పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
హైడ్రోఫ్లోరోకార్బన్‌లను తగ్గించడానికి ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్‌కు కిగాలి సవరణను ఆమోదించిన కేబినెట్
2023 నాటికి పరిశ్రమ వాటాదారులందరితో అవసరమైన సంప్రదింపుల తర్వాత హైడ్రోఫ్లోరోకార్బన్‌లను దశలవారీగా తగ్గించే జాతీయ వ్యూహం
Posted On:
18 AUG 2021 4:14PM by PIB Hyderabad
భారతదేశం హైడ్రోఫ్లోరోకార్బన్ ( హెచ్‌ఎఫ్‌సి) లను తగ్గించడానికి ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్‌కు కిగాలి సవరణను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. 2016, అక్టోబర్ లో రువాండాలోని కిగాలీలో జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ 28 వ సమావేశంలో దీనిని ఆమోదించారు.
ప్రయోజనాలు :
(i) హెచ్‌ఎఫ్‌సి దశలవారీగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను నిరోధించడం, వాతావరణ మార్పులను నివారించడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
(ii) హైడ్రోఫ్లోరోకార్బన్‌లను ఉత్పత్తి చేసే, వినియోగించే పరిశ్రమ అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం హైడ్రోఫ్లోరోకార్బన్‌లను దశలవారీగా నిలిపివేస్తుంది, హెచ్‌ఎఫ్‌సియేతర, తక్కువ గ్లోబల్ వార్మింగ్ సంభావ్య సాంకేతికతలకు పరివర్తన చెందుతుంది.
అమలు వ్యూహం, లక్ష్యాలు :
(i) భారతదేశానికి వర్తించే షెడ్యూల్ ప్రకారం హైడ్రోఫ్లోరోకార్బన్‌లను దశలవారీగా తగ్గించే జాతీయ వ్యూహం 2023 నాటికి అన్ని పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపుల తర్వాత అమలు జరుగుతుంది.
(ii) కిగాలి సవరణకు అనుగుణంగా ఉండేలా హైడ్రోఫ్లోరోకార్బన్‌ల ఉత్పత్తి, వినియోగంపై తగిన నియంత్రణను అనుమతించడానికి, ప్రస్తుతం ఉన్న చట్టాల చట్రంలో సవరణలు, ఓజోన్ క్షీణత పదార్థాలు (నియంత్రణ మరియు నియంత్రణ) నియమాలు 2024 మధ్యలో చేపడతారు.
ఉపాథి కల్పనా అవకాశాలతో పాటు, ముఖ్యమైన ప్రభావం:
(i) హైడ్రోఫ్లోరోకార్బన్స్. గ్రీన్ హౌస్ వాయువులకు సమానమైన 105 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను దశలవారీగా నిరోధించవచ్చని భావిస్తున్నారు, ఓజోన్ పొరను కాపాడుతూనే, 2100 నాటికి 0.5 డిగ్రీల సెల్సియస్ ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలని నివారించడానికి సహాయపడుతుంది.
(ii) తక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్, ఎనర్జీ-ఎఫిషియెంట్ టెక్నాలజీలను స్వీకరించడం ద్వారా కిగాలి సవరణ కింద హెచ్‌ఎఫ్‌సి దశల వారీ తగ్గింపును అమలు చేయడం వలన ఇంధన సామర్థ్య లాభాలు పొందడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు-"వాతావరణ సహ-ప్రయోజనం," సాధిస్తాము.
(iii) హెచ్‌ఎఫ్‌సి దశల వారీ తగ్గింపును అమలు చేయడం వలన పర్యావరణ లాభాలతో పాటుగా ఆర్థిక, సామాజిక సహ-ప్రయోజనాలను పెంచే లక్ష్యంతో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, భారత ప్రభుత్వ పథకాలతో అనుసంధానం అవుతాయి.
(iv) అంగీకారానికి వచ్చిన హెచ్‌ఎఫ్‌సి తగ్గింపు షెడ్యూల్ ప్రకారం పరిశ్రమ తక్కువ గ్లోబల్ వార్మింగ్ సంభావ్య ప్రత్యామ్నాయాలకు మారడానికి వీలుగా దేశీయ పరికరాల తయారీతో పాటు ప్రత్యామ్నాయ హెచ్‌ఎఫ్‌సి, తక్కువ-గ్లోబల్ వార్మింగ్ సంభావ్య రసాయనాలకు అవకాశం ఉంటుంది. అదనంగా, కొత్త తరం ప్రత్యామ్నాయ రిఫ్రిజిరేటర్లు మరియు సంబంధిత టెక్నాలజీల కోసం దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు:
i . కిగాలి సవరణ కింద; మాంట్రియల్ ప్రోటోకాల్‌కు అంగీకరించిన పార్టీలు హైడ్రోఫ్లోరోకార్బన్‌ల ఉత్పత్తి, వినియోగాన్ని దశలవారీగా తగ్గిస్తాయి, వీటిని సాధారణంగా హెచ్‌ఎఫ్‌సి లు అని పిలుస్తారు.
ii. హెచ్‌ఎఫ్‌సిలు స్ట్రాటో ఆవరణ ఓజోన్ పొరను క్షీణించనప్పటికీ, అవి 12 నుండి 14,000 వరకు అధిక గ్లోబల్ వార్మింగ్ సంభావ్యతను కలిగి ఉంటాయి, ఇవి వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
iii. హెచ్‌ఎఫ్‌సిల వాడకంలో వృద్ధిని గుర్తించి, ప్రత్యేకించి రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్-కండిషనింగ్ విభాగంలో మాంట్రియల్ ప్రోటోకాల్‌కు సంబంధించిన పార్టీలు, అక్టోబర్ 2016 లో కిగాలి, రువాండాలో జరిగిన హెచ్‌ఎఫ్‌సిలను జోడించడానికి వారి 18 వ సమావేశంలో (ఎంఓపీ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. నియంత్రిత పదార్థాల జాబితా మరియు 2040 ల చివరినాటికి వాటి క్రమక్రమంగా 80-85 శాతం తగ్గింపు కోసం నిర్దిష్ట కాల వ్యవధి ప్రణాళికను ఆమోదించారు.
iv. హెచ్‌ఎఫ్‌సి లను దశల వారీ తగ్గించడానికి భారత్ 2032 నుండి 4 దశలు చేపడుతుంది. 2032లో 10 శాతం, 2037 లో 20%, 2042 లో 20%, 2042 లో 30%, 2047 లో 80% తగ్గింపుతో హెచ్‌ఎఫ్‌సి తగ్గింపు లక్ష్యాన్ని భారతదేశం పూర్తి చేస్తుంది.
v . మాంట్రియల్ ప్రోటోకాల్ అన్ని సవరణలు, సర్దుబాట్లు, కిగాలి సవరణకు ముందు ప్రపంచ వ్యాప్త మద్దతు ఉంది
నేపథ్యం:
(i) ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్-లేయర్ పదార్థాలు (ఓడిఎస్) అని పిలిచే, మనిషి వల్ల తయారైన, రసాయనాల ఉత్పత్తి. దీని వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయడం ద్వారా ఓజోన్ పొర రక్షణ కోసం కుదుర్చుకున్న ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం. , సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల హానికరమైన స్థాయిల నుండి స్ట్రాటో ఆవరణ ఓజోన్ \ పొర మానవులను, పర్యావరణాన్ని రక్షిస్తుంది.
(ii) 19 జూన్ 1992 న ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్‌కు భారతదేశం ఒక పార్టీగా మారింది. అప్పటి నుండి మాంట్రియల్ ప్రోటోకాల్‌కు సవరణలను ఆమోదిస్తూ వస్తోంది. ప్రస్తుత కేబినెట్ ఆమోదం ద్వారా హైడ్రోఫ్లోరోకార్బన్‌లను దశలవారీగా తగ్గించడానికి మాంట్రియల్ ప్రోటోకాల్‌కు కిగాలి సవరణను భారతదేశం ఆమోదిస్తోంది.
(iii) మాంట్రియల్ ప్రోటోకాల్ షెడ్యూల్ ప్రకారం అన్ని ఓజోన్ క్షీణత పదార్థాల, దశలవారీ లక్ష్యాలను భారతదేశం విజయవంతంగా పూర్తి చేస్తోంది.
******
(Release ID: 1747144)
Visitor Counter : 306