ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మోసానికి సంబంధించి మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన డిజిజిఐ గురుగ్రామ్ యూనిట్
Posted On:
25 AUG 2021 9:31AM by PIB Hyderabad
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) గురుగ్రామ్ జోనల్ యూనిట్ (జిజెడ్యు), హర్యానా ఒక కేసును ఛేదించింది, ఇందులో మొత్తం రూ.176 కోట్ల నకిలీ ఐటీసీని మెస్సర్స్ రెడమాన్సీ వరల్డ్ ప్రొప్రయిటర్ సంజయ్ గోయల్, ఉనికిలో లేని ఎనిమిది సంస్థల డిఫెక్టో కంట్రోలర్ దీపక్ శర్మ మోసపూరితంగా పాస్ చేశారు. దీని ప్రకారం సంజయ్ గోయల్, దీపక్ శర్మ ఇప్పటికే ఈ కార్యాలయం అరెస్టు చేసింది. మరో ఇద్దరు కీలక వ్యక్తుల తదుపరి దర్యాప్తులో మనీష్ మోడీ, గౌరవ్ అగర్వాల్ కూడా బయటపడ్డాడు.
తదుపరి విచారణ ద్వారా వెల్లడైన వివరాల ఆధారంగా, ఈ కార్యాలయం వస్తువులు లేదా సేవల అసలు సరఫరా లేకుండా నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) ని మోసపూరితంగా పాస్ చేయడానికి నకిలీ సంస్థ గూడుపుఠాణీ చేశారన్న ఆరోపణలపై న్యూఢిల్లీలోని పితమ్ పురా నివాసి చార్టర్డ్ అకౌంటెంట్ మనీష్ మోడీని అరెస్టు చేసింది. నకిలీ సంస్థలు నివారణ ఎంటర్‌ప్రైజెస్, పంచవతి ఎంటర్‌ప్రైజెస్ ద్వారా మనీష్ మోడీ మోసపూరితంగా రూ. 36 కోట్లు మేర నకిలీ ఐటిసిని పాస్ చేసినట్టు బయటపడింది. ఇంకా అతను ఇలాంటి నేరారోపణ సాక్ష్యాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
ఇంకా గౌరవ్ అగర్వాల్ అనే వ్యక్తి అగర్వాల్ & కంపెనీ (ఐటీసీ అధీకృత డీలర్) పార్టనర్ గా మోసపూరిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ గూడుపుఠాణి పాల్పడినట్టు బయటపడింది. అతను మోసపూరితంగా రూ .15 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) ని జారీ చేశాడు (జిఎస్‌టి మరియు సెస్‌తో సహా), ఈ విధమైన ఆరోపణలపై ఈ కార్యాలయం అరెస్టు చేసింది. దీని ప్రకారం, మనీష్ మోడీ, గౌరవ్ అగర్వాల్‌ను 23.08.2021 న అరెస్టు చేశారు. ఆయనను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఢిల్లీ డ్యూటీ ఎంఎం ఆదేశించారు. వరుసగా రూ .36 కోట్లు మరియు 15 కోట్లకు పైగా నకిలీ ఐటిసి, ఇద్దరు వ్యక్తులు మోసపూరితంగా అందజేశారు. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది.
****
(Release ID: 1748868)
Visitor Counter : 167