అంతరిక్ష విభాగం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల ప్రణాళిక రూపకల్పనకు భువన్ "యుక్త ధార" కింద కొత్త పోర్టల్: కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్

రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా "యుక్తధార" పనిచేస్తుంది... శ్రీ జితేంద్ర సింగ్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమగ్ర నీటి యాజమాన్య పథకం, ప్రతి నీటి బొట్టుతో అదనపు దిగుబడి,రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాల కింద అభివృద్ధి చేసిన ఆస్తుల (జియో ట్యాగ్) ఫొటోలతో సహా పూర్తి వివరాల భాండాగారంగా "యుక్త ధార"

Posted On: 23 AUG 2021 5:36PM by PIB Hyderabad

రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్  ఆధారిత సమాచారాన్ని ఉపయోగించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆస్తుల ప్రణాళికను రూపొందించడానికి  "యుక్త ధార" పోర్టల్ ఉపయోగపడుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ అన్నారు.   "యుక్త ధార" పోర్టల్ ను ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమగ్ర నీటి యాజమాన్య పథకం, ప్రతి నీటి బొట్టుతో అదనపు దిగుబడి,రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాల కింద అభివృద్ధి చేసిన ఆస్తుల (జియో ట్యాగ్) ఫొటోలతో సహా పూర్తి వివరాల భాండాగారంగా  "యుక్త ధార" ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

 "యుక్త ధార" విడుదల సమావేశంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధిపంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ శ్రీ గిరిరాజ్ సింగ్ వికేంద్రీకృత విధానంలో నిర్ణయాలను తీసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి జరుగుతున్న కృషికి  "యుక్త ధార"  దోహదపడుతుందని అన్నారు. 'యుక్తఅంటే ప్రణాళిక 'ధార 'అంటే ప్రవాహం అని ఆయన వివరించారు. గ్రామీణ ప్రణాళికలో జి జి సేవలను అందించడానికి ఇస్రో తో కలసి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు "యుక్త ధార" తుదిరూపు ఇస్తుందని మంత్రి చెప్పారు. 

ఇస్రో నిర్వహిస్తున్న భువన్ పోర్టల్ ఉపగ్రహ ఛాయా చిత్రాలువిశ్లేషణలతో  విలువైన సమాచారాన్ని అందిస్తున్నదని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నదని మంత్రి వివరించారు.

నూతనంగా ప్రారంభించిన "యుక్త ధార" పోర్టల్ భౌగోళిక సమాచారాన్ని అధునాతన సాధనాలతో విశ్లేస్తుందని డాక్టర్ సింగ్ తెలిపారు. దీని ఆధారంగా ప్రణాళిక వేత్తలు గతంలో వివిధ పథకాల కింద అభివృద్ధి చేసిన ఆస్తులు సౌకర్యాలను విశ్లేషించి నూతన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రాలకు చెందిన శాఖలతో కలసి సంబంధిత అధికారులు ప్రణాళికలను పరిశీలించి తగిన వాటిని గుర్తిస్తారని అన్నారు. క్షేత్ర స్థాయి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చే అంశంలో "యుక్త ధార"కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పథకాల జీవిత కాలం పెరగడానికి, వీటిపై నియంత్రణ కలిగి ఉండడానికి అవకాశం కలుగుతుంది. 

భువన్ లో జియో సౌకర్యంతో  పొందుపరచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వివరాలకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించింది. జియో టాగింగ్ చేయడానికి ముందు జియో టాగింగ్ చేసిన తరువాత లభిస్తున్న వివరాల ఆధారంగా చేసుకుని సమకూరుస్తున్న నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయి. దీనితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఏర్పడుతున్నాయి. జన్ మన్రేగా మొబైల్ సాధనం ద్వారా భువన్ సేవలను వినియోగిస్తూ  ప్రజల నుంచి అభిప్రాయాలను  తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. జియోగ్రాఫిక్ సమాచారం  మరియు ఎర్త్ అబ్జర్వేషన్ టెక్నాలజీలను అనుసంధానం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఆస్తుల విలువపెరగడమే కాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమం అమలులో పారదర్శకతను తీసుకువచ్చిందని ఆయన వివరించారు.

ప్రపంచంలో తొలిసారిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి భారీ ప్రణాళిక కు సంబంధించిన  సమాచారాన్ని అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు అవసరమైన సమాచారాన్ని అందించే అంశంలో రాష్ట్రాలు అందిస్తున్న తోడ్పాటుతో ఈ కార్యక్రమం అమలు జరుగుతుందని మంత్రి వివరించారు.  

***(Release ID: 1748395) Visitor Counter : 88