బొగ్గు మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత మహాత్సవ్ లో భాగంగా మొక్కల పంపిణీ చేపట్టిన కేంద్ర గనుల శాఖకు చెందిన నాల్కో
Posted On:
24 AUG 2021 4:24PM by PIB Hyderabad
ఒడిషాలోని కోరాపుట్ జిల్లా పరిధిలోని దామన్ జోడి లో జాతీయ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌కు ( నాల్కో) చెందిన గనులు మరియు రిఫైనరీ కాంప్లెక్స్ వుంది. దీని చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు నాల్కో సంస్థ భారీ సంఖ్యలో మొక్కలను పంపిణీ చేసింది. కేంద్ర గనుల శాఖ పరిధిలోని నాల్కో సంస్థ నవరత్న కంపెనీగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ ఆక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాల్కో సంస్థ భారీ ఎత్తున మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్, అంగుల్ లలోని తమ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఈ పని చేస్తున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భాద్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా నాల్కో తన విదులను నిర్వహిస్తోంది. నాల్కో మరియు నాల్కో ఫౌండేషన్ సంస్థలు పలు గ్రామాల్లో మొక్కల్ని పంపిణీ చేసి వాటిని నాటే కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నాల్కో సంస్థ ఉద్యోగులు ఒకడుగు ముందుకేసి మొక్కల ప్రాధాన్యతను ఆయా గ్రామాల ప్రజలకు వివరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై ప్రజల్లో తగిన చైతన్యం కల్పిస్తున్నారు. కోరాపుట్ జిల్లాలోని దామన్ జోడి, పొట్టంగి ప్రాంతాల్లోని మరిన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు.
నాల్కోకంపెనీ తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో పర్యావరణ సంరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఇంతవరకూ ఈ సంస్థ ఒకకోటికిపైగా మొక్కలను నాటింది. దేశంలో అల్యూమినా, అల్యూమినియం ఉత్పత్తులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్న సంస్థల్లో ఈ సంస్థ మొదటి స్థానంలో వుంది. గనులు, లోహాలు, విద్యుత్ అంశాలకు సంబందించి మారుతున్న పరిస్థితులకనుగుణంగా నాల్కో సంస్థ తన కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ విస్తరిస్తోంది.
***
(Release ID: 1748867)
Visitor Counter : 191