విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్‌టిపిసి

Posted On: 21 AUG 2021 4:18PM by PIB Hyderabad

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌టిపిసి) లిమిటెడ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, విశాఖ‌ప‌ట్నంలోని త‌న సింహాద్రి థ‌ర్మ‌ల్ స్టేష‌న్‌లో 25 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్టును ప్రారంభించింది. భార‌త ప్ర‌భుత్వం 2018లో నోటిపై చేసిన ఫ్లెక్సిబిలైజేష‌న్  (పున‌రావృత్త ఇంధ‌న స‌ర‌ఫ‌రాలో వ‌చ్చే అస్థిర‌త‌ల‌ను నిర్వ‌హించే)ప‌థ‌కం కింద ఏర్పాటు చేసిన తొలి సోలార్ ప్రాజెక్టు ఇది. 
ఎన్‌టిపిసి ఆర్ ఇడి( డ‌బ్ల్యుఆర్‌2 & ఎస్ ఆర్‌) సంజ‌య్ మ‌ద‌న్ సోలార్ పివి ప్రాజెక్టును ప్రారంభించారు. 
ప్ర‌త్యేక‌మైన యాంక‌రింగ్ డిజైన్ క‌లిగి ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఆర్‌డ‌బ్ల్యు రిజ‌ర్వాయ‌ర్‌లో 75 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. 01 ల‌క్ష సోలార్ పివి మాడ్యూళ్ళ నుంచి విద్యుత్‌ను ఉత్స‌త్తిని చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఈ ఫ్లోటింగ్ ప్రాజెక్టుకు ఉంది. ఈ ప్రాజెక్టు త‌న నిర్వాహ‌క కాల‌ప‌రిమితిలో సుమారు 7000 ఆవాసాల‌కు విద్యుత్‌ను అందించ‌డ‌మే కాక‌, ప్ర‌తి ఏడాది 46,000 ట‌న్నుల కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను ఆమ‌డ దూరంలో ఉంచుతుంది. అలాగే, ప్ర‌తి ఏడాది 1,364 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని ఈ ప్రాజెక్టు ఆదా చేస్తుంద‌ని అంచ‌నా. ఇది 6,700 ఆవాసాల నీటి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఉప‌యోగప‌డేంత నీటి ప‌రిమాణం. బంగాళాఖాతం నుండి స‌ముద్ర నీటి సేక‌ర‌ణ‌ను గ‌త 20 ఏళ్ళుగా అమ‌లు చేస్తూ  సింహాద్రి స్టేష‌న్ లో గ‌ల 2000 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్రాజెక్టు కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంది. దీనితో పాటుగా,  హైడ్రోజెన్ ఆధారిత మైక్రో గ్రిడ్ వ్య‌వ‌స్థను కూడా ఏర్పాటు చేసేందుకు ఎన్‌టిపిసి యోచిస్తోంది.
మొత్తం  66900 మెగావాట్ల వ్య‌వ‌స్థాప‌క సామ‌ర్ధ్యం క‌లిగిన ఎన్‌టిపిసి గ్రూపు 29 పున‌రావృత ఇంధ‌న ప్రాజెక్టులు స‌హా 71 విద్యుత్ స్టేష‌న్లను క‌లిగి ఉంది. దాదాపు 60 గిగావాట్ల (జిడ‌బ్ల్యు) పునార‌వృత్త ఇంధ‌న సామ‌ర్ధ్యాన్ని 2032 నాటికి ఏర్పాటు చేయాల‌ని ఎన్‌టిపిసి ల‌క్ష్యంగా పెట్టుకుంది.  యుఎన్ హై లెవెల్ డైలాగ్ ఆన్ ఎన‌ర్జీ (ఇంధ‌నంపై ఐక్యరాజ్య స‌మితి ఉన్న‌త స్థాయి చ‌ర్చ - హెచ్ఎల్‌డిఇ) లో భాగంగా త‌న ఇంధ‌న సంఘ‌టిత ల‌క్ష్యాలను (ఎనర్జీ కాంపాక్ట్ గోల్స్‌) ప్ర‌క‌టించిన తొలి భార‌తీయ ఇంధ‌న కంపెనీ ఎన్‌టిపిసి.
ఈ గ్రూపు 5 గిగావాట్ల పున‌రావృత ఇంధ‌న ప్రాజెక్టులు స‌హా 17 జిబ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన ఇంధ‌న ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఇంధ‌న ప్రాజెక్టుల ద్వారా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌లో నిరాటంక‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం ఎన్‌టిపిసి ప్ర‌త్యేక‌త‌.

 

***
 



(Release ID: 1747917) Visitor Counter : 303