మంత్రిమండలి
azadi ka amrit mahotsav

భారతదేశానికిచెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ కు, స్విట్జర్లాండ్కు చెందిన ఫౌండేశన్ ఫార్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నస్టిక్స్ (ఎఫ్ఐఎన్ డి) కి మధ్యఅవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 18 AUG 2021 4:18PM by PIB Hyderabad

అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి మరియు సాంకేతిక పరమైనటువంటి సహకారం తాలూకు ఫ్రేమ్ వర్క్ కు లోబడి పరస్పర సంబంధాల ను పటిష్ఠ పరచుకోవడం కోసం, అలాగే ఉభయ పక్షాల ప్రయోజనం ముడిపడిన రంగాల లో సహకారాన్ని పెంచుకోవడం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ కు, స్విట్జర్లాండ్ కు చెందిన ఫౌండేశన్ ఫార్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నస్టిక్స్ (ఎఫ్ఐఎన్ డి) కి మధ్య సంతకాలైన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ఎమ్ఒయు పై భారతదేశం 2021 ఫిబ్రవరి లో సంతకం చేసింది.

ప్రయోజనాలు:

ఈ ఎమ్ఒయు ఉభయ పక్షాల ప్రయోజనాలు ముడి పడిన రంగాల లో భారతదేశానికి, స్విట్జర్లాండ్ కు మధ్య సంబంధాల ను అంతర్జాతీయ విజ్ఞ‌ాన శాస్త్రపరమైన, సాంకేతిక విజ్ఞ‌ానపరమైన సహకారం తాలూకు ఒక ఫ్రేంవర్క్ పరిధి కి లోబడి మరింత గా బలోపేతం చేయనుంది.

ఆర్థిక ప్రభావం:

రిక్వెస్ట్ ఫార్ ప్రపోజల్ (ఆర్ఎఫ్ పి) ద్వారా గుర్తించిన స్థానిక భాగస్వాముల కు, పరిశోధకుల కు 1 లక్ష యూఎస్ డాలర్ మేర ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఐసిఎమ్ఆర్ సంసిద్ధమైంది. ఎఫ్ఐఎన్ డి తన వంతు గా 4 లక్షల యూఎస్ డాలర్ ల మేరకు నిధుల ను అందించనుంది.

పూర్వరంగం:

దేశం లో సంస్థల పరంగా అంతర్గతం గానూ (ఇంట్రామ్యూరల్), ఆ పరిధి కి ఆవల (ఎక్స్ ట్రా మ్యూరల్) జరిగే బయోమెడికల్ రిసర్చ్ ను ఐసిఎమ్ఆర్ ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఎఫ్ఐఎన్ డి అనేది ఒక స్వతంత్రమైన లాభాపేక్షరహిత సంస్థ. దీనిని (భారతీయ) కంపెనీల చట్టం, 2013 లోని 8వ సెక్శన్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరిగింది.

***


(Release ID: 1747166) Visitor Counter : 167