ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆజాది కా అమృత్ మహోత్సవ్
భారతీయ పారిశ్రామికవేత్తల కోసం, స్టార్టప్‌ల కోసం కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021ను ప్రారంభించారు
రోబస్ట్‌నెస్, సెక్యూరిటీ ఫీచర్లు, స్కేలబిలిటీ & ఇంటర్ ఆపెరాబిలిటీ మొదలైనవి ఇందులోని ముఖ్యమైన మూల్యాంకన పారామితులు.
ఎంట్రీలను వచ్చే నెల 30 వరకు స్వీకరిస్తారు
Posted On:
23 AUG 2021 6:40PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, భారతీయ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ల కోసం అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్– 2021 ను ఈరోజు ప్రారంభించారు. 2022 నాటికి కొత్త, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మించడానికి, భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాది కా అమృత్మహోత్సవంగా జరుపుకోవాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా ఇది ఉంటుంది. మైటీ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు ప్రారంభించిన ఇన్నోవేషన్ ఛాలెంజ్ 24 విన్నింగ్ యాప్‌లు, 20 ప్రామిసింగ్ యాప్‌లను గుర్తించడంలో సహాయపడింది. 2020 లో ప్రారంభించిన ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కు ఇది కొనసాగింపు. ఈ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, భవిష్యత్తు కోసం వినూత్న పరిష్కారాలను నిర్మించడంలో స్టార్టప్‌ల పాత్రను పరిగణనలోకి తీసుకుని, వ్యాపారం చేయడం, సేవలను అందించే సాంప్రదాయ పద్ధతిని ముందుకు తీసుకెళ్తూ, 'అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021' పేరుతో కార్యక్రమం తీసుకురావడం బావుందని అన్నారు. స్టార్టప్‌లు, వర్ధమాన పారిశ్రామికవేత్తలు, యువకులను ఇది ఆకర్షిస్తుందని, ఈ ఛాలెంజ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, మనకు అనేక పరిష్కారాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంలో 500 మిలియన్లకు పైగా ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లు అంచనా. వీరిలో మూడు వంతుల మంది ఆన్‌లైన్‌లో ఉన్నారు. గ్లోబల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసేవారిలో భారతీయులు కూడా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ భారీ మార్కెట్ భారతీయ ఆవిష్కర్తలకు, టెక్ గురువులకు అనేక అవకాశాలను ఇస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, సోషల్ మీడియా, మెసేజింగ్, మార్కెటింగ్, రవాణా, ఆహారం మొదలైన అనేక రంగాలలో అనేక కొత్త యాప్‌లు వచ్చాయి. ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించాయి. భారతదేశ గొప్ప సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రదర్శించే యాప్‌లను గుర్తించాలని మంత్రి కోరారు. గుర్తించిన కేటగిరీలు నూతన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రధాన మంత్రి చెప్పిన విజన్ ప్రకారం పరిష్కారాలను రూపొందించడానికి సహాయపడతాయి. హ్యాకథాన్‌లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ల ద్వారా స్టార్టప్‌లు, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు అద్భుతమైన పరిష్కారాలను తీసుకురాగలుగుతారు.
లీడర్ బోర్టుల్లో ప్రదర్శితమయ్యే యాప్‌లకు వివిధ నగదు పురస్కారాలను, ప్రోత్సాహకాలను ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అందిస్తుంది. భారతదేశంలోని పౌరులతోపాటు ప్రపంచానికీ సేవ చేయగల టెక్ సొల్యూషన్స్‌ని తయారు చేయడానికి, ఇంక్యుబేట్ చేయడానికి, నిర్మించడానికి, పెంపొందించడానికి నిలబెట్టుకోవడానికి భారతీయ వ్యవస్థాపకులు స్టార్టప్‌లను ప్రోత్సహించే పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది ఈ చాలెంజ్.
మన మంత్రం ఏమిటంటే ‘‘మేకిన్ ఇండియా ఫర్ ఇండియా అండ్ వరల్డ్”
అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 16 కేటగిరీల్లో మొదలయింది. వీటిలో కల్చర్ & హెరిటేజ్, ఆరోగ్యం, విద్య, సోషల్ మీడియా, ఎమర్జ్ టెక్, స్కిల్స్, న్యూస్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆఫీస్, ఫిట్‌నెస్ & న్యూట్రిషన్, అగ్రికల్చర్, బిజినెస్ & రిటైల్, ఫిన్‌టెక్, నావిగేషన్ వంటివి ఉన్నాయి.
ప్రతి వర్గంలో అనేక ఉప–వర్గాలు ఉండవచ్చు.
ఇన్నోవేషన్ ఛాలెంజ్ https://innovateindia.mygov.in/ లింకులో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీలు సమర్పించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్, 2021. దరఖాస్తుదారులను - www.mygov.in పోర్టల్లో నమోదు చేసుకోవాలి. లాగిన్ కావడం ద్వారా తమ ప్రతిపాదనలను సమర్పించడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన ఎంట్రీలను జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేస్తారు. ఎంపికైన యాప్‌లకు అవార్డులను ఇస్తారు. పౌరుల సమాచారం కోసం లీడర్ బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తారు. ప్రభుత్వం తగిన యాప్‌లను కూడా స్వీకరిస్తుంది. అవి ఎదిగేందుకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రభుత్వ ఈ–-మార్కెట్‌ప్లేస్ (జిఎమ్) లో లిస్ట్ చేస్తుంది.
ఈజీ యూజర్ ఇంటర్‌ఫేస్, రోబస్ట్‌నెస్, సెక్యూరిటీ ఫీచర్లు, స్కేలబిలిటీ & ఇంటర్ఆపెరబిలిటీ విజన్ ఆఫ్ యాప్ వంటివి కొన్ని కీలకమైన మూల్యాంకన పారామితులు ఇందులో ఉంటాయి. రాబోయే ఐదేళ్ల కోసం విజన్ యాప్ను కూడా చేర్చారు. దీనిని విజయవంతం చేయడానికి అభ్యర్థులు తమ సూచనలు అందించవచ్చు. ఈ కార్యక్రమంలో అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 పై వీడియోను, 7 సంవత్సరాల విజయాలపై ఈ–బుక్ కూడా మంత్రిత్వశాఖ ఆవిష్కరించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 విజేతలతో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 విజేతలు, కుటుకి కిడ్ లెర్నింగ్ యాప్ డెవలపర్లు భరత్ బేవినహళ్లి, రఘునాథ్ స్నేహా కళ్యాణసుందరం.. హిట్ వికెట్ సూపర్ స్టార్స్ డెవలపర్ కీర్తి సింగ్, స్టెప్ సెట్‌గో డెవలపర్ శివజీత్ ఘాట్జ్, చింగారి డెవలపర్లు సుమిత ఘోష్ , ఆదిత్య కొఠారి, కూ యాప్ డెవలపర్ అప్రమేయ రాధాకృష్ణ, మ్యాప్ మి ఇండియా యాప్ డెవలపర్ రోహన్ వర్మ తమ అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.
***
(Release ID: 1748901)
Visitor Counter : 254