌క్ష‌ల మంది రైతులు ఇప్ప‌టికే ప్ర‌యోజ‌నం పొందారు. వారికి క‌న‌సీ మ‌ధ్ద‌తు ధ‌ర‌ల ప్ర‌కారం రూ. 85603.57 కోట్లు చెల్లించ‌డం జ‌రిగింది. 

రాష్ట్రాల‌నుంచి ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం 2020-21 ఖ‌రీఫ్ మార్కెట్ సీజ‌న్ కు సంబంధించి మ‌రియు 2021 ర‌బీ మార్కెట్ సీజ‌న్ కు సంబంధించి మ‌రియు 2021 వేస‌వి సీజ‌న్ కు సంబంధించి త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఒడిషా, రాజ‌స్థాన్‌, ఆంధ్ర్ర్ర‌ప్ర‌దేశ్  రాష్ట్రాల్లో 109. 58 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ప‌ప్పుధాన్యాలు, నూనె గింజ‌ల్నిసేక‌రించ‌డానికిగాను ఆమోదం తెల‌ప‌డం జ‌రిగింది. ఈ ప‌నిని ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప‌థ‌కం కింద ( పిఎస్ ఎస్‌) చేస్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో 1.74 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల కొబ్బ‌రిని సేక‌రించ‌డానికి ఆమోదం ఇచ్చారు. ఇక మిగిలిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల‌కుగాను ప‌ప్పుధాన్యాలు, నూనె గింజ‌లు, కొబ్బ‌రికి సంబంధించి ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప‌థ‌కం కింద సేక‌ర‌ణ‌కుగాను  వారినుంచి ప్ర‌తిపాద‌న‌లు రాగానే ఎఫ్ ఏ క్యు గ్రేడ్ పంటల్ని సేక‌రించ‌డం జ‌రుగుతుంది. 2020-21కిగానే న‌మోదు చేసుకున్న రైతుల‌నుంచి నేరుగా, గుర్తించిన క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌ల కింద ఈ సేక‌ర‌ణ చేయ‌డం జ‌రుగుతుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ప్ర‌క‌టించిన‌ పంట కోత స‌మయంలో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కంటే మార్కెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా వుంటేనే ఆయా రాష్ట్రాలు నామినేట్ చేసిన సేక‌ర‌ణ సంస్థ‌ల ద్వారా కేంద్ర నోడ‌ల్ సంస్థ‌లు ఈ ప‌నిని నిర్వ‌హిస్తాయి. 
 
ఆగ‌స్టు 23 నాటికి కేంద్ర ప్ర‌భుత్వం త‌న నోడ‌ల్ ఏజెన్సీలద్వారా 91, 926.47 మిలియ‌న్ ట‌న్నుల పెస‌లు, ఉరాద్ ప‌ప్పు, తూర్ ప‌ప్పు, గ్రామ్‌, మ‌సూర్, వేరుశ‌న‌గ కాయ‌లు, పొద్దుతిరుగు విత్త‌నాలు, ఆవాల పంట‌, సోయాబీన్ పంట‌ల‌ను క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌ల‌ప్ర‌కారం సేక‌రించ‌డం జ‌రిగింది. త‌ద్వారా త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, హ‌ర్యానా, ఒడిషా, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో 6, 96, 803 మంది రైతులకు  ఖ‌రీఫ్ 2020-21 , ర‌బీ 2021, వేస‌వి 2021 సీజ‌న్ల‌లో  క‌నీస‌మ‌ద్ద‌తు కింద రూ. 6, 686.59 కోట్ల ల‌బ్ధి చేకూరింది.(ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ప‌థ‌కం కింద మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కొన‌సాగుతున్న ఒక ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వేస‌వి పెస‌ల పంట సేక‌ర‌ణ కార్య‌క్యమంతో క‌లుపుకొని).

అదే విధంగా క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో 2020-21 పంట‌ల సీజ‌న్లో 3961 మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా రూ.52.40 కోట్ల విలువైన కొబ్బ‌రి పంట‌ను క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కింద‌ సేక‌రించ‌డం కింద‌. 2021-22 సీజ‌న్ కు గాను త‌మిళ‌నాడులో 51 వేల మిట్రిక్ ట‌న్నుల కొబ్బ‌రిని సేక‌రించ‌డానికిగాను ఆమోదం తెలప‌డం జ‌రిగింది. దీనికి సంబంధించి ఆగ‌స్టు 23 నాటికి త‌మిళ‌నాడులో 36 మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా 0.09 కోట్ల విలువైన 8.30 మెట్రిక్ ట‌న్నుల కొబ్బ‌రిని క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల కింద‌ సేక‌రించ‌డం జ‌రిగింది. 
 

***

 


(Release ID: 1749254) Visitor Counter : 211