ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి.ఓ.పి.-26 అధ్యక్షులుగా నియమితులైన గౌరవనీయులు అలోక్ శర్మ తో వాతావరణ మార్పుకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించిన - ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
18 AUG 2021 6:22PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, సి.ఓ.పి.-26 అధ్యక్షులుగా నియమితులైన గౌరవనీయులు అలోక్ శర్మను ఈ రోజు, ఇక్కడ కలిసి, వాతావరణ మార్పు ముఖ్యంగా సి.ఓ.పి.-26 కి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు.
యు.ఎన్.ఎఫ్.సి.సి.సి. మరియు పారిస్ ఒప్పంద లక్ష్యాల దిశగా కొన్ని జి.-20 దేశాలలో ఒకటిగా ఉన్న భారతదేశం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 450 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆ దిశగా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందనీ, శ్రీమతి సీతారామన్ తెలియజేశారు. ఈ పునరుత్పాదక ఇంధనంలో ఇప్పటికే, 100 గిగా వాట్లు సాధించినట్లు కూడా ఆమె తెలియజేశారు. ఇతర ముఖ్యమైన కార్యక్రమాలలో, హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ లో చేసిన విస్తృతమైన కృషి గురించి, ఆమె, ప్రత్యేకంగా పేర్కొన్నారు.
వివిధ వేదికలలో వాతావరణ మార్పులపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో, వాతావరణ న్యాయంపై సంభాషణల గురించి ప్రస్తావిస్తూ, పేదల పట్ల కరుణ భావాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉందని, శ్రీమతి సీతారామన్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు అందించాలన్న అభివృద్ధి చెందిన దేశాల నిబద్ధత సాకారమౌతుందనీ, సి.ఓ.పి.- 26 లో ఆర్ధిక పరమైన కొత్త సామూహిక లక్ష్యాలపై ఫలితం సానుకూలంగా ఉంటుందనీ ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1747238)