మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ఎన్‌ఈపీ ఒక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020 వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు
प्रविष्टि तिथि:
23 AUG 2021 7:06PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం- 2020 భారతదేశాన్ని నాలెడ్జ్ ఎకానమీగా స్థాపించడానికి మరియు ప్రపంచ పౌరుల రూపకల్పనలో సహాయపడటానికి ఒక రోడ్‌మ్యాప్‌ని అందిస్తుందని ఎన్‌ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర విద్య & నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ ప్రధాన్.. జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేయడం ద్వారా కర్ణాటక తన విద్యాభ్యాసాన్ని మార్చడంలో ఒక పెద్ద ముందడుగు వేసింది అని అన్నారు. విజన్ ఎన్‌ఈపీ-2020 ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా కర్ణాటక తనను తాను నిరూపించుకోవాలనిఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఇపి అమలు చేయడం ద్వారా కర్ణాటక ఇతర రాష్ట్రాలకు ఒక ఉదాహరణగా నిలిచిందని మంత్రి అన్నారు.
భారతదేశ ఎన్‌ఈపీ దృక్పథం భారతీయ తత్వంతో లోతుగా పాతుకుపోయిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌ఈపీ విధాన ఫ్రేమ్‌వర్క్, అమలు వ్యూహం, ఫలితాలు మరియు మానవ సమాజ అభివృద్ధిలో పాత్ర ప్రపంచ విధాన రూపకర్తలకు కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. ఈ రోజు 3-23 సంవత్సరాల వయస్సులో ఉన్న తరం ఎన్‌ఈపీ ప్రయోజనాలను పొందుతుంది. మరియు భవిష్యత్తులో భారతదేశ గమ్యాన్ని రూపొందిస్తుంది. అయితే భారతదేశం యొక్క పెరుగుతున్న జనాభాను కొత్త విద్యా విధానం పరిధిలోకి చేర్చడం మన ముందు ఉన్న సవాలు అని మంత్రి తెలిపారు.
భారతదేశాన్ని ఎన్‌ఈపీ సరికొత్త ప్రపంచానికి సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుతుందని శ్రీ ప్రధాన్ నొక్కిచెప్పారు. భారతదేశాన్ని శక్తివంతమైన నాలెడ్జ్ ఎకానమీగా మార్చాలనే తమ జాతీయ ఆశయాన్ని నెరవేర్చడానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు.
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ ఎస్ బొమ్మై, ఉన్నత విద్య, ఐటీ & బిటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి, డా. సి. ఎన్. అశ్వత్ నారాయణ్; ఎన్‌ఈపీ ముసాయిదా కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
*****
(रिलीज़ आईडी: 1748391)
आगंतुक पटल : 212