శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టీకాల పరీక్ష మరియు బ్యాచ్ విడుదల కోసం సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీగా పనిచేయనున్న హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ
వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీకి అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నబయోటెక్నాలజీ విభాగం, శాస్త్ర సాంకేతికమంత్రిత్వ శాఖ
Posted On:
21 AUG 2021 1:51PM by PIB Hyderabad
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించి తక్షణ చికిత్స అందించడానికి టీకా బ్యాచ్‌లను త్వరితగతిన విడుదల చేయడానికి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల పరీక్షలను నిర్వహించడానికి మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయవలసిన అవసరం వుంది. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్రం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తున్న హైదరాబాద్ లోనినేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ,పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ లను సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీలుగా గుర్తించింది. వీటిలో సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను పీఎం-కేర్స్ నుంచి విడుదల చేస్తారు.
దేశంలో టీకాలను అభివృద్ధి చేసి వీటి ఉత్పత్తిని అధిగం చేయడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి బయోటెక్నాలజీ విభాగం, శాస్త్ర సాంకేతికమంత్రిత్వ శాఖ చర్యలను అమలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ,పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ లలో సౌకర్యాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
పీఎం-కేర్స్ నుంచి విడుదల అయిన నిధులతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ప్రయోగశాల కోవిడ్-19 టీకాలను పరీక్షించడానికి సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ గా అప్‌గ్రేడ్ చేయబడింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎబిలో ఉన్న సదుపాయాన్ని కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను పరీక్షించి, విడుదల చేయడానికి సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీగా నోటిఫై చేశారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 17 ఆగస్టు 2021 న జారీ చేసింది. పూణేలోని ఎన్‌సిసిఎస్ 28 జూన్ 2021 న సిడిఎల్‌గా నోటిఫై చేయబడింది.
రెండు కేంద్రాలు నెలకు సుమారు 60 బ్యాచ్‌ల టీకాలు పరీక్షిస్తాయని భావిస్తున్నారు. దేశంలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాల సమీపంలో నూతన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో టీకా తయారీ మరియు సరఫరా కోసం రవాణా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. పీఎం -కేర్స్ నుంచి విడుదల అయిన నిధులతో రెండు సంస్థల్లో సౌకర్యాలను అభివృద్ధి చేసి ఆధునిక సాంకేతిక అంశాలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేసిన ఈ కార్యక్రమాల వల్ల దేశంలో టీకాల కార్యక్రమం మరింత వేగవంతంగా అమలు చేయడానికి అవసరమైన టీకాలు ఉత్పత్తి మరింత పెరిగి టీకాల లభ్యత పెరుగుతుంది.
(Release ID: 1747932)
Visitor Counter : 249