ఆర్థిక మంత్రిత్వ శాఖ
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి దరఖాస్తుల ఆహ్వానం
प्रविष्टि तिथि:
24 AUG 2021 1:28PM by PIB Hyderabad
భారతదేశంలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు,ఆర్థిక సంస్థలను అభివృద్ధి చేసి నియంత్రించాలన్న లక్ష్యంతో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ఏర్పాటయ్యింది.
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి అనుసరించవలసిన విధి విధానాలను ఖరారు చేస్తూ 2021 జూలై 9న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ సర్క్యూలర్ జారీ చేసింది.
ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పి, నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అర్హత గల సంస్థలు నిర్ణీత విధానంలో అవసరమైన పత్రాలను జతచేసి 2021 సెప్టెంబర్ 15వ తేదీలోగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అర్హతలు కలిగిన సంస్థకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ లో కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతి ఇస్తారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతులు మంజూరు అయ్యేంత వరకు సంస్థ అనుమతించిన కాలానికి పని చేయవలసి ఉంటుంది.
ఎగుమతిదారులు మరియు దిగుమతిదారుల వాణిజ్య ఆర్థిక అవసరాలను సులభతరం చేయడానికి బహుళ ఆర్థిక వనరులను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ఒక ఎలక్ట్రానిక్ వేదికగా వ్యవహరిస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థల నుండి ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు రుణ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఇది కృషి చేస్తుంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ జాతీయ అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతి దారుల ఆర్థిక సౌకర్యాల కేంద్రంగా గుర్తింపు పొందుతుందని ఆశిస్తున్నారు.
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2021 ఆగస్ట్ 23వ తేదీన జారీ అయిన సర్క్యూలర్ ను www.ifsca.gov.in/circularలో చూడవచ్చును.
(रिलीज़ आईडी: 1748528)
आगंतुक पटल : 245